Joint Pains : కీళ్ల నొప్పులు ఇబ్బందుల‌కు గురి చేస్తున్నాయా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే మేలు..!

Joint Pains : నేటి త‌రుణంలో మ‌న‌ల్ని వేధిస్తున్న అనారోగ్య స‌మ‌స్య‌ల్లో కీళ్ల నొప్పులు ఒక‌టి. కీళ్ల నొప్పుల‌తో బాధ‌ప‌డే వారి సంఖ్య రోజురోజుకు ఎక్కువవుతుంది అని చెప్ప‌వ‌చ్చు. కీళ్ల నొప్పుల బారిన ప‌డ‌డానికి అనేక కార‌ణాలు ఉంటాయని అని చెప్ప‌వ‌చ్చు. చ‌లికాలంలో ఈ స‌మ‌స్య తీవ‌త్ర మ‌రీ ఎక్కువగా ఉంటుంది. ఒక‌ప్పుడు పెద్ద‌వారిలోనే క‌న‌బ‌డే ఈ కీళ్ల నొప్పులు ప్ర‌స్తుత కాలంలో యువ‌తలోనూ క‌న‌బ‌డుతున్నాయి. శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తి త‌క్కువ‌గా ఉన్నా కూడా కీళ్ల నొప్పులు వ‌స్తాయి. శ‌రీరంలోకి బ్యాక్టీరియా ప్ర‌వేశించ‌డం వ‌ల్ల ఇన్ ప్లామేషన్ వ‌స్తుంది. కీళ్ల వాతం కూడా వ‌స్తుంది. దీని వ‌ల్ల కీళ్లు దెబ్బ‌తింటాయి. దెబ్బ తిన్న కీళ్లు తిరిగి సాధార‌ణ స్థితికి రావ‌డానికి చాలా స‌మ‌యం ప‌డుతుంది.

కీళ్ల వాతం కార‌ణంగా కీళ్ల నొప్పులు ఎక్కువ‌వుతాయి. త్వ‌ర‌గా అల‌స‌ట‌కు కూడా గురి అవుతూ ఉంటారు. ఈ వ్యాధి కార‌ణంగా ఉద‌యం పూట కీళ్లు ప‌ట్టేసిన‌ట్టు ఉంటాయి. అలాగే నీర‌సం, బ‌డ‌లిక‌, ర‌క్త‌హీన‌తకు లోన‌వుతూ ఉంటారు. ప్రారంభ ద‌శ‌లోనే దీనిని గుర్తించి త‌గిన చికిత్స తీసుకోవాలి. మ‌న జీవ‌న విధానంఓ అలాగే మ‌న ఆహార‌పు అల‌వాట్ల‌లో మార్పులు చేయ‌డం వ‌ల్ల కీళ్ల నొప్పుల‌ను త‌గ్గించుకోవ‌చ్చు. కీళ్ల నొప్పులు ఉన్న వారు కొన్ని ఆహారాల‌కు దూరంగా ఉండాలి. ఆర్టిఫిషియ‌ల్ షుగ‌ర్స్, డైరీ ప్రొడ‌క్ట్స్, ఫామ్ ఆయిల్, గుడ్డును తీసుకోవ‌డం వ‌ల్ల కీళ్ల‌ల్లో నొప్పులు అధికంగా ఉంటాయి. కొన్ని ఆహారాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల కీళ్ల నొప్పుల‌ను మ‌నం త‌గ్గించుకోవ‌చ్చు.

home remedies for Joint Pains very effective
Joint Pains

ఫైనాఫిల్ ను తీసుకోవ‌డం వ‌ల్ల కీళ్ల నొప్పులు, వాపులు త‌గ్గుతాయి. అలాగే ఆరెంజ్ లో ఉండే విట‌మిన్ సి కూడా కీళ్ల నొప్పుల‌ను త‌గ్గిస్తుంది. అలాగే కీళ్ల నొప్పుల‌ను త‌గ్గించే కొన్ని ర‌కాల చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కోడిగుడ్డు తెల్ల సొన‌ను, క‌ల‌బంద గుజ్జును ఉప‌యోగించి మ‌నం కీళ్లనొప్పుల‌ను త‌గ్గించుకోవ‌చ్చు. ఒక గిన్నెలో కోడిగుడ్డు తెల్ల‌సొన‌ను తీసుకుని దానిలో క‌ల‌బంద గుజ్జును వేసి క‌ల‌పాలి. ఈ మిశ్ర‌మాన్ని కీళ్ల నొప్పులు ఉన్న చోట రాసి మర్ద‌నా చేయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల కీళ్ల నొప్పులు త‌గ్గుతాయి. అలాగే ఒక గిన్నెలో గోరు వెచ్చ‌ని పాల‌ను తీసుకోవాలి. అందులో కొద్దిగా ఆముదాన్ని వేసి బాగా క‌లిపి తాగాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల కీళ్ల నొప్పులు, కీళ్ల వాపులు త‌గ్గుతాయి. కీళ్ల నొప్పుల‌ను త‌గ్గించ‌డంలో బంగాళాదుంప‌లు ఎంత‌గానో స‌హాయ‌ప‌డ‌తాయి.

ఒక బంగాళాదుంపను తీసుకుని ముక్క‌లుగా చేయాలి.ఈ ముక్క‌ల‌ను గిన్నెలోకి తీసుకుని దాని నిండా నీళ్లు పోసి రాత్రంతా అలాగే ఉంచాలి. ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపున ఈ నీటిని తాగాలి. ఇలా క్రమం త‌ప్ప‌కుండా తీసుకోవ‌డం వ‌ల్ల కీళ్ల నొప్పులు త‌గ్గుతాయి. కీళ్ల నొప్పుల‌తో బాధ‌ప‌డే వారు రోజూ గోరు వెచ్చ‌ని నీటిలో తేనె, నిమ్మ‌ర‌సం క‌లిపి తీసుకోవ‌డం వ‌ల్ల కూడా చ‌క్క‌టి ఫ‌లితం ఉంటుంది. ఇలా చేయ‌డం వ‌ల్ల అధిక బ‌రువు కూడా త‌గ్గుతారు. క‌ర్పూరాన్ని ఉప‌యోగించి కూడా మ‌నం కీళ్ల నొప్పుల‌ను త‌గ్గించుకోవ‌చ్చు. ఒక గిన్నెలో కొబ్బ‌రి నూనెను, క‌ర్పూరాన్ని వేసి వేడి చేయాలి. ఈ నూనె గోరు వెచ్చ‌గా అయిన త‌రువాత కీళ్ల నొప్పులు ఉన్న చోట రాసి మ‌ర్ద‌నా చేయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల కీళ్ల నొప్పుల నుండి ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంది.

మ‌నం వంట‌ల్లో వాడే దాల్చిన చెక్క కూడా కీళ్ల నొప్పుల‌ను త‌గ్గించ‌డంలో స‌హాయప‌డుతుంది. దాల్చిన చెక్క‌ను త‌ర‌చూ మన ఆహారంలో తీసుకోవ‌డం వ‌ల్ల కీళ్ల నొప్పులు త‌గ్గ‌డంతో పాటు ఇత‌ర ఆరోగ్య ప్ర‌యోజ‌నాలను కూడా పొంద‌వ‌చ్చు. దాల్చిన చెక్క‌లో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే అనేక ర‌కాల పోష‌కాలు ఉన్నాయి. దీనిని తీసుకోవ‌డం వ‌ల్ల ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు నియంత్ర‌ణ‌లో ఉంటాయి. జీర్ణ‌శ‌క్తి కూడా మెరుగుప‌డుతుంది. ఈ చిట్కాల‌ను పాటించ‌డం వ‌ల్ల ఎటువంటి దుష్ప్ర‌భావాలు లేకుండా కీళ్ల నొప్పుల‌ను త‌గ్గించుకోవ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు.

Share
D

Recent Posts