Hair Growth Tip : రాత్రి పూట దీన్ని రాసి ఉద‌యం త‌ల‌స్నానం చేయండి.. జుట్టు అస‌లు రాల‌దు..!

Hair Growth Tip : ప్ర‌స్తుత కాలంలో జుట్టు సంబంధిత స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారు ఎక్కువవుతున్నారు. జుట్టు రాల‌డం, జుట్టు తెగిపోవ‌డం, జుట్టు చిట్ల‌డం, చుండ్రు, జుట్టు పొడిబార‌డం వంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారు మ‌న‌లో చాలా మంది ఉన్నారు. జుట్టు స‌మ‌స్య‌లు తలెత్త‌డానికి అనేక కార‌ణాలు ఉంటాయి. వాతావ‌ర‌ణ కాలుష్యం, పోష‌కాహార లోపం, ర‌సాయ‌నాలు క‌లిగిన షాంపుల‌ను, హెయిర్ డైల‌ను వాడ‌డం వంటి వివిధ కార‌ణాల చేత జుట్టు స‌మ‌స్య‌లు త‌లెత్తుతూ ఉంటాయి. జుట్టు రాల‌డాన్ని త‌గ్గించుకోవ‌డానికి చాలా మంది అనేక ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తూ ఉంటారు. కానీ ఎటువంటి ఫ‌లితం లేక ఎన్నో ఇబ్బందుల‌కు గురి అవుతూ ఉంటారు. ఇలాంటి వారు ఒక చ‌క్క‌టి చిట్కాను వాడ‌డం వ‌ల్ల చాలా సుల‌భంగా జుట్టు రాల‌డాన్ని త‌గ్గించుకోవ‌చ్చు.

ఈ చిట్కాను వాడ‌డం వ‌ల్ల జుట్టు ఒత్తుగా, పొడ‌వుగా పెరుగుతుంది. అంతేకాకుండా ఈ చిట్కాను వాడ‌డం వల్ల చుండ్రు స‌మ‌స్య కూడా త‌గ్గుతుంది. జుట్టు రాల‌డాన్ని త‌గ్గించి జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుప‌రిచే ఈచిట్కా ఏమిటి.. దీనిని ఎలా త‌యారు చేసుకోవాలి.. ఎలా వాడాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ చిట్కాను త‌యారు చేసుకోవ‌డానికి గానూ మ‌నం మూడు టీ స్పూన్ల క‌ల‌బంద గుజ్జును తీసుకోవాలి. త‌రువాత రెండు టీ స్పూన్ల కొబ్బ‌రి నూనెను వేసి క‌ల‌పాలి. ఇలా త‌యారు చేసుకున్న మిశ్ర‌మాన్ని జుట్టు కుదుళ్ల‌కు బాగా ప‌ట్టించాలి. త‌రువాత 5 నిమిషాల పాటు నెమ్మ‌దిగా మ‌ర్ద‌నా చేసుకోవాలి. త‌రువాత జుట్టుకు హెయిర్ క్యాప్ ను పెట్టుకుని దీనిని రాత్రంతా అలాగే ఉంచాలి.

Hair Growth Tip remedy that works perfectly
Hair Growth Tip

ఉద‌యాన్నే ర‌సాయ‌నాలు త‌క్కువ‌గాఉండే షాంపుతో లేదా ఆయుర్వేద షాంపుతో త‌ల‌స్నానం చేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేయ‌డం వ‌ల్ల జుట్టు రాల‌డం త‌గ్గుతుంది. జుట్టుకు కావ‌ల్సిన పోష‌కాల‌న్నీ అంది జుట్టు కుదుళ్లు బలంగా, ధృడంగా త‌యార‌వుతాయి. చుండ్రు స‌మ‌స్యతో పాటు త‌ల‌లో దుర‌ద‌లు కూడా తగ్గుతాయి. జుట్టు కాంతివంతంగా, మృదువుగా త‌యార‌వుతుంది. జుట్టు స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారు ఈ చిట్కాను వాడ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితాల‌ను పొంద‌వ‌చ్చు.

D

Recent Posts