Hair Growth : కొబ్బ‌రినూనెతో ఇలా చేస్తే చాలు.. మీ జుట్టు మూడింత‌లు పొడ‌వు పెరుగుతుంది..!

Hair Growth : ప్ర‌తి ఒక్క‌రూ జుట్టు పెర‌గాల‌నే కోరుకుంటారు త‌ప్ప జుట్టు రాలిపోవాల‌ని ఎవ‌రూ కోరుకోరు. ముఖ్యంగా మ‌హిళ‌లు ఈ విష‌యంలో అత్యంత శ్ర‌ద్ధ వ‌హిస్తారు. జుట్టు రాలిపోతుందంటే వారు నానా హైరానా ప‌డుతుంటారు. ఇక ప్ర‌స్తుత త‌రుణంలో జుట్టు రాలిపోయేందుకు అనేక కార‌ణాలు ఉంటున్నాయి. ముఖ్యంగా కాలుష్యం, జీవ‌న విధానంలో మార్పులు, అనారోగ్యక‌ర‌మైన ఆహారాల‌ను తీసుకోవ‌డం, ఒత్తిడి, ఆందోళ‌న వంటి కార‌ణాల వ‌ల్ల చాలా మందికి జుట్టు రాలిపోతోంది. దీంతో చాలా మంది జుట్ట రాలిపోతుంద‌ని ఆందోళ‌న చెందుతుంటారు. అయితే ఈ స‌మ‌స్య‌ను త‌గ్గించుకోవ‌డం కోసం మార్కెట్‌లో లభించే అనేక ర‌కాల హెయిర్ కేర్ ప్రొడ‌క్ట్స్‌ను, ఖ‌రీదైన చికిత్స‌ల‌ను వాడుతుంటారు. కానీ వాటితో ఎలాంటి ఫ‌లితం ఉండ‌డం లేదు.

మ‌న చిన్న‌త‌నంలో మ‌న అమ్మ‌లు, అమ్మ‌మ్మ‌లు, నాయ‌న‌మ్మ‌లు త‌మ జుట్టును ఎంతో పొడ‌వుగా, దృఢంగా ఉంచుకునేవారు. అయితే ఇప్పుడు ఉన్న‌ట్లుగా అప్ప‌ట్లో ఎలాంటి హెయిర్ కేర్ ప్రొడ‌క్ట్స్ కూడా లేవు. ఖ‌రీదైన చికిత్స‌లు లేవు. అంతా స‌హ‌జ‌సిద్ధంగా జ‌రిగేది. అందువ‌ల్లే అప్ప‌టి త‌రం వారి జుట్టు అంత పొడ‌వుగా, అంత దృఢంగా ఉండేది. ఇందుకు వారు ఇంట్లో ఉప‌యోగించే ప‌లు స‌హ‌జ‌సిద్ధ‌మైన చిట్కాలే అని చెప్ప‌వ‌చ్చు. వీటిని వాడ‌డం వ‌ల్లే వారు త‌మ జుట్టును ఆరోగ్యంగా ఉంచుకునేవారు. దీంతో శిరోజాలు దృఢంగా, బ‌లంగా ఉండేవి. అలాగే పొడ‌వుగా కూడా పెరిగేవి.

how to use coconut oil for Hair Growth
Hair Growth

అయితే మీకు కూడా జుట్టు రాల‌డం అనే స‌మ‌స్య ఇబ్బందుల‌ను క‌లిగిస్తుంటే అందుకు మీరు ఈ నూనెను వాడ‌వ‌చ్చు. దీన్ని అప్లై చేయ‌డం వ‌ల్ల మీ జుట్టు స్ట్రాంగ్‌గా మారుతుంది. జుట్టు పొడ‌వుగా పెరిగి మృదువుగా అవుతుంది. ఇందుకుగాను మీరు కొబ్బ‌రినూనెను ఇప్పుడు చెప్ప‌బోయే ప‌దార్థాల‌తో మిక్స్ చేసి వాడితే చాలు. ఈ క్ర‌మంలోనే ఆ చిట్కా ఏమిటో ఇప్పుడు చూద్దాం. ఆముదం 2 టీస్పూన్లు, కొబ్బ‌రి నూనె 2 టేబుల్ స్పూన్లు, మెంతులు 1 టీస్పూన్‌, క‌రివేపాకులు 5 లేదా 6 తీసుకోవాలి.

ముందుగా పాన్ తీసుకుని అందులో కొబ్బ‌రినూనె వేసి వేడి చేయాలి. అందులోనే మెంతులు, కరివేపాకులు కూడా బాగా వేయించాలి. 2 నిమిషాలు అయ్యాక వాటిని ఒక బౌల్‌లోకి తీసుకుని 30 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. త‌రువాత దాన్ని వ‌డ‌క‌ట్టి అందులో ఆముదం క‌ల‌పాలి. అనంత‌రం ఆ మిశ్ర‌మాన్ని జుట్టుకు బాగా ప‌ట్టించాలి. త‌రువాత 1 గంట సేపు ఆగి త‌ల‌స్నానం చేయాలి. ఇలా వారంలో క‌నీసం 2 సార్లు చేయాలి. దీంతో జుట్టు రాల‌డం త‌గ్గుతుంది. శిరోజాలు ఒత్తుగా, దృఢంగా పెరుగుతాయి. కాంతివంతంగా మారుతాయి.

Editor

Recent Posts