హెల్త్ టిప్స్

Curry Leaves Powder : ఈ పొడిని రోజూ తింటే చాలు.. క‌ళ్ల‌ద్దాల‌ను తీసి అవ‌త‌ల ప‌డేస్తారు..!

Curry Leaves Powder : కంటికి సంబంధించిన సమస్యలు ఏమీ లేకుండా ఉండాలంటే మనం తీసుకునే ఆహారంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని ఆహారాలను తీసుకుంటే కంటి చూపు మెరుగు అవుతుంది. అలాగే కంటికి సంబంధించిన సమస్యలు ఏమీ ఉండవు. అలాంటి ఆహారాలలో కరివేపాకు ఒకటి. కరివేపాకును ప్రతి రోజూ వంటల్లో వాడుతూ ఉంటాం. చాలా మంది కరివేపాకును కూరల్లో ఏరి తీసి పాడేస్తూ ఉంటారు. అలా ప‌డేయకుండా తింటే మంచిది.

కరివేపాకును పొడిగా చేసుకొని ప్రతి రోజూ భోజనం సమయంలో మొదటి ముద్దలో కరివేపాకు పొడి కలిపి తింటే సరిపోతుంది. ఇలా 15 రోజుల పాటు తింటే కంటికి సంబంధించిన సమస్యలు తగ్గడ‌మే కాకుండా ఎన్నో ఆరోగ్యక‌ర‌మైన‌ ప్రయోజనాలు క‌లుగుతాయి.

use curry leaves powder daily to remove eye glasses

కరివేపాకు కంటి చూపుకు చాలా మంచిది. కరివేపాకులో విటమిన్ ఎ చాలా సమృద్దిగా ఉంటుంది. విటమిన్ ఎ కార్నియాను రక్షించే కెరోటినాయిడ్లను కలిగి ఉంటుంది. విటమిన్ ఎ లోపం వల్ల క‌ళ్ల‌లో శుక్లాలు, రాత్రి అంధత్వం మొదలైన కంటి సమస్యలు వచ్చేందుకు అవ‌కాశాలు ఉంటాయి. కాబట్టి కంటి ఆరోగ్యానికి కరివేపాకులను మీ ఆహారంలో క్రమం తప్పకుండా చేర్చుకోవాలి. దీంతో క‌ళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. చూపు మెరుగుప‌డుతుంది. అలాగే ఇత‌ర ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు కూడా క‌లుగుతాయి.

Admin

Recent Posts