Aloo Cabbage Fry : ఆలు, క్యాబేజీ.. రెండూ క‌లిపి ఇలా వండితే.. ముద్ద కూడా విడిచిపెట్ట‌కుండా మొత్తం తింటారు..!

Aloo Cabbage Fry : మ‌నం బంగాళాదుంప‌ల‌తో ఇత‌ర కూర‌గాయ‌ల‌ను క‌లిపి వండుతూ ఉంటాము. ఇలా బంగాళాదుంప‌ల‌తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో ఆలూ క్యాబేజి కూర కూడా ఒక‌టి. బంగాళాదుంప‌లు, క్యాబేజి క‌లిపి చేసే ఈ క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. అలాగే చాలా త్వర‌గా ఈ క‌ర్రీని త‌యారు చేసుకోవ‌చ్చు. బ్యాచిల‌ర్స్, వంట‌రాని వారు కూడా దీనిని సుల‌భంగా చేయ‌వ‌చ్చు. ఎంతో రుచిగా ఉండే ఈ ఆలూ క్యాబేజి క‌ర్రీని ఎలా తయారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

ఆలూ క్యాబేజి క‌ర్రీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

చిన్న‌గా త‌రిగిన క్యాబేజి – ఒక‌టిన్న‌ర క‌ప్పు, చిన్న ముక్క‌లుగా త‌రిగిన పెద్ద బంగాళాదుంప – 1, త‌రిగిన ట‌మాట – 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ -ఒక టీ స్పూన్, చిన్న‌గా త‌రిగిన ప‌చ్చిమిర్చి – 2, క‌రివేపాకు -ఒక రెమ్మ‌, ప‌సుపు – అర టీ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, తాళింపు దినుసులు -ఒక టేబుల్ స్పూన్, నూనె – 2 టేబుల్ స్పూన్స్, కారం – 2 టీ స్పూన్స్, ధ‌నియాల పొడి – ఒక టీ స్పూన్.

Aloo Cabbage Fry recipe in telugu make in this method
Aloo Cabbage Fry

ఆలూ క్యాబేజి క‌ర్రీ త‌యారీ విధానం..

ముందుగా కుక్క‌ర్ లో నూనె వేసి వేడి చేయాలి. త‌రువాత తాళింపు దినుసులు వేసి వేయించాలి. తరువాత ప‌చ్చిమిర్చి, క‌రివేపాకు వేసి వేయించాలి. త‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. త‌రువాత ప‌సుపు వేసి క‌ల‌పాలి. ఇప్పుడు బంగాళాదుంప ముక్క‌లు, క్యాబేజి తురుము వేసి క‌ల‌పాలి. దీనిపై మూత పెట్టి 2 నిమిషాల పాటు వేయించిన త‌రువాత ట‌మాట ముక్క‌లు వేసి క‌ల‌పాలి. త‌రువాత కారం, ఉప్పు, ధ‌నియాల పొడి వేసి క‌ల‌పాలి. దీనిపై మూత పెట్టి 3 నిమిషాల పాటు వేయించిన త‌రువాత పావు క‌ప్పు నీళ్లు పోసి క‌ల‌పాలి. త‌రువాత కుక్క‌ర్ మూత పెట్టి 3 విజిల్స్ వ‌చ్చే వ‌ర‌కు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. కుక్క‌ర్ ఆవిరి పోయిన త‌రువాత మూత తీసి కొత్తిమీర వేసి క‌లిపి స‌ర్వ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ఆలూ క్యాబేజి కర్రీ త‌యార‌వుతుంది. దీనిని అన్నం, చ‌పాతీ, రోటీ వంటి వాటితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ కర్రీని తిన‌డం వ‌ల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు.

D

Recent Posts