ఆరోగ్యంగా ఉండాలంటే వారానికి ఎన్ని కోడిగుడ్ల‌ను తినాలో తెలుసా ?

కోడిగుడ్ల‌లో అనేక పోష‌కాలు ఉంటాయి. మ‌న శ‌రీరానికి ఉప‌యోగ‌ప‌డే చాలా వ‌ర‌కు పోష‌కాలు గుడ్ల‌లో మ‌న‌కు ల‌భిస్తాయి. అందుక‌నే గుడ్ల‌ను సంపూర్ణ పోష‌కాహారంగా చెబుతారు. కోడ‌గుడ్ల‌లో పొటాషియం, నియాసిన్‌, రైబోఫ్లేవిన్, మెగ్నిషియం, విట‌మిన్ ఎ, ఫాస్ఫ‌ర‌స్‌, జింక్‌, ఐర‌న్‌, విట‌మిన్ డి, విట‌మిన్లు బి6, బి12, ఫోలిక్ యాసిడ్ వంటి ఎన్నో పోష‌కాలు ఉంటాయి.

ఆరోగ్యంగా ఉండాలంటే వారానికి ఎన్ని కోడిగుడ్ల‌ను తినాలో తెలుసా ?

ఒక కోడిగుడ్డులో 180 నుంచి 300 మిల్లీగ్రాముల వ‌ర‌కు కొలెస్ట్రాల్ ఉంటుంది. కోడిగుడ్డు తెల్ల సొన‌లో కొలెస్ట్రాల్ ఉండ‌దు. ఐసీఎంఆర్ మార్గ‌ద‌ర్శ‌కాల ప్ర‌కారం రోజుకు మ‌నం 300 మిల్లీగ్రాముల వ‌ర‌కు కొలెస్ట్రాల్ తీసుకోవ‌చ్చు. అంటే.. సుమారుగా రోజుకు 1 గుడ్డు తిన‌వ‌చ్చ‌న్న‌మాట‌. అయితే కోడిగుడ్డు తెల్ల సొన‌లో కొలెస్ట్రాల్ ఉండ‌దు. క‌నుక వాటిని మ‌న‌కు న‌చ్చిన విధంగా తిన‌వ‌చ్చు. కానీ ప‌చ్చ‌నిసొన‌తో క‌లిపి అయితే మాత్రం ఒక గుడ్డును మాత్ర‌మే తినాల్సి ఉంటుంది.

అందువ‌ల్ల వారానికి 7 గుడ్ల వ‌ర‌కు తిన‌వ‌చ్చు. రోజుకు ఒక గుడ్డు చొప్పున వారంలో 7 గుడ్ల‌ను తిన‌వ‌చ్చు. అయితే ఇది ఆరోగ్య‌వంతుల‌కు మాత్ర‌మే. డయాబెటిస్, గుండె జ‌బ్బులు, కొలెస్ట్రాల్‌, అధిక బ‌రువు స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న వారు వారంలో 3 కోడిగుడ్ల‌ను తిన‌వ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు.

కోడిగుడ్ల‌లో మ‌న శ‌రీరానికి ఉప‌యోగ‌ప‌డే ఎన్నో పోష‌కాలు ఉంటాయి క‌నుక ఆరోగ్య‌వంత‌మైన వారు రోజుకు 1 గుడ్డు తిన‌వ‌చ్చు. ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డేవారు రెండు రోజుల‌కు 1 గుడ్డు చొప్పున తిన‌వ‌చ్చు. ఈ విధంగా గుడ్ల‌ను తింటే ఆరోగ్యంగా ఉండ‌వ‌చ్చు. దీంతో పోష‌కాలు, శ‌క్తి ల‌భిస్తాయి.

Admin

Recent Posts