చిట్కాలు

మందారంతో జ‌ట్టు స‌మ‌స్య‌ల‌కు చెక్ పెట్టండిలా..

మహిళ అందంలో జడే కీలక పాత్ర పోషిస్తోంది. పాతరోజుల్లో జడ బారుగా ఉందని పెళ్లిళ్లు చేసుకున్నవాళ్లూ లేకపోలేదు. ప్రస్తుతం ట్రెండ్‌ మారింది. హాఫ్‌ కట్‌ స్టైల్‌ నడుస్తోంది. మరోవైపు జట్టు రాలే సమస్య కూడా తీవ్రంగా పరిణమిస్తోంది. వాయు, నీటికాలుష్యాలు, పోషకాహార లోపం కారణంగా జట్టు రాలు సమస్య ఎక్కువవుతోంది. వీటికితోడుగా వివిధ సౌందర్య సాధనాల వల్ల కూడా సమస్య తీవ్రమవుతోంది.

వాస్తవంగా చెప్పాలంటే నూటికి 99 మంది జట్టు రాలే సమస్యను ఎదుర్కొంటున్నారు. జుట్టు పెరుగుదలకోసం పురాతన కాలం నుండే మందారంను ఉపయోగిస్తున్నారు. ఇది జుట్టు రాలడం నివారించి, జుట్టు పెంచడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం..

– మందార పూలు తీసుకుని పేస్ట్‌ చేసి, దానికి ఆముదం కలిపి తలకు పట్టించాలి. త‌ర్వాత చల్లని నీటితో తల స్థానం చేయాలి. ఇలా చేయడం వల్ల జుట్టు మృదువుగా ఉండటంతో పాటు బలంగా ఉండి, ఒత్తుగా పెరుగుతుంది.

here it is how hibiscus benefits hair

– మందారం ఆకులు, గోరింటాకు కొబ్బరినూనెలో వేసి నూనె కాగబెట్టాలి. ఈ మిశ్రమాన్ని నిల్వ ఉంచుకుని తలకు పట్టిస్తే జట్టురాలే సమస్య తగ్గుతుంది.

– మందారం పువ్వును వాటర్ తో మిక్స్ చేసి పేస్ట్ చేయాలి. దీన్ని తలకు అప్లై చేసి గంట షాంపుతో తలస్నానం చేయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది.

– మందారపువ్వు పేస్ట్‌లో శెనగపిండి, పెరుగును క‌లిపి మెత్తగా చేసుకోవాలి. ఈ పేస్ట్ తలకు ప‌ట్టించి, కొంత స‌మ‌యం త‌ర్వాత‌ శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల జుట్టు రాల‌డం త‌గ్గుతుంది.

– మందార ఆకులను నానిన మెంతులతో కలిపి మెత్తగా నూరి తలకు ప్యాక్‌గా వేసి ఆరిన తర్వాత కుంకుడు కాయలతో తల స్నానం చేస్తే జట్టు మృదువుగా మారుతుంది.

– కొబ్బరినూనెలో మందార‌ పూలను వేసి మరిగించి, చల్లారిన తర్వాత తలకు రాసుకుంటే జట్టు ఒత్తుగా పెరుగుతుంది.

Admin