Burns : కాలిన గాయాల‌ను త‌గ్గించే చిట్కాలు.. ఇలా పాటిస్తే చాలు..!

Burns : సాధార‌ణంగా వంట చేసేట‌ప్పుడు కొన్ని సార్లు వేడి పాత్ర‌లు త‌గిలి చేతులు కాలుతూ ఉంటాయి. కాలిన చోట మంట అనిపించ‌డంతో పాటు బొబ్బ‌లు కూడా వ‌స్తూ ఉంటాయి. కాలిన గాయ‌ల వల్ల విప‌రీత‌మైన బాధ క‌లుగుతుంది. కాలిన గాయ‌లు త్వ‌ర‌గా త‌గ్గి మంట, నొప్పి వంటి బాధ‌లు త‌గ్గ‌డానికి మ‌నం ర‌క‌ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తూ ఉంటాము. అయితే కొన్ని చిట్కాల‌ను వాడ‌డం వ‌ల్ల కాలిన గాయాలు త్వ‌ర‌గా త‌గ్గుతాయి. కాలిన గాయ‌ల‌ను త‌గ్గించే ఈ చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. బ్లాక్ టీ బ్యాగుల‌ను ఫ్రిజ్ లో కొద్ది సేపు ఉంచాలి. త‌రువాత వీటిని కాలిన గాయ‌ల‌పై ఉంచాలి. బ్లాక్ టీ ఉండే టానిక్ యాసిడ్ చ‌ర్మానికి స్వాంత‌న అందిస్తుంది. అలాగే నొప్పి, మంట త‌గ్గుతాయి. అలాగే కాలిన గాయ‌ల‌పై రాత్రి ప‌డుకునే ముందు తేనెను రాయాలి.

తేనె యాంటీ బ్యాక్టీరియ‌ల్ గుణాల‌ను క‌లిగి ఉంటుంది. తేనెను రాయ‌డం వ‌ల్ల ఇన్ఫెక్ష‌న్ లు రాకుండా ఉంటాయి. అలాగే కాలిన గాయ‌ల‌పై పాల‌ను రాయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల కాలిన గాయాలు త్వ‌ర‌గా త‌గ్గుతాయి. అలాగే ఈ గాయ‌ల వ‌ల్ల మంట ఎక్కువ‌గా అనిపించిన‌ప్పుడు చల్ల‌టి పాలల్లో దూదిలో ముంచి గాయాల మీద రాయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల మంట త‌గ్గుతుంది. అలాగే కాలిన గాయ‌ల‌పై పుదీనా ఆకుల పేస్ట్ ను రాయాలి. ఇలా రాయ‌డం వ‌ల్ల కాలిన గాయాల వ‌ల్ల క‌లిగే మంట త‌గ్గ‌డంతో పాటు గాయాలు కూడా త్వ‌ర‌గా మానుతాయి. అలాగే ఈ పేస్ట్ ఎండిన త‌రువాత నీటిని చ‌ల్లి నెమ్మ‌దిగా తొల‌గించాలి. అలాగే కాలిన గాయ‌లు మానిన త‌రువాత ఆ భాగంలో చ‌ర్మం తెల్ల‌గా ఉంటుంది.

home remedies for burns
Burns

ఇలాంట‌ప్పుడు నేరుడు ఆకుల‌ను ముక్క‌లుగా చేసి క‌ళాయిలో వేసి న‌ల్ల‌గా అయ్యే వ‌ర‌కు వేయించాలి. త‌రువాత వీటిని జార్ లో వేసి మెత్త‌ని పొడిలాగా చేసుకుని నిల్వ చేసుకోవాలి. ఈ పొడిని త‌గిన మోతాదులో తీసుకుని దానికి నువ్వుల నూనెను క‌లిపి పేస్ట్ లాగా చేసుకోవాలి. త‌రువాత ఈ పేస్ట్ ను రోజుకు రెండు పూట‌లా కాలిన గాయాల‌పై రాయ‌డం వ‌ల్ల క్ర‌మంగా తెల్ల మ‌చ్చ‌లు న‌ల్ల‌గా మార‌తాయి. ఈ చిట్కాల‌ను పాటించ‌డం వ‌ల్ల కాలిన గాయ‌ల వ‌ల్ల క‌లిగే మంట‌, నొప్పి త‌గ్గ‌డంతో పాటు గాయాలు కూడా త్వ‌ర‌గా మానుతాయి.

D

Recent Posts