చిట్కాలు

వామును ఉపయోగించి అధిక బ‌రువును సుల‌భంగా త‌గ్గించుకోవ‌చ్చు.. అందుకు ఇలా చేయాలి..!

అధిక బ‌రువును త‌గ్గించుకోవ‌డం క‌ష్టంగా మారిందా ? అయితే మీ కిచెన్ వైపు ఒక్క‌సారి చూడండి. అధిక బ‌రువును త‌గ్గించే దినుసులు చాలానే క‌నిపిస్తాయి. నెయ్యి, న‌ల్ల మిరియాలు వంటి సూప‌ర్ ఫుడ్స్ అధిక బ‌రువును త‌గ్గిస్తాయి. ఇక అధిక బ‌రువును త‌గ్గించుకునేందుకు వాము కూడా బాగానే ప‌నిచేస్తుంది. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

here it is how you can reduce weight using carom seeds

వాములో థైమోల్ అనే ఎసెన్షియ‌ల్ ఆయిల్ ఉంటుంది. ఇది జీర్ణ‌వ్య‌వ‌స్థ ప‌నితీరును మెరుగు ప‌రుస్తుంది. మ‌నం తినే ఆహారాల్లో ఉండే పోష‌కాల‌ను శ‌రీరం స‌రిగ్గా గ్ర‌హించేలా చేస్తుంది. దీంతో అధిక బ‌రువు తగ్గుతారు. అలాగే ఇత‌ర ప్ర‌యోజ‌నాలు కూడా క‌లుగుతాయి.

త‌ర‌చూ వామును తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలోని విష ప‌దార్థాలు బ‌య‌ట‌కు వెళ్లిపోతాయి. మెట‌బాలిజం పెరుగుతుంది. దీని వ‌ల్ల శ‌రీరంలో పేరుకుపోయిన కొవ్వు క‌రుగుతుంది. ఈ విధంగా త‌క్కువ స‌మ‌యంలో ఎక్కువ‌గా క్యాల‌రీల‌ను ఖ‌ర్చు చేయ‌వ‌చ్చు. ఇక వామును తీసుకోవ‌డం వ‌ల్ల ఒక నెల‌లోనే 2 కిలోల వ‌ర‌కు బ‌రువు త‌గ్గ‌వ‌చ్చని న్యూట్రిష‌నిస్టులు చెబుతున్నారు.

రోజూ మ‌నం తినే ఆహారాల్లో వామును చేర్చుకుని తిన‌వ‌చ్చు. లేదా దాన్ని పొడి చేసి తాగ‌వ‌చ్చు. ఒక పాత్ర‌లో కొన్ని నీటిని తీసుకుని అందులో కొద్దిగా వాము వేసి బాగా మ‌రిగించాలి. అనంతరం వ‌చ్చే నీటిని ఒక గ్లాస్ మోతాదులో ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే తాగాలి. దీని వ‌ల్ల మెట‌బాలిజం పెరుగుతుంది. కొవ్వు క‌రుగుతుంది. అధిక బ‌రువు త్వ‌ర‌గా త‌గ్గుతారు.

ఇక ఒక గ్లాస్ నీటిలో 25 గ్రాముల మేర వాము గింజ‌ల‌ను వేసి రాత్రంతా నాన‌బెట్టాలి. మ‌రుస‌టి రోజు ప‌ర‌గ‌డుపునే ఆ నీటిని తాగాలి. ఇలా 15-20 రోజుల పాటు చేస్తే ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన ఫ‌లితాలు వ‌స్తాయి. ఈ విధంగా చేయ‌డం కొన‌సాగిస్తే బ‌రువు త్వ‌ర‌గా త‌గ్గుతారు.

ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మ‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365

Share
Admin

Recent Posts