చిట్కాలు

ఇలా చేస్తే మైగ్రేన్ త‌ల‌నొప్పిని క్ష‌ణాల్లో త‌గ్గించుకోవ‌చ్చు తెలుసా..?

మైగ్రేన్‌..! దీన్నే పార్శ్వపు తలనొప్పి అని కూడా అంటారు. ఈ తలనొప్పి చాలా వరకు తలకు ఒక పక్క వస్తుంది. ఇది స్త్రీలలో అధికంగా వస్తుంది. కొంద‌రికి వాంతులు అవుతాయి కూడా. క‌డుపులో వికారంగా కూడా అనిపిస్తుంది. తలలోని రక్తనాళాలు ఒత్తిడికి లోనయి వాయ‌డం వల్ల ఈ నొప్పి వస్తుంది. చాలా మంది ఈ నొప్పి తలలో ఒకవైపే వస్తుందని భావిస్తుంటారు. కానీ కొన్నిసార్లు రెండు వైపులా కూడా రావచ్చు. అయితే త‌ల‌కు ఎటు వైపు వ‌చ్చినా ఈ రకం తలనొప్పి చాలా తీవ్రంగా ఉంటుంది. తలలో కొట్టుకుంటున్నట్లుగా, వస్తూ పోతున్నట్లుగా, తగ్గుతూ, తీవ్రమవుతున్నట్టు ఉంటుంది. ఇలాంటి వారికి అవ‌త‌లి వారు ఎవరన్నా మాట్లాడితే చికాకుగా ఉంటుంది.

శబ్దాలు వినబుద్ధి కాదు, వెలుతురు చూడబుద్ధి కాదు. ప్రయాణం చేసినా, ఎండలో ఎక్కువగా తిరిగినా, భోజనం ఆలస్యమైనా లేక అస్సలు తినకపోయినా, నిద్ర తక్కువైనా లేక మరీ ఎక్కువైనా… ఇలాంటి సందర్భాలన్నింటిలోనూ ఈ రకం తలనొప్పి రావచ్చు. వాస్తవానికి ఇవన్నీ పార్శ్వనొప్పిని ప్రేరేపించేవే గానీ పార్శ్వనొప్పికి మూలకారణాలు కావు. పార్శ్వనొప్పి జన్యుపరమైన సమస్య. వంశంలో ఎవరికైనా ఉంటే మనకూ రావచ్చు. పురుషుల్లోనూ ఉండొచ్చు. కానీ ముఖ్యంగా స్త్రీలలో ఎక్కువగా ఇలాంటి త‌ల‌నొప్పి వ‌స్తుంటుంది. అయితే మైగ్రేన్ నొప్పిని శాశ్వతంగా తగ్గించే మందేదీ లేదు. కాకపోతే దీన్ని తగ్గించి, నియంత్రించేందుకు వైద్యులు మందులు ఇస్తారు. అయితే అవి కొంత ఉప‌శ‌మ‌నాన్ని మాత్ర‌మే క‌లిగిస్తాయి. కానీ ఎప్ప‌టిలా మ‌ళ్లీ మైగ్రేన్ వ‌చ్చేందుకు అవ‌కాశం ఉంటుంది.

follow this wonderful home remedy to reduce migraine pain

ఈ క్ర‌మంలో దీర్ఘ కాలం పాటు అలా వైద్యులు ఇచ్చే మందుల‌ను వాడినా దాని వ‌ల్ల ఇత‌ర సైడ్ ఎఫెక్ట్స్ క‌లుగుతాయి. అయితే అలాంటి సైడ్ ఎఫెక్ట్స్ క‌ల‌గ‌కుండా, మైగ్రేన్ త‌ల‌నొప్పిని ఎఫెక్టివ్‌గా, ఇన్‌స్టంట్ గా త‌గ్గించుకునేందుకు ఓ చిట్కా ఉంది. అందుకు మ‌న ఇంట్లో ఉండే స‌హ‌జ సిద్ధ‌మైన ప‌దార్థాలే ఉప‌యోగ‌ప‌డ‌తాయి. అవేమిటంటే… హిమాల‌య‌న్ సాల్ట్‌. ఇది మ‌న‌కు సూప‌ర్ మార్కెట్‌ల‌లో దొరుకుతుంది. సాధార‌ణ ఉప్పు క‌న్నా ఇది చాలా క్వాలిటీగా ఉంటుంది.

ఒక గ్లాస్ నీటిలో స‌గం నిమ్మ‌కాయ ముక్క‌ను పిండాలి. అనంత‌రం అందులో అర టీస్పూన్ హిమాల‌య‌న్ సాల్ట్‌ను బాగా క‌ల‌పాలి. అనంత‌రం వ‌చ్చే మిశ్ర‌మాన్ని తాగితే చాలు. మైగ్రేన్ త‌ల‌నొప్పి ఇట్టే త‌గ్గుతుంది. దీని వ‌ల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండ‌వు కూడా. నిమ్మ‌కాయ‌, హిమాల‌య‌న్ సాల్ట్ రెండింటిలోనూ ఆల్క‌లైన్ గుణాలు ఉంటాయి. ఇవి శ‌రీరంలో ఉన్న ఎల‌క్ట్రోలైట్ల‌ను బ్యాలెన్స్ చేస్తాయి. దీంతోపాటు శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతాయి కూడా. అందుకే మైగ్రేన్ త‌ల‌నొప్పి ఇట్టే త‌గ్గిపోతుంది..!

Admin

Recent Posts