Mango Peels : మామిడిపండు తొక్క‌ల‌తో ఇన్ని ఉప‌యోగాలు ఉన్నాయా.. ఇవి తెలిస్తే ఇక‌పై ప‌డేయ‌రు..!

Mango Peels : వేస‌వి అన‌గానే మ‌న‌కు ముందుగా గుర్తుకు వ‌చ్చే పండ్ల‌లో మామిడి పండ్లు కూడా ఒక‌టి. ఇవి మ‌న‌కు వేస‌వి ముగిసిన త‌రువాత 4 నుంచి 5 నెల‌ల వ‌ర‌కు కూడా ల‌భిస్తుంటాయి. అయితే చాలా మంది మామిడి పండ్ల‌ను తొక్క‌తీసి తింటుంటారు. కానీ వాస్త‌వానికి తొక్క‌లో కూడా అద్భుత‌మైన పోష‌కాలు ఉంటాయి. మామిడి పండ్ల‌ను తొక్క‌తో స‌హా తినాల్సిందే. మామిడి పండ్ల తొక్క వ‌ల్ల మ‌న‌కు ఎన్నో ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. మామిడి పండు తొక్క‌ల్లో యాంటీ డ‌యాబెటిక్ గుణాలు ఉంటాయి. ఇవి డ‌యాబెటిస్‌కు వ్య‌తిరేకంగా పోరాటం చేస్తాయి.

డ‌యాబెటిస్ ఉన్న‌వారు షుగ‌ర్ లెవ‌ల్స్ పెర‌గ‌కూడ‌దు అనుకుంటే మామిడి పండ్ల‌ను తొక్క‌తో స‌హా తినాలి. దీంతో ఓ వైపు మామిడి పండ్ల రుచిని ఆస్వాదించ‌వ‌చ్చు. మరోవైపు పోష‌కాలు, ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు ల‌భిస్తాయి. ఇంకోవైపు షుగ‌ర్ లెవ‌ల్స్ పెర‌గ‌కుండా చూసుకోవ‌చ్చు. తొక్క‌ల‌ను తింటే వాటిల్లో అనేక స‌మ్మేళ‌నాలు శ‌రీరంలోకి వెళ్తాయి. ఇవి షుగ‌ర్ లెవ‌ల్స్ పెర‌గ‌కుండా చూస్తాయి. క‌నుక మామిడి పండ్ల తొక్క‌లు షుగ‌ర్ ఉన్న‌వారికి ఎంతో మేలు చేస్తాయ‌ని చెప్ప‌వ‌చ్చు.

Mango Peels wonderful health benefits how to use them
Mango Peels

మామిడి పండ్ల తొక్క‌ల్లో మాంగిఫెరిన్‌, బెంజోఫినోన్ అనే స‌మ్మేళ‌నాలు ఉంటాయి. ఇవి క్రిమినాశ‌క గుణాల‌ను క‌లిగి ఉంటాయి. అందువ‌ల్ల ఈ తొక్క‌లు స‌హ‌జ‌సిద్ధ‌మైన ఎరువులా ప‌నిచేస్తాయి. ఇవి మొక్క‌ల‌ను, పంట‌ల‌ను చీడ‌పీడ‌ల నుంచి ర‌క్షిస్తాయి. మామిడి పండ్ల తొక్క‌ల‌ను ఎరువుగా ఉప‌యోగించ‌వ‌చ్చు. ఇంట్లోని మొక్క‌ల‌కు లేదా పంట పొలాల్లోనూ వీటిని ఎరువుగా వాడ‌వ‌చ్చు.

మామిడి పండ్ల తొక్క‌ల్లో పాలిఫినాల్స్, కెరోటినాయిడ్స్ ఉంటాయి. ఇవి ఫోటోప్రొటెక్టివ్ ల‌క్ష‌ణాల‌ను క‌లిగి ఉంటాయి. అందువ‌ల్ల ఇవి చ‌ర్మాన్ని సంర‌క్షిస్తాయి. సూర్యుని నుంచి వ‌చ్చే అతినీల‌లోహిత కిర‌ణాల బారి నుంచి మ‌న చ‌ర్మాన్ని ఇవి ర‌క్షిస్తాయి. మామిడి పండు తొక్క‌ల‌ను పొడిగా చేసి దాంతో దంతాల‌ను తోముకోవ‌చ్చు. దీంతో దంతాలు, చిగుళ్లు దృఢంగా, ఆరోగ్యంగా ఉంటాయి. నోటి దుర్వాస‌న త‌గ్గుతుంది. మామిడి పండు తొక్క‌ల‌ను పేస్ట్‌లా చేసి ఆ మిశ్ర‌మాన్ని రాస్తుంటే గాయాలు, పుండ్లు త్వ‌ర‌గా మానుతాయి. ఈ తొక్క‌ల‌ను తిన‌డం వ‌ల్ల క్యాన్స‌ర్ రాకుండా అడ్డుకోవ‌చ్చు. శ‌రీరంలో వాపులు, నొప్పులు త‌గ్గుతాయి. ఇలా మామిడి పండు తొక్క‌ల‌తో ఎన్నో లాభాలు ఉన్నాయి క‌నుక వీటిని ఇక‌పై ప‌డేయ‌కుండా తినండి.

Editor

Recent Posts