తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కావడం లేదా ? అయితే ఈ చిట్కాలను పాటించండి..!

అజీర్ణ సమస్య అనేది చాలా మందికి సహజంగానే వస్తుంటుంది. వేళకు భోజనం చేయకపోయినా, అతిగా భోజనం చేసినా, కారం, మసాలు ఉండే పదార్థాలను ఎక్కువగా తిన్నా, మాంసం ఎక్కువగా తిన్నా.. అజీర్ణం వస్తుంది. అయితే కింద తెలిపిన చిట్కాలను పాటిస్తే ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. మరి ఆ చిట్కాలు ఏమిటంటే..

తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కావడం లేదా ? అయితే ఈ చిట్కాలను పాటించండి..!తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కావడం లేదా ? అయితే ఈ చిట్కాలను పాటించండి..!

1. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం.. రోజుకు మూడు పూటలా భోజనం చేసేందుకు 30 నిమిషాల ముందు ఒక గ్లాస్‌ గోరు వెచ్చని నీటిని తాగాలి. దీంతో అజీర్ణం తగ్గుతుంది.

2. భోజనం చేసిన అనంతరం ద్రాక్ష, జామకాయలు, చెర్రీలు, పైనాపిల్‌ వంటి పండ్లను తింటే ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. అజీర్ణ సమస్య బాధించదు.

3. భోజనం చేసేముందు ఒక టీస్పూన్‌ అల్లం రసాన్ని తాగాలి. రోజుకు మూడు పూటలా ఇలా చేస్తుంటే అజీర్ణం తగ్గుతుంది. గ్యాస్‌ సమస్య కూడా పోతుంది.

4. భోజనం చేసిన వెంటనే రెండు టీస్పూన్ల సోంపు గింజలను నోట్లో వేసుకుని బాగా నమలండి. దీంతో తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది.

5. భోజనం అనంతరం చిన్న బెల్లం ముక్కను తింటున్నా జీర్ణ సమస్యలు తగ్గుతాయి.

6. రాత్రి భోజనం అనంతరం ఒక గ్లాస్‌ గోరు వెచ్చని పాలలో కొద్దిగా మిరియాల పొడి కలిపి తాగుతుండాలి. జీర్ణ సమస్యలు ఉండవు.

Admin

Recent Posts