Gas Trouble Remedy : ప్రస్తుత కాలంలో మనలో చాలా మందిని వేధిస్తున్న జీర్ణ సంబంధిత సమస్యల్లో గ్యాస్ సమస్య ఒకటి. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ ఈ సమస్య బారిన పడుతున్నారు. గ్యాస్ కారణంగా కడుపులో మంట, కడుపు నొప్పి వంటి సమస్యలు తలెత్తుతాయి. పొట్టలో గ్యాస్ సమస్య బారిన పడడానికి అనేక కారణాలు ఉంటాయి. మలబద్దకం, అజీర్తి, ఆహారాన్ని సమయానికి తీసుకోకపోవడం, మాసనిక ఒత్తిడి, జంక్ ఫుడ్ ను అధికంగా తీసుకోవడం, ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం వంటి వాటిని గ్యాస్ సమస్య బారిన పడడానికి ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. గ్యాస్ సమస్యను తేలికగా తీసుకోకూడదు. దీనిని నిర్లక్ష్యం చేస్తే మనం ఇతర అనేక అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉంది.
కొన్ని ఇంటి చిట్కాలను ఉపయోగించి మనం ఈ గ్యాస్ సమస్య నుండి బయట పడవచ్చు. మన వంటింట్లో ఉండే సహజ సిద్ద పదార్థాలను ఉపయోగించి గ్యాస్ సమస్య నుండి ఎలా బయటపడాలో ఇప్పుడు తెలుసుకుందాం. గ్యాస్ సమస్యను తగ్గించే ఈ చిట్కాను తయారు చేసుకోవడానికి గానూ మనం సోంపు గింజలను, వామును ఉపయోగించాల్సి ఉంటుంది. గ్యాస్ సమస్యను తగ్గించడంలో మనకు వాము, సోంపు గింజలు ఎంతగానో ఉపయోగపడతాయి. దీని కోసం ముందుగా వామును, సోంపు గింజలను సమపాళ్లల్లో తీసుకుని మెత్తని పొడిలా చేసుకోవాలి. తరువాత ఈ పొడిని ఒక అర టీ స్పూన్ మోతాదులో ఒక గ్లాస్ మజ్జిగలో కలిపి తాగాలి. ఇలా తీసుకోవడం వల్ల గ్యాస్ సమస్య నుండి మనకు సత్వర ఉపశమనం లభిస్తుంది.
అజీర్తి, మలబద్దకం వంటి సమస్యలు తలెత్తకుండా ఉంటాయి. ఈ విధంగా మజ్జిగను రోజుకు ఒకటి లేదా రెండు సార్లు తీసుకోవడం వల్ల గ్యాస్ సమస్య నుండి ఉపశమనం కలుగుతుంది. అలాగే గ్యాస్ సమస్యను తగ్గించే మరో చిట్కా గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ చిట్కాను తయారు చేసుకోవడానికి గానూ మనం నిమ్మరం, పసుపు, జీలకర్ర పొడి, ఉప్పును ఉపయోగించాల్సి ఉంటుంది. ఒక గిన్నెలో అర టీ స్పూన్ పసుపును, అర చెక్క నిమ్మరసాన్ని, చిటికెడు ఉప్పును, ఒక టీ స్పూన్ జీలకర్ర పొడిని వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని నేరుగా తీసుకోవచ్చు.
ఇలా తీసుకోలేని వారు ఒక గ్లాస్ ఈ నీటిలో కలిపి తీసుకోవచ్చు. ఈ చిట్కాను పాటించడం వల్ల గ్యాస్ సమస్య నుండి మనం చాలా సులభంగా బయటపడవచ్చు. గ్యాస్ సమస్యతో బాధపడే వారు మార్కెట్ లో దొరికే సిరప్ లను, పొడులను వాడడానిక బదులుగా ఇలా ఇంట్లో ఉండే సహజ పదార్థాలను ఉపయోగించి గ్యాస్ సమస్య నుండి బయటపడడం ఉత్తమం. అలాగే చక్కటి జీవన విధానాన్ని పాటిస్తూ, పీచు పదార్థాలు ఉన్న ఆహారాన్ని ఎక్కువగా తీసుకుంటూ, నీటిని ఎక్కువగా తాగుతూ ఉండడం వల్ల గ్యాప్ సమస్య తలెత్తకుండా ఉంటుంది.