నెయ్యితో అధిక బ‌రువును ఎలా త‌గ్గించుకోవ‌చ్చు..?

స్వ‌చ్ఛ‌మైన ,ఇంట్లో త‌యారు చేయ‌బ‌డిన దేశ‌వాళీ నెయ్యి మ‌న‌కు అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తుంది. ముఖ్యంగా నెయ్యిలో అనేక పోషకాలు ఉంటాయి. ఇవి మ‌న శ‌రీరానికి ఎంత‌గానో మేలు చేస్తాయి. భార‌తీయులు ఎంతో పురాత‌న కాలం నుంచే నెయ్యిని త‌మ వంట‌కాల్లో ఉప‌యోగిస్తున్నారు. నెయ్యి తియ్య‌గా ఉంటుంది క‌నుక ఇది తింటే ఆరోగ్యానికి హానిక‌ర‌మ‌ని చాలా మంది భావిస్తుంటారు. నెయ్యి తింటే బ‌రువు పెరుగుతామ‌ని కూడా కొంద‌రు అనుకుంటారు. కానీ అందులో ఎంత మాత్రం నిజంలేదు. ఎందుకంటే నెయ్యిని రోజూ స్వ‌ల్ప మోతాదులో తీసుకుంటే బ‌రువు త‌గ్గుతార‌ని ఆయుర్వేదం చెబుతోంది.

how to reduce weight using ghee

నెయ్యిని అనేక తీపి వంట‌కాల త‌యారీలో ఉప‌యోగిస్తారు. కానీ నెయ్యిని అలా తీసుకోరాదు. నేరుగానే తీసుకోవాలి. దీంతో అధిక బ‌రువును త‌గ్గించుకునేందుకు, పొట్ట ద‌గ్గ‌ర కొవ్వు క‌రిగేందుకు స‌హాయ ప‌డుతుంది. స్వచ్ఛ‌మైన‌, ఇంట్లో త‌యారు చేయ‌బ‌డిన దేశ‌వాళీ నెయ్యిని, ముఖ్యంగా ఆవుపాల‌తో త‌యారు చేసిన నెయ్యిని వాడితే మంచిద‌ని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

దాదాపు ప్ర‌తి భార‌తీయ ఇంట్లో మ‌న‌కు నెయ్యి క‌నిపిస్తుంది. ఆహార ప‌దార్థాల‌కు నెయ్యి రుచిని అందిస్తుంది. అంతేకాదు, ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను కూడా అందిస్తుంది. నెయ్యిలో అమైనో ఆమ్లాలు, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు, డీహెచ్ఏ, ఒమెగా 6 ఫ్యాటీ యాసిడ్లు, సీఎల్ఏ వంటి పోష‌కాలు ఉంటాయి. ఇవి బ‌రువును త‌గ్గించేందుకు స‌హాయ ప‌డ‌తాయి.

ఒమెగా 6 ఫ్యాటీ యాసిడ్లు ఉండే ఆహారాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల కొవ్వు క‌రుగుతుంద‌ని సైంటిస్టులు చేప‌ట్టిన అధ్య‌య‌నాల్లో వెల్ల‌డైంది. అలాగే ఈ యాసిడ్లు అధిక బ‌రువును త‌గ్గిస్తాయి.

అయితే నెయ్యి ఆరోగ్య‌క‌ర‌మే అయిన‌ప్ప‌టికీ దాన్ని రోజూ స్వ‌ల్ప మోతాదులోనే తీసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. రోజుకు 2-3 టీస్పూన్ల వ‌ర‌కు నెయ్యిని ఎవ‌రైనా తీసుకోవ‌చ్చు. చిన్నారుల‌కు 1 టీస్పూన్ నెయ్యిని తినిపించాలి.

ఆయ‌ర్వేద ప్ర‌కారం నెయ్యిని రోజూ ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే తీసుకోవాలి. అలాగే భోజనానికి అర గంట ముందు తీసుకోవ‌చ్చు. నెయ్యిని నేరుగా తీసుకుంటేనే ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. నెయ్యిని రోజూ తీసుకోవ‌డం వ‌ల్ల అధిక బ‌రువును, పొట్ట ద‌గ్గరి కొవ్వును త్వ‌ర‌గా కరిగించుకోవ‌చ్చు.

ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మ‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365

Share
Admin

Recent Posts