Headache : త‌ల నొప్పి ఉన్న‌ప్పుడు దీన్ని తీసుకుంటే.. వెంట‌నే త‌గ్గుతుంది..

Headache : మాన‌సిక ఆందోళ‌న ఎక్కువైనా, ఒత్తిడి ఎక్కువైనా, నిద్ర స‌రిగ్గా పోక‌పోయినా ముందుగా మ‌న‌కు త‌లెత్తే స‌మ‌స్య త‌ల‌నొప్పి. కొంద‌రిలో వారు తీసుకునే ఆహారం ద్వారా కూడా ఈ త‌ల‌నొప్పి స‌మ‌స్య త‌లెత్తుతుంది. అయితే చాలా మంది త‌ల‌నొప్పి నుండి బ‌య‌ట‌ప‌డ‌డానికి పెయిన్ కిల్ల‌ర్ ల‌ను వాడుతుంటారు. వీటిని వాడ‌డం వ‌ల్ల అప్ప‌టిక‌ప్పుడు ఉప‌శ‌మ‌నం లభించినా భ‌విష్య‌త్తుల్లో మాత్రం అనేక ర‌కాల దుష్ప్ర‌భావాల‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తుంది. స‌హ‌జ సిద్ద‌మైన చిన్న ఇంటి చిట్కాను ఉప‌యోగించి కొన్ని క్ష‌ణాల్లోనే మ‌నం త‌ల‌నొప్పిని త‌గ్గించుకోవ‌చ్చు. త‌ల‌నొప్పిని త‌గ్గించే ఈ చిట్కాను ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ చిట్కాను త‌యారు చేసుకోవ‌డానికి గానూ మ‌నం ఉప‌యోగించాల్సిన ప‌దార్థాల్లో ల‌వంగాలు ఒక‌టి.

ల‌వంగాలు ఒక మ‌సాలా దినుసుగానే మ‌నంద‌రికి తెలుసు. కానీ దీనిలో ఎన్నో ఔష‌ధ గుణాలు ఉంటాయని వీటిని వాడ‌డం వ‌ల్ల మ‌నం అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చ‌ని మ‌న‌లో చాలా మందికి తెలియ‌దు. ల‌వంగాల్లో యాంటీ ఇన్ ప్లామేట‌రీ గుణాలు ఎక్కువ‌గా ఉంటాయి. శ‌రీరంలో వ‌చ్చే నొప్పుల‌ను, కీళ్ల నొప్పుల‌ను, పంటి నొప్పుల‌ను త‌గ్గించ‌డంలో ఇవి ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. అలాగే మనం ఉప‌యోగించాల్సిన మ‌రో ప‌దార్థం సైంధ‌వ ల‌వ‌ణం. త‌ల‌లోని ద్ర‌వాల‌ను తొల‌గించి త‌ల‌నొప్పిని తగ్గించ‌డంలో ఈ సైంధ‌వ ల‌వ‌ణం మ‌న‌కు ఎంతో స‌హాయ‌ప‌డుతుంది. దీని కోసం ముందుగా ఒక రోట్లో 8 ల‌వంగాల‌ను తీసుకోవాలి. వీటిని ఒక రోట్లో వేసి మెత్త‌గా చేసుకోవాలి. త‌రువాత దీనిలో పావు టీ స్పూన్ సైంధ‌వ ల‌వణం వేసి మెత్త‌ని పొడిగా చేసుకోవాలి. ఇలా త‌యారు చేసుకున్న పొడిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి.

Headache home remedies in telugu very effective
Headache

త‌రువాత ఇందులో త‌గిన‌న్ని నీళ్లు వేసి ముద్ద‌లా చేసుకోవాలి. ఇలా త‌యారు చేసుకున్న మిశ్ర‌మాన్ని గోరు వెచ్చ‌ని ఆవు పాల‌ల్లో లేదా గేదె పాల‌ల్లో వేసి క‌ల‌పాలి. త‌ల‌నొప్పిగా ఉన్న‌ప్పుడు ఇలా పాల‌ను త‌యారు చేసుకుని తాగ‌డం వ‌ల్ల త‌ల‌నొప్పి త‌గ్గుతుంది. త‌ల‌నొప్పితో ఎక్కువ‌గా బాధ‌ప‌డుతూ ఉంటే మ‌నం తీసుకునే ఆహారంలో వెన్న‌, చాక్లెట్, మాంసం వంటి ప‌దార్థాల‌ను తొల‌గించాలి. అలాగే విట‌మిన్ బి12, సి, డి, మాంస‌కృత్తులు, క్యాల్షియం ఎక్కువ‌గా ఉండే ఆహారాల‌ను తీసుకోవాలి. మెంతులు, క్యాలీప్ల‌వ‌ర్, క్యాబేజి, ఆకుకూర‌లు ఎక్కువ‌గా తీసుకోవ‌డం వ‌ల్ల కూడా త‌ల‌నొప్పి స‌మ‌స్య రాకుండా ఉంటుంది. అలాగే ప్ర‌తిరోజూ త‌గిన‌న్ని నీళ్లు తాగ‌డం కూడా చాలా అవ‌స‌రం. అలాగే ప్ర‌తిరోజూ 8 గంట‌ల పాటు త‌ప్ప‌కుండా నిద్ర‌పోవాలి. ఈ చిట్కాల‌ను పాటించ‌డం వ‌ల్ల స‌హ‌జంగానే మ‌నం త‌ల‌నొప్పిని త‌గ్గించుకోవ‌చ్చు.

Share
D

Recent Posts