Health Tips : పెద్ద పేగును మొత్తం శుభ్రం చేసే అద్భుత‌మైన చిట్కా.. ఇలా చేస్తే మ‌లం మొత్తం దెబ్బ‌కు బ‌య‌ట‌కు వ‌స్తుంది..!

Health Tips : మ‌న శ‌రీరంలో ఎప్ప‌టిక‌ప్పుడు వ్య‌ర్థాలు పేరుకుపోతుంటాయ‌న్న సంగ‌తి తెలిసిందే. మ‌నం తినే ఆహారంతోపాటే తాగే ద్ర‌వాలు, ఇత‌ర కార‌ణాల వ‌ల్ల మ‌న శ‌రీరంలో వ్య‌ర్థాలు పేరుకుపోతాయి. అయితే వాటిని శ‌రీరం ఎప్ప‌టిక‌ప్పుడు బ‌య‌ట‌కు పంపుతుంది. ఈ క్ర‌మంలోనే ద్ర‌వాలు మూత్రం ద్వారా, చెమ‌ట రూపంలో, ఘ‌నాహారం మ‌లం రూపంలో బ‌య‌ట‌కు వ‌స్తుంది. కానీ పెద్ద పేగు శుభ్రంగా లేక‌పోతే మ‌నం తిన్న ఘ‌నాహారం నుంచి వెలువ‌డే వ్య‌ర్థాలు సుల‌భంగా బ‌య‌ట‌కుపోవు. దీంతో మ‌లం అలాగే ఉంటుంది. ఇది స‌మ‌స్య‌ల‌ను సృష్టిస్తుంది. ఆయుర్వేద ప్ర‌కారం వ్య‌ర్థాలు మ‌న శ‌రీరంలో పేరుకుపోతే మ‌న శ‌రీరం విష తుల్యంగా మారుతుంది. క‌నుక రోజూ మ‌ల విస‌ర్జ‌న స‌రిగ్గా ఉండేలా చూసుకోవాలి.

Health Tips clean large intestine in this way home remedy
Health Tips

కానీ కొంద‌రికి మ‌ల విస‌ర్జ‌న స‌రిగ్గా కాదు. దీనికి కార‌ణం వ్య‌ర్థాలు పేరుకుపోవ‌డ‌మే అని చెప్ప‌వ‌చ్చు. దీంతో మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య ఏర్ప‌డుతుంది. ఫ‌లితంగా మ‌లం స‌రిగ్గా రాదు. దీని వెంబ‌డే గ్యాస్‌, అజీర్ణం స‌మ‌స్య‌లు కూడా వ‌స్తాయి. ఒక్కోసారి విరేచ‌నాలు కూడా అవుతాయి. క‌నుక శ‌రీరంలోని వ్య‌ర్థాలు ఎప్ప‌టిక‌ప్పుడు బ‌య‌ట‌కు వెళ్తున్నాయా.. లేదా.. అనే విష‌యాన్ని జాగ్ర‌త్త‌గా గ‌మ‌నించాలి. దీంతో మ‌నం ఆరోగ్యంగా ఉండ‌వ‌చ్చు. అయితే వ్య‌ర్థాలు స‌రిగ్గా బ‌య‌ట‌కు రాక‌పోతే.. అందుకు పెద్ద పేగును శుభ్రం చేయాల్సి ఉంటుంది. మ‌రి ఇందుకు ఉప‌యోగ‌ప‌డే అద్భుత‌మైన చిట్కా ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!

మ‌న‌కు సబ్జా గింజ‌లు అందుబాటులో ఉంటాయ‌న్న విష‌యం తెలిసిందే. వీటిని శ‌రీరం చ‌లువ చేస్తుంద‌ని తాగుతుంటారు. నీటిలో వీటిని వేసి నాన‌బెట్ట‌గానే ఇవి విస్త‌రించుకుంటాయి. సైజుగా పెద్ద‌గా మారి తెల్ల‌గా అవుతాయి. అనంత‌రం వీటిని తీసుకోవాలి. ఇలా స‌బ్జా గింజ‌ల‌ను 2 టీస్పూన్ల మోతాదులో తీసుకుని ఉద‌యం ఒక గ్లాస్ నీటిలో నాన‌బెట్టాలి. రాత్రి పూట నిద్ర‌కు ముందు ఈ నీటిని స‌బ్జా గింజ‌ల‌తో స‌హా అలాగే తాగేయాలి. ఇలా రోజూ చేయాలి.

ఈ విధంగా చిట్కాను పాటించ‌డం వ‌ల్ల పేగుల్లో ఉండే మ‌లం మొత్తం బ‌య‌ట‌కు వ‌స్తుంది. మ‌రుస‌టి రోజు సుఖంగా విరేచ‌నం అవుతుంది. వ్య‌ర్థాలు అన్నీ బ‌య‌ట‌కు వ‌చ్చేస్తాయి. పేగులు శుభ్రంగా మారుతాయి. దీంతో జీర్ణ‌వ్య‌వ‌స్థ ఆరోగ్యంగా ఉంటుంది. క‌నుక స‌బ్జా గింజ‌ల‌ను రోజూ తీసుకోవ‌డం వ‌ల్ల పెద్ద‌పేగును ఆరోగ్యంగా ఉంచుకోవ‌చ్చు. దీంతో అనేక ర‌కాల జీర్ణ స‌మ‌స్య‌లు రాకుండా ముందుగానే నివారించ‌వ‌చ్చు.

Editor

Recent Posts