చిట్కాలు

అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించే క‌ర‌క్కాయ‌.. ఎలా తీసుకోవాలో తెలుసా..?

ఆయుర్వేద మందుల లో ఎక్కువగా ఉపయోగించే కరక్కాయ వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. కరక్కాయ తీసుకోవడం వల్ల బుద్ధిని వికసింపజేస్తుంది. అంతే కాదు బలం కూడా కలుగుతుంది. కరక్కాయ ఆయుష్షును కూడా పెంచుతుంది. మల బద్ధకం, వాంతులు, ఫైల్స్, అసిడిటీ, గ్యాస్ సమస్యలకు కూడా పరిష్కారం చూపిస్తుంది. ఇలా ఒక్కటేమిటి రెండు ఏమిటి ఎన్నో సమస్యలు ఎంతో సులువుగా కరక్కాయ తొలగిస్తుంది. అయితే కరక్కాయ వల్ల కలిగే లాభాలు ఇప్పుడు చూద్దాం. మరి ఆలస్యం ఎందుకు పూర్తిగా చూసేయండి.

కరక్కాయ పొడిని తేనెలో కలిపి తీసుకోవడం వల్ల విష జ్వరాలు తగ్గిపోతాయి. అదే కరక్కాయ పొడిని మీరు ఆముదం లో కలిపి తీసుకుంటే కీళ్ల నొప్పులు తగ్గుతాయి. దగ్గు తో పాటు కలిగే ఆయాసం నుండి బయట పడాలంటే కరక్కాయ, శొంఠి, తానికాయ, పిప్పళ్ళు కలిపి చూర్ణం చేసుకుని దీనిని తీసుకుంటే మీకు ఉపశమనం లభిస్తుంది.

how to take karakkaya for many health problems

ఎక్కిళ్లు, ఉబ్బసం, దగ్గు, గుండె జబ్బులు కలిసి వచ్చినప్పుడు కొంచెం వేడి చేసిన పాత నెయ్యి లో కరక్కాయ పెచ్చులు చూర్ణం, ఇంగువ పొడి బిడలవణం చేర్చి అర టీ స్పూన్ చొప్పున రెండు పూటలా తీసుకోవాలి. దీనితో ఈ సమస్యలు మాయమైపోతాయి. చిన్న పిల్లలకి 1 నుంచి ఐదేళ్ల వరకు క్రమం తప్పకుండా దీన్ని ఇస్తే రోగనిరోధక శక్తి పెరిగి వృద్ధాప్యం లోనూ ఆరోగ్యంగా ఉంటారట. జలుబు జ్వరాలు తగ్గాలంటే కరక్కాయ పొడి తీసుకుంటే చిటికలో మాయమైపోతాయి.

Admin

Recent Posts