ప్రెగ్నెన్సీ సమయంలో పొట్ట పెరుగుదల,డెలివరీ అయిన తర్వాత పొట్ట ప్రాంతంలో స్ట్రెచ్ మార్క్స్ ఏర్పడి ఆడవాళ్లకు చాలా ఇబ్బందిగా ఉంటాయి. బ్రెస్ట్ విస్తరించడం వల్ల అక్కడకూడా స్ట్రెచ్ మార్క్స్ ఏర్పడుతాయి.అంతే కాకుండా ప్యూబెర్టి లేదా ఎక్సెస్ వెయింట్ లాస్ .. ఎక్సెస్ బాడీ వెయిట్ వల్ల స్ట్రెచ్ మార్క్స్ వస్తాయి. స్ట్రెచ్ మార్క్స్ ను మనం ఇంట్లో స్వయంగా తొలగించుకోవచ్చు. అయితే ఇవి పూర్తిగా తొలగిపోవు కానీ, కొంత వరకూ షేడ్ అయిపోతాయి. స్ట్రెచ్ మార్క్స్ ను మనం ఇంట్లో స్వయంగా తొలగించుకోవచ్చు.సున్నితమైన ప్రదేశంలో స్ట్రెచ్ మార్క్స్ తొలగించుకోవడానికి నేచురల్ పద్దతులు.. పంచదార స్పటిక రూపంలో గరుకుగా ఉంటుంది, దీన్ని స్ట్రెచ్ మార్క్స్ ఉన్న ప్రదేశంలో మర్దన చేయడం వల్ల స్కిన్ ఎక్స్ ఫ్లోయేట్ అవ్వడంతో పాటు, డెడ్ స్కిన్ సెల్స్ తొలగిపోతాయి, బ్లడ్ సర్క్యులేషన్ ను నివారిస్తుంది. స్ట్రెచ్ మార్క్స్ ను తేలికపరుస్తుంది.
పంచదార 1 టేబుల్ స్పూన్, బాదం నూనె 10 చుక్కలు, నిమ్మరసం 1 టీస్పూన్ ఒక బౌల్లో తీసుకుని బాగా మిక్స్ చేయాలి, ఈ మిశ్రమాన్ని బ్రెస్ట్ పై,పొట్ట ప్రాంతంలో అప్లై చేసి, సున్నితంగా మర్ధన చేయాలి. 5నిమిషాలు మర్ధన చేసిన తర్వాత నీటితో శుభ్రంగా కడుక్కోవాలి. స్ట్రెచ్ మార్క్స్ నివారించడానికి ఈ హోం రెమెడీని ఫాలో అవ్వడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఆముదంలో ఓమేగా 6 మరియు ఓమేగా 9 ఫ్యాటీ యాసిడ్స్ , మరియు ప్రోటీన్స్ అత్యధికంగా ఉంటాయి. ఆముదం నూనె చర్మంలోకి పూర్తిగా చొచ్చుకుని పోయి, స్కిన్ ను రీజనరేట్ చేస్తుంది. దాంతో స్ట్రెచ్ మార్క్స్ లైట్ గా మారిపోతాయి. వెల్లకిలా, నిటారుగా పడుకుని, ఆముదం నూనెను చేతిలో వేసుకుని అప్లై చేసి మసాజ్ చేయాలి.తర్వాత క్లీనింగ్ వ్రాప్ ను చుట్టుకుని, హీట్ పాడ్ తో 20 నిముషాలు హీట్ చేసుకోవాలి. ఎక్సెస్ ఆయిల్ ను ఈ వ్రాపర్ లాగేసుకుంటుంది. ఈ నేచురల్ రెమెడీస్ ఒక వారం రోజులు పాటు చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది. హీట్ పాడ్ హీట్ మరీ ఎక్కువ హాట్ గా లేకుండా చూసుకోవాలి.
అలోవెర జెల్‌లో అలోసిన్ మరియు యాంటీఆక్సిడెంట్స్ లు అధికంగా ఉన్నాయి. ఇవి శరీరంలో కొల్లాజెన్ ప్రొడక్షన్స్ ను ఉత్పత్తి చేస్తుంది, ఇది స్కిన్ ఎలాసిటిని పెంచుతుంది . ఆలివ్ ఆయిల్ 2టేబుల్ స్పూన్లు ..అలోవెర జెల్ : 1 టేబుల్ స్పూన్ రెండు పదార్థాలను మిక్స్ చేసి స్ట్రెచ్ మార్క్స్ ఉన్న ప్రదేశంలో అప్లై చేసి మసాజ్ చేయాలి. ఈ హెర్బల్ రెమెడీస్ రాత్రి నిద్రించడానికి ముందు అప్లై చేయడం వల్ల ఉదయం స్నానం చేసుకోవచ్చు. నిమ్మరసంలో సిట్రిక్ యాసిడ్స్ మరియు విటమిన్ సిలు అధికంగా ఉన్నాయి, ఇవి మొండిగా మారిన స్ట్రెచ్ మార్క్స్ ను తొలగిస్తుంది. నిమ్మరసంను రెండు భాగాలుగా కట్ చేసి, స్ట్రెచ్ మార్క్స్ మీద మర్ధన చేయాలి. 10 నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఈ హోం రెమెడీని ప్రతి రోజూ స్ట్రెచ్ మార్స్ కనబడనంత వరకూ వాడాలి.
గుడ్డులో విటమిన్ ఎ, అమినో యాసిడ్స్ మరియు ప్రోటీన్స్ అధికంగా ఉన్నాయి, ఇవన్నీ స్కిన్ సెల్స్ కొత్తగా ఏర్పడటానికి సహాయపడుతుంది. చర్మంను కాంతివంతంగా, తేమగా మార్చుతుంది. గుడ్డులోని పచ్చసొన తీసుకుని బ్రెస్ట్ కు మసాజ్ చేయాలి. స్కిన్ స్ట్రెచ్ అయినట్లు అనిపిస్తుంటే, అప్పడు నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ ఆయుర్వేదిక్ రెమెడీ స్ట్రెచ్ మార్క్స్ ను నివారిస్తుంది.