Home Remedy For Ulcer : నేటి తరునంలో మనలో చాలా మంది ఎసిడిటీ, అల్సర్స్, కడుపులో మంట, పుల్లటి త్రేన్పులు వంటి జీర్ణసంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా అందరూ ఈ సమస్యల బారిన పడుతున్నారు. సాధారణంగా మనం తిన్న ఆహారాన్ని జీర్ణం చేయడానికి మన పొట్టలో హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉత్పత్తి అవుతున్న సంగతి మనకు తెలిసిందే. ఈ యాసిడ్ యొక్క గాడత చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ యాసిడ్ కారణంగా పొట్ట అంచులు దెబ్బతినకుండా ఉండడానికి మన పొట్ట అంచుల వెంబడి జిగురు ఉత్పత్తి అవుతుంది.
కానీ మారిన మన జీవన విధానం కారణంగా పొట్ట అంచుల వెంబడి జిగురు తక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఒత్తిడి, ఆందోళన, కాఫీ, టీ లను ఎక్కువగా తాగడం, మంచి నీటిని తక్కువగా త్రాగడం, అనేక రకాల మందులను వాడడం, జంక్ ఫుడ్ ను ఎక్కువగా తీసుకోవడం వంటి వివిధ కారణాల చేత ఈ జిగురు ఉత్పత్తి తగ్గుతుంది. పొట్ట అంచుల వెంబడి ఈ జిగురు ఉత్పత్తి తగ్గడం వల్ల అల్సర్స్, ఎసిడిటీ, ప్రేగు పూతలు వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ సమస్యల నుండి బయటపడడానికి చాలా మంది రోజూ మందులను వాడుతూ ఉంటారు. ఇటువంటి జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడే వారు మందుల వాడకాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తులో అల్సర్ వంటి సమస్యలు రాకుండా ఉన్నాలన్నా మనం అరటి పండును తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
అరటి పండులో లైకోసైడిన్ అనే రసాయన సమ్మేళనం ఉంటుంది. ఇది జిగురు పొరల నుండి జిగురు ఎక్కువగా ఉత్పత్తి అయ్యేలా చేయడంలో సహాయపడుతుంది. అరటి పండును తీసుకోవడం వల్ల అల్సర్, ఎసిడిటీ వంటి జీర్ణ సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయని నిపుణులు పరిశోధల ద్వారా వెల్లడించారు. అలాగే జంక్ ఫుడ్ ను తీసుకోవడం వల్ల పొట్టలో వచ్చే ఇన్ ప్లామేషన్ ను తగ్గించడంలో, జంక్ ఫుడ్ ను తీసుకోవడం వల్ల కలిగే హానిని తగ్గించడంలో కూడా అరటి పండు మనకు ఎంతగానో సహాయపడుతుందని నిపుణులు పరిశోధనల ద్వారా నిరూపించారు.
అల్సర్, ఎసిడిటీ వంటి సమస్యలతో బాధపడే వారు రోజుకు ఉదయం, సాయంత్రం రెండు పూటలా రెండు అరటి పండ్లను తినవచ్చు. అల్సర్ సమస్యతో పాటుఅధిక బరువు సమస్యతో బాధపడే వారైతే రోజూ సాయంత్రం ఒక అరటి పండును తీసుకోవచ్చు. అరటి పండును తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు తగ్గడంతో పాటు మన ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. ఈ విధంగా అరటి పండును తీసుకోవడం వల్ల అల్సర్, ఎసిడిటి వంటి జీర్ణ సమస్యలు తగ్గడంతో పాటు మన దరి చేరకుండా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.