డ‌యాబెటిస్ ఉన్న‌వారికి మేలు క‌లిగించే గుమ్మడికాయ‌.. రోజూ తీసుకోవాలి..!

అధికంగా పిండిప‌దార్థాలు క‌లిగిన ఆహారాల‌ను రోజూ ఎక్కువ మోతాదులో తీసుకుంటే కొన్ని రోజుల‌కు ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు పెరిగిపోయి డ‌యాబెటిస్ వ‌స్తుంది. తీపి, జంక్ ఫుడ్ ఎక్కువ‌గా తిన‌డం, వ్యాయామం చేయ‌క‌పోవ‌డ‌, అస్త‌వ్య‌స్త‌మైన జీవ‌న విధానం వ‌ల్ల డ‌యాబెటిస్ వ‌స్తుంది. క‌నుక మ‌నం తినే ఆహారంలో మార్పులు చేసుకోవ‌డం మంచిది. త‌క్కువ గ్లైసీమిక్ ఇండెక్స్ (జీఐ) విలువ ఉండే ఆహారాల‌ను తినాలి. దీంతో ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు పెర‌గ‌కుండా ఉంటాయి. అలాగే ప్రాసెస్ చేయ‌బ‌డిన‌, చ‌క్కెర లేదా పిండి ప‌దార్థాలు ఎక్కువ‌గా ఉన్న ఆహారాల‌ను తీసుకోవ‌డం త‌గ్గించాలి. ఇవి షుగ‌ర్ లెవ‌ల్స్‌ను పెంచుతాయి. దీంతో డ‌యాబెటిస్‌, ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయి. క‌నుక శ‌రీరంలో షుగ‌ర్ లెవ‌ల్స్‌ను త‌గ్గించే ఆహారాల‌ను తీసుకోవాలి.

diabetics must take pumpkin and its seeds daily to keep blood sugar levels in check

డ‌యాబెటిస్ ఉన్న‌వారు ఫ‌లానా ఆహారాలు తినాల‌ని వైద్యులు చెబుతుంటారు. అలాంట తిన‌ద‌గిన ఆహారాల్లో గుమ్మ‌డికాయ‌లు, వాటి విత్త‌నాలు ఒక‌టి. ఇవి డ‌యాబెటిస్ ఉన్న‌వారికి ఎంత‌గానో మేలు చేస్తాయి.

1. గుమ్మ‌డికాయ‌ల్లో విట‌మిన్ ఎ, సి, పొటాషియం, ఫోలిక్ యాసిడ్‌, ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. వాటి విత్త‌నాల్లో ఐర‌న్‌, ఇత‌ర పోష‌కాలు స‌మృద్దిగా ల‌భిస్తాయి. అందువ‌ల్ల డ‌యాబెటిస్ ఉన్న‌వారు ఈ రెండింటినీ త‌ర‌చూ తీసుకోవాలి.

2. గుమ్మ‌డికాయ‌ల్లో ఉండే విట‌మిన్ సి డ‌యాబెటిస్‌ను నియంత్రిస్తుంది. ఇన్సులిన్ ఎక్కువ‌గా ఉత్ప‌త్తి అయ్యేలా చేస్తుంది. దీంతో టైప్ 2 డయాబెటిస్ ఉన్న‌వారికి మేలు జ‌రుగుతుంది.

3. డ‌యాబెటిస్ ఉన్న‌వారికి చాలా మందికి గుండె స‌మ‌స్య‌లు వ‌స్తుంటాయి. కానీ గుమ్మ‌డికాయ‌లు లేదా వాటి విత్త‌నాల‌ను తిన‌డం వ‌ల్ల గుండె జ‌బ్బులు వ‌చ్చేందుకు అవ‌కాశాలు త‌క్కువ‌గా ఉంటాయి. ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి.

4. శ‌రీరంలో ఇన్సులిన్ ఉత్ప‌త్తి త‌గ్గితే అది కార్బొహైడ్రేట్లు, లిపిడ్లు, ప్రోటీన్ల మెట‌బాలిజంపై ప్ర‌భావం చూపిస్తుంది. ఆక్సిడేటివ్ స్ట్రెస్ వ‌ల్ల ఇలా జ‌రుగుతుంది. అయితే గుమ్మ‌డికాయ‌లు, వాటి విత్త‌నాల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ను త‌గ్గిస్తాయి. దీంతో డ‌యాబెటిస్ ఉన్న‌వారిలో మెట‌బాలిజం స‌రిగ్గా జ‌రుగుతుంది. షుగ‌ర్ లెవ‌ల్స్ అదుపులో ఉంటాయి. కొలెస్ట్రాల్ నియంత్ర‌ణ‌లో ఉంటుంది.

5. గుమ్మ‌డికాయ‌లు, వాటి విత్త‌నాల్లో ఫోలిక్ యాసిడ్ స‌మృద్ధిగా ఉంటుంది. ఇది డ‌యాబెటిస్ ఉన్న‌వారికి మేలు చేస్తుంది. షుగ‌ర్ లెవ‌ల్స్ అదుపులో ఉండేలా చూస్తుంది.

అయితే గుమ్మ‌డికాయ ఆరోగ్య‌క‌ర‌మే అయిన‌ప్ప‌టికీ దాన్ని రోజూ తక్కువ మోతాదులో తీసుకోవాలి. రోజూ ఒక క‌ప్పు గుమ్మ‌డికాయ ముక్క‌ల‌ను తిన‌వ‌చ్చు. లేదా గుప్పెడు గుమ్మ‌డికాయ విత్త‌నాల‌ను తిన‌వ‌చ్చు. దీంతో డ‌యాబెటిస్ అదుపులో ఉంటుంది.

ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మ‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365

Share
Admin

Recent Posts