Jilledu Aku For Knee Pain : అనేక ఔషధ గుణాలు కలిగి మొక్కల్లో జిల్లేడు మొక్క కూడా ఒకటి. ఈ మొక్క ఎక్కడపడితే అక్కడ పెరుగుతుంది. చాలా మంది దీనిలో ఔషధ గుణాలు ఉంటాయని తెలియక పిచ్చి మొక్కగా భావిస్తూ ఉంటారు. కానీ ఈ మొక్కను ఉపయోగించడం వల్ల మనం అనేక రకాల అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. జిల్లేడు మొక్క శాస్త్రీయనామం కలట్రోపిస్ జిగాన్ షియా. అలాగే దీనిని అరక్కా అని సంస్కృతంలో పిలుస్తారు. జిల్లేడు ఆకులు తమలపాకుల వలె ఉంటాయి. అలాగే జిల్లేడు చెట్టు ప్రతి భాగం నుండి కూడా పాలు వస్తాయి. జిల్లేడు పాలు విషపూరితమైనవి. అదే విధంగా జిల్లేడు చెట్టు ప్రతి భాగంలో కూడా ఔషధ గుణాలు దాగి ఉన్నాయి.
అలాగే వీటిలో ఎర్ర జిల్లేడు, తెల్ల జిల్లేడు అని రెండు రకాలు ఉంటాయి. ఈ మొక్క విషపూరితమైనదే అయినప్పటికి దీనిని సరైన పద్దతిలో ఉపయోగించడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. జిల్లేడు పాలకు సమానంగా నీటిని కలిపి కాళ్లకు రాసుకోవడం వల్ల కాళ్ల పగుళ్లు తగ్గుతాయి. అలాగే జిల్లేడు ఆకులను వేడి చేసి మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు ఉన్న చోట ఉంచి కట్టు కట్టాలి. ఇలా చేయడం వల్ల మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు, వాపు, ఎరుపుదనం అన్నీ తగ్గుతాయని నిపుణులు తెలియజేస్తున్నారు.
అలాగే ఈ మొక్క ఆకులను వేడి చేసి రసాన్ని తీయాలి. ఈ రసాన్ని ఒకటి లేదా రెండు చుక్కల మోతాదులో చెవిలో వేయడం వల్ల చెవినొప్పి తగ్గుతుంది. అదే విధంగా స్త్రీలల్లో వచ్చే ఋతు దోషాలను తగ్గించడంలో జిల్లేడు పువ్వుల పొడి ఎంతో ఉపయోగపడుతుంది. జిల్లేడు ఆకులకు పసుపు కలిపి నూరి లేపనంగా రాసుకోవడం వల్ల చర్మ సమస్యలు తగ్గుతాయి. అలాగే ఒక గిన్నెలో లవంగాలను తీసుకుని అవి మునిగే వరకు జిల్లేడు పాలను పోసి ఎండలో పెట్టాలి. ఇలా వారం రోజుల పాటు పాలు పోస్తూ ఎండబెడుతూ ఉండాలి. తరువాత ఈ లవంగాలను పూర్తిగా ఎండబెట్టి నిల్వ చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న లవంగాలను తీసుకోవడం వల్ల మలబద్దకం సమస్య తగ్గి సుఖ విరోచనం అవుతుందని నిపుణులు చెబుతున్నారు.
ఈ విధంగా జిల్లేడు మొక్క మనకు ఎంతగానో ఉపయోగపడుతుందని దీనిని వాడడం వల్ల వివిధ రకాల అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. జిల్లేడు మొక్క ఉపయోగకారి అయినప్పటికి దీనిని ఉపయోగించేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరమని వీటిని వీలైనంత వరకు పెద్దల పర్యవేక్షణలో, వైద్యుల పరర్యవేక్షణలో మాత్రమే ఉపయోగించాలని వారు సూచిస్తున్నారు.