శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచే ఉసిరికాయ‌, మున‌గ ఆకుల డ్రింక్‌..!!

దేశంలో కరోనా తీవ్రంగా వ్యాప్తి చెందుతోంది. ఈ క్ర‌మంలోనే ప్ర‌తిఒక్క‌రూ రోగ నిరోధ‌క శక్తిని పెంచుకోవాల్సిన ఆవ‌శ్య‌క‌త ఏర్ప‌డింది. అందుకు గాను రోజూ బ‌ల‌వ‌ర్ధక‌మైన ఆహారాల‌ను ప్ర‌తి ఒక్క‌రూ తీసుకోవాలి. ఇక ఉసిరికాయ‌లు, మున‌గ ఆకుల‌తో త‌యారు చేసే కింద తెలిపిన డ్రింక్‌ను కూడా రోజూ తీసుకోవ‌డం వ‌ల్ల రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుకోవ‌చ్చు. మ‌రి ఆ డ్రింక్‌ను ఎలా త‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందామా..!

immunity increasing amla moringa drink

ఉసిరికాయ‌లు, మున‌గ ఆకుల డ్రింక్ త‌యారీకి కావలసిన పదార్థాలు

  • ఉసిరికాయ – 1
  • మునగ ఆకుల పొడి – 1 టీస్పూన్
  • నీరు – 1 గ్లాస్

త‌యారీ విధానం

ఒక గ్లాస్ నీటిలో మున‌గ ఆకుల పొడి, ఉసిరికాయ ర‌సాన్ని క‌లిపితే డ్రింక్ త‌యార‌వుతుంది. దాన్ని అలాగే తీసుకోవ‌చ్చు. మున‌గ ఆకుల పొడి లేక‌పోతే దానికి బ‌దులుగా మున‌గ ఆకుల‌ను మిక్సీలో వేసి ర‌సం తీయాలి. దాన్ని గ్లాస్ నీటిలో క‌ల‌పాలి. త‌రువాత ఉసిరికాయ ర‌సాన్ని క‌ల‌పాలి. ఇలా కూడా డ్రింక్ త‌యార‌వుతుంది.

ఉసిరికాయ‌లు, మున‌గ ఆకుల్లో అనేక పోష‌కాలు ఉంటాయి. విట‌మిన్ సి, కాల్షియం, ఐరన్, ఫాస్పరస్, ప్రోటీన్లు మొదలైన ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. అలాగే విటమిన్లు ఎ, బి 1, బి 2, బి 3, మెగ్నీషియం, పొటాషియం, జింక్ వంటి పోషకాలు కూడా ఉంటాయి. ఈ రెండూ యాంటీ వైర‌ల్‌, యాంటీ బాక్టీరియల్ గుణాల‌ను క‌లిగి ఉంటాయి. అందువ‌ల్ల రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. ఇన్‌ఫెక్ష‌న్ల నుంచి ర‌క్ష‌ణ ల‌భిస్తుంది. వ్యాధులు రాకుండా ఉంటాయి. సీజ‌న‌ల్‌గా వ‌చ్చే ద‌గ్గు, జ్వ‌రం, జ‌లుబు త‌గ్గుతాయి.

ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మ‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365

Share
Admin

Recent Posts