Hair Growth Tip : వారంలో రెండు సార్లు ఇలా చేస్తే చాలు.. మీ జుట్టు వ‌ద్ద‌న్నా పెరుగుతూనే ఉంటుంది..!

Hair Growth Tip : ఒక చిన్న చిట్కాను ఉప‌యోగించి మ‌నం మ‌న జుట్టు రాల‌డాన్ని త‌గ్గించుకోవ‌చ్చు. ఈ చిట్కాను వాడ‌డం వ‌ల్ల జుట్టు రాల‌డం, జుట్టు చిట్ల‌డం, తెగిపోవ‌డం, చుండ్రు వంటి స‌మ‌స్య‌లు త‌గ్గి జుట్టు ఒత్తుగా, పొడ‌వుగా పెరుగుతుంది. అలాగే ఈ చిట్కాను వాడ‌డం వ‌ల్ల ఎటువంటి దుస్ప్ర‌భావాలు కూడా ఉండ‌వు. అదే విధంగా ఈ చిట్కాను త‌యారు చేసుకోవ‌డానికి ఎక్కువ‌గా స‌మ‌యం ప‌ట్టదు. ఎక్కువ‌గా ఖ‌ర్చు కూడా అవ్వ‌దు. మ‌న జుట్టును అందంగా, ఒత్తుగా, ధృడంగా మార్చే ఈ చిట్కా ఏమిటి…దీనిని ఎలా త‌యారు చేసుకోవాలి…త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ చిట్కాను త‌యారు చేసుకోవ‌డానికి గానూ మ‌నం కేవ‌లం నాలుగు ప‌దార్థాల‌ను మాత్ర‌మే ఉప‌యోగించాల్సి ఉంటుంది. ఈ చిట్కాను త‌యారు చేసుకోవ‌డానికి గానూ మ‌నం ఒక త‌మ‌ల‌పాకును, 6 వెల్లుల్లి రెబ్బలు, ఒక టీ స్పూన్ మెంతులు, పావు లీట‌ర్ కొబ్బ‌రి నూనెను ఉప‌యోగించాల్సి ఉంటుంది.

ముందుగా ఒక గిన్నెలో వెల్లుల్లి రెబ్బ‌లను దంచి వేసుకోవాల్సి. త‌రువాత త‌మ‌ల‌పాకును ముక్క‌లుగా క‌ట్ చేసుకుని వేసుకోవాలి. త‌రువాత మెంతుల‌ను వేసుకోవాలి. ఈ నూనెను చిన్న మంట‌పై వేడి చేయాలి. త‌మ‌ల‌పాకు బాగా వేగి క్రిస్పీగా అయ్యే వ‌ర‌కు ఈ నూనెను వేడి చేసి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. త‌రువాత ఈ నూనెను పూర్తిగా చ‌ల్లారే వ‌ర‌కు అలాగే ఉంచాలి. నూనె చ‌ల్లారిన త‌రువాత వ‌డ‌క‌ట్టి గాజు సీసాలో పోసి నిల్వ చేసుకోవాలి. ఇలా త‌యారు చేసుకున్న నూనెను ఎలా వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ నూనెను జుట్టు కుదుళ్ల నుండి చివ‌రి వ‌ర‌కు బాగా ప‌ట్టించాలి. త‌రువాత నూనె చ‌ర్మంలోకి ఇంకేలా మ‌ర్ద‌నా చేసుకోవాలి. దీనిని ఒక గంట‌పాటు అలాగే ఉంచి ఆ త‌రువాత త‌ల‌స్నానం చేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేయాలి. జుట్టు ఎక్కువ‌గా రాలిపోతున్న వారు వారానికి ఇదే విధంగా వారానికి మూడు సార్లు చేయాలి.

Hair Growth Tip use this remedy weekly for better results
Hair Growth Tip

ఈ విధంగా మ‌న ఇంట్లో ఉండే ప‌దార్థాల‌తో నూనెను త‌యారు చేసుకుని వాడ‌డం వ‌ల్ల మ‌నం చాలా సుల‌భంగా జుట్టు రాల‌డాన్ని త‌గ్గించుకోవ‌చ్చు. ఈ నూనె త‌యారీలో ఉప‌యోగించిన ప్ర‌తి ప‌దార్థంలో ఎన్నో ఔష‌ధ గుణాలు ఉన్నాయి. ఈ నూనెను వాడ‌డం వ‌ల్ల జుట్టు ఒత్తుగా, న‌ల్ల‌గా, ధృడంగా పెరుగుతుంది. చుండ్రు స‌మ‌స్య కూడా నివారించ‌బ‌డుతుంది. అలాగే జుట్టు మృదువుగా, కాంతివంతంగా, మెత్త‌గా త‌యార‌వుతుంది. జుట్టు స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారు ఈ చిట్కాను ఉప‌యోగించ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితాల‌ను సొంతం చేసుకోవ‌చ్చు.

Share
D

Recent Posts