చిట్కాలు

క‌ల‌బంద‌తో ఎన్ని చ‌ర్మ సౌంద‌ర్యాలో.. తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..

కలబంద ఒక రకమైన ఔషధ మొక్కలు. క‌ల‌బంద‌ అరోగ్యంతో పాటు అందాన్ని కూడా పెంపొందిస్తుంది. కలబంద అధిక మొత్తంలో విటమిన్ మరియు మినరల్ లను కలిగి ఉంటుంది. క‌ల‌బంద‌లో కాల్షియం, మెగ్నీషియం, జింక్, సెలీనియం, ఐరన్, పొటాషియం, కాపర్ మరియు మాంగనీస్ వంటి మినరల్ లను పుష్కలంగా కలిగి ఉంటుంది. క‌ల‌బంద మదుమేహం నివారణ, తక్కువ టైం లో అధిక బరువును తగ్గించుకోవడంలో బాగా స‌హాయ‌ప‌డుతుంది. అదే విధంగా చ‌ర్మ సౌంద‌ర్యం విష‌యంలో కూడా ఏ మాత్రం తీసిపోలేదు.

అనేక చర్మ సంబంధిత సమస్యలకు వాడే వివిధ రకాల ఔషధాలలో అలోవెర‌ను ఉపయోగిస్తారు. దీనిని కాస్మోటిక్స్ లోను, ఆయుర్వేద వైద్య విధానాల్లోను విరివిగా వాడుతున్నారు. క‌ల‌బంద జ‌ట్టు స‌మ‌స్చ‌ల‌కు కూడా బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది. అయితే మ‌నం స‌హ‌జ‌సిద్ధంగా ఇంట్లోనే అలోవెరతో చ‌ర్మ సందర్యాన్ని పొందొచ్చు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం..

– క‌ల‌బంద జెల్ తీసుకుని అందులో కొంచెం నిమ్మ‌ర‌సం క‌లిపి మిక్స్ చేసుకోవాలి. దీన్ని ఫేస్ ప్యాక్‌లా వేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ముఖం కాంతివంతంగా మారుతుంది.

here it is how you can get facial beauty with aloe vera

– ఒక టీస్పూన్‌ కలబంద గుజ్జులో, ఒక స్పూన్‌ ఆలివ్‌ ఆయిల్‌ మిక్స్‌ చేసి కనుబొమ్మలకు అప్లై చేయాలి. రాత్రంతా అలాగే ఉండనిచ్చి తర్వాత శుభ్రం చేసుకుంటే కనుబొమ్మలు ఒత్తుగా పెరుగుతాయి.

– కలబంద గుజ్జుని రోజ్‌వాటర్‌లో కలిపి శరీరానికి పూస్తే, శరీరంలోని మృత కణాలుపోతాయి. మ‌రియు శరీరం కాలిన చోట కలబంద రసాన్ని వాడితే పూర్తి ప్రయోజనం చేకూరుతుంది.

– క‌ల‌బంద జెల్‌లో బాదం నూనె మిక్స్ చేసి ప‌డుకునే ముందు ఫేస్‌కు రాసుకోవాలి. ఉద‌యాన్నే వాష్ చేసుకోవ‌డం వ‌ల్ల ముడ‌త‌లు తొల‌గిపోతాయి.

– కలబంద గుజ్జులో కొంచెం పుసుపు క‌లిపి ముఖానికి అప్లై చేసి 15 నిమిషాల తరువాత చల్లటి నీటితో శుభ్రం చేసుకుంటే.. ముఖం పై పేరుకున్నమురికి తొలగిపోయి కొత్త రూపును సంతరించుకుంటుంది.

– అలోవెరా జెల్‌, పెరుగు, రోజ్ వాట‌ర్‌ కలిపి ముఖంపై అప్లై చేయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల చర్మంపై ర్యాష్‌, మురికి వదిలిపోయి ముఖం సాఫ్ట్‌గా మారుతుంది.

– క‌ల‌బంద జెల్ కొద్దిగా ఆలివ్‌ ఆయిల్‌, బాదం ఆయిల్‌ మిక్స్‌ చేసి స్ట్రెచ్ మార్క్స‌పై మ‌సాజ్‌ చేయాలి. రాత్రి పడుకునే ముందు ఇలా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

Admin

Recent Posts