Hair Growth Tip : మనలో చాలా మంది జుట్టు సమస్యలతో బాధపడుతూ ఉంటారు. జుట్టు రాలడం, జుట్టు పెరుగుదల ఆగడం, జుట్టు తెల్లగా మారడం, వెంట్రుకల తెగిపోవడం ఇలా రకరకాల జుట్టు సమస్యలతో బాధపడుతూ ఉంటారు. కారణాలేవైనప్పటికి చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ ఈ సమస్యలతో బాధపడుతూ ఉంటారు. జుట్టు చక్కగా పెరగాలని రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. రకరకాల చిట్కాలను వాడుతూ ఉంటారు. చాలా మంది జుట్టు పెరుగుదలకు మందార ఆకులను వాడుతూ ఉంటారు. యమందార ఆకులను పేస్ట్ గా చేసి పట్టిస్తూ ఉంటారు. అలాగే మందార ఆకులను నూనెలో వేసి వేడి చేసి తలకు పట్టిస్తూ ఉంటారు. అయితే మందార ఆకులను వాడడం వల్ల అసలు ఫలితం ఉంటుందా.. మందార ఆకులు జుట్టు మేలు చేస్తాయా.. లేదా…అసలు నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
జుట్టు సమస్యలను తగ్గించుకోవడానికి మందార ఆకులను పూర్వకాలం నుండి ఉపయోగిస్తున్నారు. మందార ఆకులను వాడడం వల్ల మన జుట్టుకు ఎంతో మేలు కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. మందార ఆకులను వాడడం వల్ల మనం చక్కటి ఒత్తైన జుట్టును సొంతం చేసుకోవచ్చని నిపుణులు పరిశోధనల ద్వారా వెల్లడించారు. మందార ఆకులను వాడడం వల్ల జుట్టు కుదుళ్లకు రక్తప్రసరణ పెరుగుతుంది. మందార ఆకుల్లో ఉండే ఐసో ప్లేవనాయిడ్స్ కుదుళ్లకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాలు వ్యాకోచించేలా చేసి రక్తసరఫరాను మెరుగుపరుస్తాయి. దీంతో రక్తంలో ఉండే పోషకాలు జుట్టు కుదుళ్లకు ఎక్కువగా అందుతాయి.
జుట్టు కుదుళ్లు డీహైడ్రేట్ కాకుండా ఉంటాయి. జుట్టు రాలకుండా ఉంటుంది. అలాగే మందార ఆకులో ఉండే రసాయనాలు జుట్టు కుదుళ్ల వద్ద ఉండే కణాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. దీని వల్ల జుట్టు రాలకుండా ఉండడంతో పాటు పొడవుగా పెరుగుతుంది. మందార ఆకులను వాడడం వల్ల జుట్టు నల్లగా ఉంటుంది. జుట్టు నల్లగా ఉండడానికి అవసరమయ్యే నలుపుదనాన్ని ఉత్పత్తి చేసే కణాలను మెలనోసైట్స్ అంటారు. ఇవి మెలనోనిన్ అనే నలుపు రంగును ఉత్పత్తి చేసి జుట్టు కుదుళ్లకు అందిస్తాయి. దీంతో జుట్టు నల్లగా ఉంటుంది. మెలనోనిన్ ఎంత ఎక్కువగా ఉత్పత్తి అయితే జుట్టు అంత నల్లగా ఉంటుంది.
మందార ఆకులను వాడడం వల్ల మెలనోసైట్స్ నుండి మెలనోనిన్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. దీంతో జుట్టు తెల్లబడకుండా నల్లగా ఉంటుంది. అలాగే మందార ఆకులను వాడడం వల్ల జుట్టు కుదుళ్లు డీహైడ్రేషన్ కు గురి కాకుండా ఉంటాయి. దీంతో జుట్టు చిట్లడం, జుట్టు తెగిపోవడం, జుట్టు ఎర్రగా మారడం వంటి సమస్యలు తగ్గుతాయి. ఈ విధంగా మందార ఆకులు మన జుట్టుకు ఎంతో మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. జుట్టు సమస్యలతో బాధపడే వారు ఈ ఆకులను వాడడం వల్ల మంచి ఫలితం ఉంటుందని వారు తెలియజేస్తున్నారు. మందార ఆకులను పేస్ట్ గా చేసి జుట్టుకు పట్టించడం వల్ల లేదా మందార ఆకులను నూనెలో వేసి వేడి చేసి ఆ నూనెను జుట్టుకు పట్టించడం వల్ల జుట్టు సమస్యలన్ని తగ్గుతాయి. జుట్టు ఒత్తుగా, పొడవుగా, నల్లగా పెరుగుతుంది.