శరీరంలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నప్పుడు అనారోగ్య సమస్యలు మనిషి శరీరం పైన వెంటనే అటాక్ చేస్తుండడం మనం చూస్తూ ఉన్నాం. ఇమ్యూనిటీ తగ్గినప్పుడు జలుబు, దగ్గు వంటి సమస్యలు అటాక్ చేస్తూ ఉంటాయి. ముఖ్యంగా శీతాకాలంలో దగ్గు, జలుబు వచ్చాయంటే తగ్గడానికి చాలా సమయం పడుతుంది. జలుబు వల్ల ముక్కు కారడం, ముక్కు మూసుకుపోవడం, తుమ్ములు, దగ్గు, గొంతు నొప్పి, అలసట వంటి లక్షణాలు ఇబ్బంది పెడుతుంటారు. జలుబు ఎక్కువగా ఉంటే.. తలనొప్పి, ఒళ్లు నొప్పు, కొద్దిపాటి జ్వరంగా కూడా ఉంటుంది. జలుబు వస్తే.. చాలా మంది యాంటి బయోటిక్స్ వాడుతుంటారు. కాని అవి వాడకుండా సహజంగా కూడా జలుబుని నియంత్రించుకోవచ్చు.
జలుబు నుంచి కొంత ఉపశమనం పొందడానికి శరీరానికి విశ్రాంతిని అందించడం చాలా ముఖ్యం. మన శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ ఉత్తమంగా పనిచేయడానికి తగినంత నిద్ర, విశ్రాంతి అవసరం. జలుబు లక్షణాలను తగ్గించడానికి, శరీర శక్తిని ఆదా చేయడానికి, త్వరగా కోలుకోవడానికి.. విశ్రాంతికి ప్రాధాన్యం ఇవ్వండి. అలానే జలుబు చేసినప్పుడు శరీరాన్ని హైడ్రేట్ కాకుండా చూసుకోండి.జలుబు చేసినప్పుడు.. సరిపడా నీళ్లు తాగడం చాలా ముఖ్యం. నీరు సన్నటి శ్లేష్మాన్ని బయటకు పంపడం సులభం చేస్తుంది, మీ గొంతును తేమగా ఉంచుతుంది. జలుబు చేసినప్పుడు.. హెర్బల్ టీలు, నిమ్మరసం నీళ్లు, వేడి నీళ్లు, గోరువెచ్చని పాలు.. గొంతు నొప్పిని తగ్గించడమే కాకుండా.. శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుతుంది. కాఫీ, టీ వంటి కెఫిన్ డ్రింక్స్.. శరీరాన్ని డీహైడ్రేడ్ చేస్తుంది.
జలుబు చేసినప్పు.. గొంతు నొప్పి ఇబ్బందిపెడుతుంది. నీళ్లలో ఉప్పు వేసి పుక్కిలిస్తే.. కొంత ఉపశమనం లభిస్తుంది. రోజుకు నాలుగైదు సార్లు ఇలా చేస్తే.. గొంతు క్లియర్ అవుతుంది. ఇది మంటను తగ్గిస్తుంది. జలుబు నుంచి త్వరగా కోలుకునేలా చేస్తుంది.అల్లంలో ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ మైక్రోబయల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇవి బాడీపెయిన్స్‌ని తగ్గించి అలసటని దూరం చేస్తాయి. అల్లంని టీలా చేసుకుని తాగొచ్చు. దీని వల్ల కూడా సోర్ థ్రోట్, బాడీపెయిన్స్ తగ్గుతాయి. అలసట కూడా దూరమవుతుంది.మీ శరీరాన్ని వేడిగా ఉంచుకోవడానికి.. మందంగా ఉండే దుస్తులు ధరించండి. వెచ్చగా, సౌకర్యవంతంగా ఉండటానికి.. దుప్పటి ఉపయోగించండి. మీ శరీరాన్ని వెచ్చగా ఉంచడం వల్ల కండరాల నొప్పులు తగ్గుతాయి, త్వరగా రికవరీ అవుతారు.