చిట్కాలు

ఏం చేసినా షుగ‌ర్ త‌గ్గ‌డం లేదా..? ఈ చిట్కాల‌ను పాటించండి..!

డయాబెటిస్ అనేది తీవ్ర అనారోగ్య సమస్య అయింది. ప్రపంచవ్యాప్తంగా షుగర్ వ్యాధి రోగుల సంఖ్య పెరుగుతోంది. నయం చెయ్యడం కుదరని ఈ వ్యాధిని నియంత్రించాల్సి వుంటుంది. అలా నియంత్రించేందుకు కొన్ని చిట్కాలు. ప్రతిరోజు ఒక స్పూన్ మెంతులు ఒక గ్లాస్ నీళ్లలో వేసి రాత్రంతా నానబెట్టాలి. ఉదయం లేవగానే ఆ నీళ్ళు తాగి, నానిన మెంతులు తింటే అది ఇన్సులిన్‌లా పనిచేస్తుందంటారు.

ప్రతిరోజు ఉదయం క్రమం తప్పకుండా విత్తనాలు తీసేసిన కాకరకాయ రసాన్ని తాగాలి. పచ్చి అరటిపండు పైతొక్క తీసి ఒక పాత్రలో వేసి దానిమీద నీళ్ళు పోసి రాత్రంతా వుంచి తెల్లవారిన తర్వాత ఆ నీటిని మూడు భాగాలు చేసి రోజుకు మూడుసార్లు తాగాలి.

follow these wonderful home remedies to reduce diabetes

ఒక కప్పు నీళ్ళలో మామిడి ఆకులు 13 నుండి 16 వేసి బాగా మరిగించి, రాత్రంతా చల్లారనిచ్చి ఉదయం వడకట్టి ఆ నీటిని పరగడుపున తాగాలి. వెల్లుల్లి తినాలి లేదా వెల్లుల్లి కలిగిన మాత్రలు సేవిస్తే షుగర్ వ్యాధి అదుపులో వుంటుంది.

Admin

Recent Posts