Guntagalagara For Hair : ఆయుర్వేదంలో అనేక రకాల మొక్కల గురించి వివరంగా చెప్పారు. మన చుట్టూ ఉండే ప్రకృతిలోనూ ఎన్నో రకాల ఔషధ మొక్కలు పెరుగుతుంటాయి. కానీ వాటి గురించి చాలా మందికి తెలియదు. వాటిని చూస్తే మనం పిచ్చి మొక్కలు అనుకుని తీసేస్తుంటాం. అలాంటి మొక్కల్లో గుంటగలగర మొక్క కూడా ఒకటి. ఇది చూసేందుకు పిచ్చి మొక్కలాగా ఉంటుంది. కానీ దీంతో బోలెడు ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా ఈ మొక్కతో మనం జుట్టు సమస్యలను తగ్గించుకోవచ్చు. దీన్నే భృంగరాజ్ మొక్క అని కూడా అంటారు. ఇక దీంతో తయారు చేసే ఓ నూనెను వాడడం వల్ల తెల్ల జుట్టు నల్లగా మారుతుంది. అలాగే జుట్టు దృఢంగా, ఆరోగ్యంగా ఉంటుంది. ఈ నూనెను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
గుంటగలగర మొక్కను వేర్లతో సహా సేకరించాలి. దీన్ని శుభ్రంగా కడగాలి. అనంతం మిక్సీలో వేసి రసం తీయాలి. ఎలాంటి నీళ్లను కలపరాదు. రసం తక్కువ వస్తుందనుకుంటే ఇంకో మొక్కను తీసుకుని అలాగే చేయాలి. ఇలా తీసిన రసానికి సమాన మోతాదులో కొబ్బరినూనె లేదా నువ్వుల నూనె కలపాలి. అనంతరం ఈ మిశ్రమాన్ని మందపాటి గిన్నెలో వేసి వేడి చేయాలి. సన్నని మంటపై కేవలం నూనె మాత్రమే మిగిలే వరకు మరిగించాలి. తరువాత వచ్చే మిశ్రమాన్ని చల్లార్చి సీసాలో నిల్వ చేయాలి.
ఇలా తయారు చేసిన నూనెను మీరు వాడే నూనెకు బదులుగా వాడవచ్చు. దీన్ని రాస్తుండడం వల్ల తెల్ల జుట్టు నల్లగా మారడమే కాదు.. శిరోజాలు ఎంతో పొడవుగా, దృఢంగా పెరుగుతాయి. గుంటగలగర మొక్క జుట్టు సమస్యలను తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. ఇక ఈ మొక్కలతో ఎప్పుడు కావాలంటే అప్పుడు నూనెను తయారు చేసుకుని ఉపయోగించవచ్చు. దీని వల్ల ఎంతగానో మేలు జరుగుతుంది. అన్ని రకాల జుట్టు సమస్యలకు ఈ నూనె అద్భుతంగా పనిచేస్తుంది. కనుక గుంటగలగర మొక్క ఎక్కడ కనిపించినా సరే విడిచిపెట్టకుండా ఇంటికి తెచ్చుకోండి. అవసరం అయితే ఇంట్లోనే దీన్ని పెంచుకోండి. దీంతో ఎంతో లాభం పొందవచ్చు.