Aloo Matar Pulao : ఆలు, బఠానీ పులావ్‌.. రుచి చూస్తే అసలు విడిచిపెట్టరు..!

Aloo Matar Pulao : పచ్చి బఠానీలు అంటే సహజంగానే చాలా మందికి ఇష్టంగా ఉంటుంది. వీటిని పలు రకాల వంటల్లో వేస్తుంటారు. దీంతో వంటలకు ఎంతో రుచి వస్తుంది. వీటితో పలు వంటలను కూడా చేస్తుంటారు. అయితే వీటిని ఆలుతో కలిపి పులావ్‌ వండవచ్చు. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. ఈ క్రమంలోనే ఆలు, బఠానీ పులావ్‌ను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆలు, బఠానీ పులావ్‌ తయారీకి కావల్సిన పదార్థాలు..

చిన్న బంగాళా దుంపలు – 100 గ్రాములు, బియ్యం – 200 గ్రాములు, ఉల్లిపాయ – 1, పచ్చిమిర్చి – 4, పచ్చి బఠానీలు – 50 గ్రాములు, పుదీనా – 3 టీస్పూన్లు, అల్లం వెల్లుల్లి ముద్ద – 1 టీస్పూన్‌, యాలకులు – 3, లవంగాలు – 4, దాల్చిన చెక్క – అంగుళం ముక్క, షాజీరా – 1 టీస్పూన్‌, నూనె – రెండు టేబుల్‌ స్పూన్లు, నెయ్యి – 2 టీస్పూన్లు.

Aloo Matar Pulao very easy to make recipe
Aloo Matar Pulao

ఆలు, బఠానీ పులావ్‌ను తయారు చేసే విధానం..

బియ్యాన్ని బాగా కడిగి పది నిమిషాలపాటు నానబెట్టాలి. సన్న బియ్యం లేదా బాస్మతి వాడాలి. పాన్‌లో నూనె, నెయ్యి కలిపి వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ వేసి మెత్తబడే వరకు వేయించాలి. ఇందులో పొట్టు తీసిన చిన్న లేదా బేబీ ఆలు, నిలువుగా చీల్చిన పచ్చి మిర్చి, పుదీనా ఆకులు, గరం మసాలా వస్తువులు, పచ్చి బఠానీలు లేదా ఉడకబెట్టిన పచ్చి బఠానీలు, అల్లం వెల్లుల్లి ముద్ద వేసి కొద్దిసేపు వేపాలి. ఇందులో ఒకటిగా ఒకటిన్నర కొలతతో నీళ్లు పోసి తగినంత ఉప్పు వేసి మరిగించాలి. మరుగుతున్న నీళ్లల్లో బియ్యం వేసి ఉడికించాలి. బియ్యం ఉడికి నీరంతా ఇగిరిపోయాక మంట తగ్గించి మూత పెట్టి నిదానంగా మరో ఐదు నిమిషాలు మగ్గనిచ్చి దింపేయాలి. దీనికి పెరుగు పచ్చడి లేదా ఏదైనా కుర్మా కలిపి సర్వ్‌ చేస్తే బాగుంటుంది. దీన్ని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.

Share
Editor

Recent Posts