High BP Home Remedy : ఒక్క గ్లాస్‌లో ఒక్క స్పూన్ క‌లిపి తాగితే చాలు.. హైబీపీ అస‌లే ఉండ‌దు..!

High BP Home Remedy : ప్ర‌స్తుత కాలంలో మ‌న‌లో చాలా మంది ర‌క్త‌పోటు, హైప‌ర్ టెన్ష‌న్ వంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంద‌నే చెప్ప‌వ‌చ్చు. ఆధునిక జీవ‌న శైలి కార‌ణంగా త‌లెత్తే అనారోగ్య స‌మ‌స్య‌ల్లో ఇది ఒక‌టి. సైలెంట్ కిల్ల‌ర్ లాగా ఈ స‌మ‌స్య శ‌రీరానంత‌టిని దెబ్బ‌తీస్తుంది. ఒత్తిడి, ఆందోళ‌న‌, విరామం లేక‌పోవ‌డం, మారిన ఆహార‌పు అల‌వాట్ల కార‌ణంగా ర‌క్త‌నాళాల్లో ర‌క్తం వేగంగా ప్ర‌వహిస్తుంది. దీని వ‌ల్ల మ‌న శ‌రీరంలో అధిక ర‌క్త‌పోటు స‌మ‌స్య త‌లెత్తుతుంది. గుండె ర‌క్తాన్ని వేగంగా పంపిణీ చేయ‌డం వ‌ల్ల ర‌క్త‌నాళాల్లో ర‌క్తం వేగంగా ప్ర‌విహిస్తుంది. దీనినే ర‌క్త‌పోటు అంటారు. ర‌క్త‌పోటు యొక్క చెడు ప్ర‌భావం మెద‌డు, గుండె,మూత్ర‌పిండాల‌పై అధికంగా ఉంటుంది. దీని వ‌ల్ల ప‌క్ష‌వాతం, గుండెపోటు వంటి స‌మ‌స్య‌ల బారిన ప‌డే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి.

ఉద‌యాన్నే నిద్ర లేచిన వెంట‌నే మెడ భాగంలో నొప్పిగా ఉంటే అధిక ర‌క్త‌పోటు బారిన ప‌డిన‌ట్టు ఒక సంకేతంగా భావించాలి. అలాగే క‌ళ్లు తిరిగిన‌ట్టు అనిపించడం, చేతులు, భుజాల భాగంలో నొప్పి ఉండ‌డం, త‌ర‌చూ మూత్ర‌విస‌ర్జ‌న చేయ‌డం, గుండె చుట్టూ నొప్పి వచ్చిన‌ట్టు ఉండ‌డం వంటి వాటిని అధిక ర‌క్త‌పోటు ల‌క్ష‌ణాలుగా భావించ‌వ‌చ్చు. అధిక ర‌క్త‌పోటు కారణంగా ఎప్పుడూ ఒత్తిడికి గురి అయిన‌ట్టు ఉంటుంది. ఆందోళ‌న‌గా ఉంటుంది. కొన్నిసార్లు ఊపిరి తీసుకోవ‌డం కూడా క‌ష్టంగా ఉంటుంది. ఈ స‌మ‌స్య‌ను అస్స‌లు నిర్ల‌క్ష్యం చేయ‌కూడ‌దు. దీనిని నిర్ల‌క్ష్యం చేయ‌డం వ‌ల్ల గుండె పోటు రావడంతో పాటు కంటి చూపు కూడా మంద‌గిస్తుంది. అలాగే డ‌యాబెటిస్, థైరాయిడ్ వంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారు, ఎక్కువ‌గా పెయిన్ కిల్ల‌ర్ ల‌ను వాడే వారిలో, అధిక బ‌రువుతో బాధ‌ప‌డే వారిలో అధిక ర‌క్త‌పోటు వ‌చ్చే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి. అయితే ఈ స‌మ‌స్య‌ను త‌గ్గించుకోవ‌డానికి వైద్యులు మ‌న‌కు మందుల‌ను సూచిస్తూ ఉంటారు.

High BP Home Remedy works effectively how to do it
High BP Home Remedy

ఈ మందుల‌ను మ‌నం జీవితాంతం వాడాల్సి ఉంటుంది. అలాగే ఈ మందుల‌ను వాడ‌డం వల్ల అనేక దుష్ప్ర‌భావాల బారిన ప‌డాల్సి వ‌స్తుంది. ఎటువంటి దుష్ప్ర‌భావాల బారిన ప‌డ‌కుండా కేవ‌లం మ‌న ఇంట్లో ఉండే ప‌దార్థాల‌ను ఉప‌యోగించి చాలా సుల‌భంగా మ‌నం ఈ స‌మ‌స్య నుండి బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు. వీటితో చిట్కాను త‌యారు చేసుకుని వాడ‌డం వ‌ల్ల చాలా సుల‌భంగా అధిక ర‌క్త‌పోటును నియంత్రించుకోవ‌చ్చు. దీని కోసం గ‌స‌గ‌సాల‌ను, పుచ్చ‌కాయ గింజ‌ల‌ను ఉప‌యోగించాల్సి ఉంటుంది. ముందుగా ఒక క‌ప్పు గ‌స‌గ‌సాల‌ను జార్ లో వేసి పొడి చేసుకోవాలి. త‌రువాత పుచ్చకాయ గింజ‌ల‌ను వేసి మ‌ర‌లా మిక్సీ ప‌ట్టుకోవాలి. ఈ పొడిని గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి. ఇలా త‌యారు చేసుకున్న పొడిని రోజూ ఒక టీ స్పూన్ మోతాదులో ఒక గ్లాస్ నీటిలో వేసి క‌ల‌పాలి. దీనిని ఉద‌యం అల్పాహారం చేయ‌డానికి అర‌గంట ముందు తీసుకోవాలి. ఈ విధంగా ఈ చిట్కాను వాడడం వల్ల క్ర‌మంగా మ‌నం అధిక ర‌క్త‌పోటు స‌మ‌స్య నుండి బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు.

అలాగే అధిక ర‌క్తపోటును త‌గ్గించే మ‌రో చిట్కా గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ చిట్కాను త‌యారు చేసుకోవ‌డానికి గానూ మ‌నం ఉసిరికాయ ర‌సం, దాల్చిన చెక్క‌, తేనెను ఉప‌యోగించాల్సి ఉంటుంది. ముందుగా అర గ్లాస్ నీటిలో 3 టీ స్పూన్ల ఉసిరికాయ ర‌సం వేసుకోవాలి. త‌రువాత దీనిలో ఒక టీ స్పూన్ తేనె, అర టీ స్పూన్ దాల్చిన చెక్క పొడి వేసి క‌లపాలి. ఇలా త‌యారు చేసిన నీటిని రోజూ భోజ‌నం చేసిన అర‌గంట త‌రువాత తీసుకోవాలి. ఈ విధంగా ఈ నీటిని ప్ర‌తిరోజూ తీసుకోవ‌డం వ‌ల్ల అధిక ర‌క్తపోటు స‌మ‌స్య మూడు నుండి నాలుగు రోజుల్లోనే అదుపులోకి వ‌స్తుంది. ఈ విధంగా ఈ చిట్కాల‌ను వాడ‌డం వ‌ల్ల మ‌నం చాలా సుల‌భంగా అధిక ర‌క్తపోటును అదుపులో ఉంచుకోవ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు. ఈ చిట్కాల‌ను పాటిస్తూనే ఒత్తిడి, ఆందోళ‌న‌కు దూరంగా ఉండాలి. యోగా, ఆస‌నాలు వంటివి చేయాలి. ప్ర‌తిరోజూ వ్యాయామాలు చేయాలి. పండ్లు, కూర‌గాయ‌ల‌ను ఎక్కువ‌గా తీసుకోవాలి.

D

Recent Posts