చిట్కాలు

మలబద్దక సమస్యతో బాధపడుతున్నారా.. రోజు రెండు లవంగాలతో ఇలా చేస్తే?

సాధారణంగా మన భారతీయ వంటకాలలో లవంగాలు ఎంతో ప్రాధాన్యత ఉంది. లవంగాలను మన సుగంధ ద్రవ్యాలలో ఒకటిగా భావిస్తారు.వంటకు రుచిని సువాసనలు అందించడమే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందించే లవంగాలను ప్రతి రోజు రాత్రి నిద్రపోయే ముందు రెండు లవంగాలను నమిలి తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.ప్రతిరోజూ పడుకునే ముందు రెండు లవంగాలు తినడం వల్ల ఏ విధమైనటువంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇక్కడ తెలుసుకుందాం.

*లవంగాలలో విటమిన్లు, మినరల్స్, ఫైబర్స్, సోడియం, పొటాషియం, కాల్షియం, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి.ముఖ్యంగా జలుబు, దగ్గు, గొంతునొప్పి వంటి సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు రెండు లవంగాలు తినడం వల్ల ఈ విధమైనటువంటి దగ్గు జలుబు వంటి సమస్యలు దూరం అవుతాయి.

if you have constipation use only 2 cloves

* మలబద్దక సమస్యతో బాధపడే వారు ప్రతిరోజు రెండు లవంగాలను నమిలి తిని ఒక గ్లాసు గోరువెచ్చని నీటిని తాగి పడుకోవడం వల్ల అజీర్తి సమస్యలు తొలగిపోయి మలబద్ధకం నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

* ముఖ్యంగా మహిళలకు యుక్త వయసు రాగానే వారి చర్మం పై మొటిమలు ఎంతో బాధిస్తుంటాయి. అయితే ప్రతిరోజు రాత్రి రెండు లవంగాలు తినడం వల్ల ఇందులో ఉన్నటువంటి ఆంటీ ఆక్సిడెంట్ లో మన శరీరంలో ఫ్రీరాడికల్స్ తో పోరాడే చర్మం పై ఏర్పడిన మృతకణాలను, మొటిమలను తొలగించి చర్మం ఎంతో కాంతివంతంగా మెరుస్తుంది.

*లవంగాలు ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరమని అతిగా తినడం వల్ల కడుపు ఉబ్బరం, గ్యాస్ ట్రబుల్ సమస్యలు తలెత్తుతాయి కనుక మితంగా తీసుకోవడం వల్ల పై తెలిపిన ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.

Share
Admin

Recent Posts