తుల‌సి నీళ్ల‌ను ఈ స‌మ‌యంలో తాగండి.. అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి‌..!

ఆరోగ్యంగా ఉండ‌డం కోసం నిత్యం మ‌నం చాలా అల‌వాట్ల‌ను పాటిస్తుంటాం. ఉద‌యం లేవ‌గానే యోగా, వ్యాయామం చేస్తుంటాం. దీంతో ఆరోగ్యంగా ఉండ‌వ‌చ్చు. అయితే ఆరోగ్యంగా ఉండేందుకు తుల‌సి నీళ్లు కూడా ఎంతో అద్భుతంగా ప‌నిచేస్తాయి. ముఖ్యంగా ఈ నీళ్ల‌ను రోజూ ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే తాగితే ఎన్నో అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

health benefits of drinking holy basil water

ఒక క‌ప్పు నీటిలో నాలుగైదు తుల‌సి ఆకుల‌ను వేసి 5 నిమిషాల పాటు మ‌రిగించాలి. అనంత‌రం వ‌చ్చే నీటిని ప‌ర‌గ‌డుపునే తాగాలి. దీంతో ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి.

* తుల‌సి ఆకుల్లో యాంటీ ఇన్‌ఫ్లామేట‌రీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి. ఇవి శ‌రీరంలోని వ్య‌ర్థాల‌ను బ‌య‌ట‌కు పంపుతాయి. దీంతో శ‌రీరం అంత‌ర్గ‌తంగా శుభ్ర‌మ‌వుతుంది. శ‌రీరానికి శ‌క్తి ల‌భిస్తుంది.

* తుల‌సి నీళ్ల‌ను తాగడం వ‌ల్ల ఒత్తిడి, ఆందోళ‌న‌, డిప్రెష‌న్ వంటి స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. మ‌న‌స్సు ప్ర‌శాంతంగా మారుతుంది.

* డ‌యాబెటిస్‌తో బాధ‌ప‌డేవారు ఈ నీటిని తాగితే వారి ర‌క్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. డ‌యాబెటిస్ నియంత్ర‌ణ‌లో ఉంటుంది.

* తుల‌సి నీళ్లు ఆస్త‌మా, ద‌గ్గు, జ‌లుబు వంటి స‌మ‌స్య‌లు ఉన్న‌వారికి ఎంత‌గానో మేలు చేస్తాయి. ఆయా స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

* అధిక బ‌రువు త‌గ్గాల‌నుకునేవారు నిత్యం ఈ నీటిని తాగితే ప్ర‌యోజ‌నం ఉంటుంది.

* తుల‌సి నీళ్ల‌ను తాగితే జీర్ణ‌క్రియ మెరుగుప‌డుతుంది. గ్యాస్‌, మ‌ల‌బ‌ద్ద‌కం ఉండ‌వు.

* నీర‌సంగా, నిస్స‌త్తువ‌గా, అల‌స‌ట‌గా ఉండేవారు ఈ నీటిని తాగ‌డం వ‌ల్ల ప్ర‌యోజ‌నం ఉంటుంది. ముఖ్యంగా బ‌ద్ద‌కం త‌గ్గుతుంది.

Admin

Recent Posts