Hair Fall Health Tips : కేవ‌లం ఈ 2 చాలు.. జుట్టు అస‌లు ప‌ట్టుకుని లాగినా కూడా ఊడిరాదు..!

Hair Fall Health Tips : నేటి త‌రుణంలో మ‌న‌లో చాలా మంది ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ల్లో జుట్టు రాల‌డం కూడా ఒక‌టి. వ‌య‌సుతో సంబంధం లేకుండా అంద‌రూ ఈ స‌మ‌స్యతో బాధ‌ప‌డుతూ ఉంటారు. ముఖ్యంగా యువ‌త ఈ స‌మ‌స్య బారిన ఎక్కువ‌గా ప‌డుతూ ఉంటారు. జుట్టు రాల‌డానికి అనేక కార‌ణాలు ఉన్న‌ప్ప‌టికి వాటిలో ముఖ్య‌మైన‌ది వేడి నీటితో త‌ల‌స్నానం చేయ‌డం ఒక‌ట‌ని నిపుణులు చెబుతున్నారు. శ‌రీరంలో నొప్పులు త‌గ్గ‌డానికి, జుట్టు మురికి ఎక్కువ‌గా పోతుంద‌ని చాలా మంది వేడి నీటితో త‌ల‌స్నానం చేస్తూ ఉంటారు. వేడి నీటితో త‌ల‌స్నానం చేయ‌డం వ‌ల్ల ఒత్తిడి త‌గ్గి రిఫ్రెషింగ్ గా ఉన్న‌ప్ప‌టికి జుట్టు ఎక్కువ‌గా ఊడిపోతుంద‌ని నిపుణులు చెబుతున్నారు. వేడి నీటితో త‌ల‌స్నానం చేయ‌డం వ‌ల్ల జుట్టు కుదుళ్ల‌కు ర‌క్త‌ప్ర‌స‌ర‌ణ త‌గ్గుతుంది. ఆక్సిజ‌న్ తో పాటు పోష‌కాలు కూడా జుట్టు కుదుళ్ల‌కు త‌క్కువ‌గా అందుతాయి.

దీంతో జుట్టు కుదుళ్లు బ‌ల‌హీన ప‌డి జుట్టు ఎక్కువ‌గా ఊడిపోతుంద‌ని నిపుణులు చెబుతున్నారు. చాలా మంది త‌ల శుభ్రంగా ఉండాల‌న్నా ఆలోచ‌న‌తో ప్ర‌తిరోజూ వేడి నీటితో త‌ల‌స్నానం చేస్తూ ఉంటారు. దీంతో క్ర‌మంగా జుట్టు రాలిపోతూ ఉంటుంది. క‌నుక వేడి నీటికి బ‌దులుగా చ‌ల్ల‌టి నీటితో లేదా గోరు వెచ్చ‌ని నీటితో త‌ల‌స్నానం చేయాల‌ని నిపుణులు సూచిస్తున్నారు. చ‌ల్ల‌టి నీటితో త‌ల‌స్నానం చేయ‌డం వ‌ల్ల జుట్టు కుదుళ్ల‌కు ర‌క్త‌ప్ర‌స‌ర‌ణ ఎక్కువ‌గా జ‌రుగుతుంది. దీంతో పోష‌కాలు, ఆక్సిజ‌న్ జుట్టు కుదుళ్ల‌కు చ‌క్క‌గా అందుతాయి. సాధార‌ణంగానే మ‌నకు ఉండే ఒత్తిడి, త‌ల‌లో వేడి కార‌ణంగా త‌ల‌కు ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రా త‌క్కువ‌గా ఉంటుంది. దీనితో పాటుగా మ‌నం వేడి నీటితో త‌ల‌స్నానం చేయ‌డం వ‌ల్ల ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రా మ‌రింత‌గా త‌గ్గుతుంది. క‌నుక త‌ల‌స్నానం ఎప్పుడూ కూడా చ‌ల్ల‌టి నీటితో లేదా గోరు వెచ్చ‌ని నీటితో చేసే ప్ర‌య‌త్నం చేయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల జుట్టు రాల‌డం త‌గ్గుతుంది.

Hair Fall Health Tips follow these to get rid of the problem
Hair Fall Health Tips

ఇక జుట్టు రాల‌డానికి గ‌ల మ‌రొక ముఖ్య‌మైన కార‌ణం ప్రోటీన్ లోపం. జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే ప్రోటీన్ చాలా అవ‌స‌రం. ఊడిన జుట్టు స్థానంలో మ‌ర‌లా కొత్త జుట్టు రావాలన్నా, జుట్టు ఒత్తుగా, పొడ‌వుగా పెర‌గాల‌న్నా ప్రోటీన్ చాలా అవ‌స‌రం. జుట్టు ఎక్కువ‌గా రాలుతున్న వారు, ఈ స‌మ‌స్య రాకూడ‌దు అనుకున్న వారు ముఖ్యంగా ప్రోటీన్ ఎక్కువ‌గా ఉండే ఆహారాల‌ను తీసుకోవాలి. ప్రోటీన్ ఎక్కువ‌గా ఉండే వాటిల్లో మీల్ మేక‌ర్ ఒక‌టి. 100 గ్రాముల మీల్ మేక‌ర్ లో 53 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. వీటిని వంట‌ల్లో వాడ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి కావ‌ల్సినంత ప్రోటీన్ అందుతుంది. త‌గినంత ప్రోటీన్ అంద‌డం వ‌ల్ల జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. అలాగే వీటితో పాటు ఆకుకూర‌ల‌ను కూడా ఎక్కువ‌గా తీసుకోవాలి. ఆకుకూర‌ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో ర‌క్తం ఎక్కువ‌గా త‌యార‌వుతుంది. జుట్టు కుదుళ్ల‌కు ర‌క్త‌ప్ర‌స‌ర‌ణ ఎక్కువ‌గా జ‌రిగి పోష‌కాలు చ‌క్క‌గా అందుతాయి. ఈ విధంగా చ‌ల్ల‌టి నీటి త‌ల‌స్నానంతో పాటు చ‌క్క‌టి ఆహారాన్ని తీసుకోవ‌డం వ‌ల్ల జుట్టు రాల‌డం త‌గ్గి జుట్టు ఒత్తుగా, అందంగా పెరుగుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు.

D

Recent Posts