Joint Pains And Arthritis : కీళ్ల నొప్పులు, వెన్ను నొప్పి, ఆర్థ‌రైటిస్‌, గౌట్ లాంటి వ్యాధుల‌కు.. అద్భుత‌మైన చిట్కాలు..!

Joint Pains And Arthritis : కీళ్ల వాతం.. ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారు మ‌న‌లో చాలా మంది ఉన్నారు. కీళ్ల వాతం స‌మ‌స్య నేటి త‌రుణంలో స‌ర్వ‌సాధార‌ణ‌మైపోయింది. కీళ్ల వాతం కార‌ణంగా శ‌రీరంలో ఒకే చోట కాకుండా వివిధ భాగాల్లో కీళ్ల నొప్పులు త‌రుచూ వ‌స్తూ ఉంటాయి. కీళ్ల వాతం కార‌ణంగా కీళ్ల భాగంలో నొప్పులు, వాపులు అలాగే ఆ భాగంలో ఎర్ర‌గా అవ్వ‌డం, న‌డుస్తున్న‌ప్పుడు, కూర్చున‌ప్పుడు నొప్పులు రావ‌డం, కీళ్లు పట్టినట్టు ఉండ‌డం వంటి ల‌క్ష‌ణాలు ఎక్కువ‌గా క‌నిపిస్తాయి. ఈ స‌మ‌స్య చిన్న నొప్పిగా మొద‌ల‌య్యి న‌డ‌వ‌డానికి కూడా వీలుకానంత పెద్ద స‌మ‌స్య‌గా మారుతుంది. కీళ్ల వాతం ముఖ్యంగా శ‌రీరంలో యూరిక్ యాసిడ్ పెరిగిపోవ‌డం వ‌ల్ల త‌లెత్తుతుంది. యూరిక్ యాసిడ్ పెరిగిపోవ‌డం వ‌ల్ల మ‌నం కీళ్ల‌వాతంతో పాటు అనేక ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌లు కూడా త‌లెత్తుతాయి. మూత్ర‌పిండాలు స‌రిగ్గా ప‌నిచేయ‌క‌పోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో యూరిక్ యాసిడ్ విప‌రీతంగా పెరిగిపోతుంది.

దీంతో ఈ యూరిక్ యాసిడ్ కీళ్ల మ‌ధ్య పేరుకుపోతుంది. కీళ్ల‌వాతం వంశ‌పార‌ప‌ర్యంగా వ‌చ్చే అవ‌కాశం కూడా ఉంది. ఈ స‌మ‌స్య త‌లెత్త‌గానే చాలా మంది అనేక ర‌కాల మందుల‌ను వాడుతూ ఉంటారు. అయితే కొంద‌రిలో ఈ మందులు ప‌ని చేస్తాయి. మ‌రికొంద‌రిలో ఈ మందులు చాలా కాలం వ‌ర‌కు అస్స‌లు పని చేయ‌వు. ఎక్కువ కాంల పాటు మందులు వాడ‌డం వ‌ల్ల మ‌నం అనేక ఇత‌ర దుష్ప్ర‌భావాల బారిన ప‌డాల్సి వ‌స్తుంది. ఎటువంటి దుష్ప్ర‌భావాలు లేకుండా చ‌క్క‌టి ఆయుర్వేద చిట్కాల‌ను వాడి మ‌నం ఈ స‌మ‌స్య నుండి చాలా సుల‌భంగా బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు. కీళ్ల వాతాన్ని త‌గ్గించ‌డంలో శొంఠి ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. ముందుగా ఒక గిన్నెలో 6 టీ స్పూన్ల శొంఠి పొడిని తీసుకోవాలి. త‌రువాత ఇందులో 6 టీ స్పూన్ల జీల‌క‌ర్ర పొడి, 3 టీ స్పూన్ల మిరియాల పొడి వేసి క‌ల‌పాలి. ఇలా త‌యారు చేసుకున్న పొడిని అర టీ స్పూన్ మోతాదులో ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో వేసి క‌లిపి తాగాలి.

Joint Pains And Arthritis wonderful home remedies
Joint Pains And Arthritis

ఇలా రోజుకు మూడు పూట‌లా ఆహారం తీసుకోవ‌డానికి అర గంట ముందు ఈ నీటిని తాగాలి. ఈ విధంగా తాగ‌డం వ‌ల్ల కీళ్ల నొప్పులు, వాపులు త‌గ్గుతాయి. అలాగే ఆపిల్ సైడ్ వెనిగ‌ర్ ను తీసుకోవ‌డం వ‌ల్ల కూడా మ‌నం కీళ్ల వాతాన్ని చ‌క్క‌గా త‌గ్గించుకోవ‌చ్చు. ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో ఒక టీ స్పూన్ ఆపిల్ సైడ్ వెనిగ‌ర్, కొద్దిగా తేనె వేసి క‌లిపి తాగాలి. ఇలా రోజూ ఉద‌యం ప‌ర‌గ‌డుపున తాగ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది. కీళ్ల వాతం, కీళ్ల నొప్పుల‌తో బాధ‌ప‌డే వారు ఈ చిట్కాను వాడ‌డం వ‌ల్ల చ‌క్క‌టి ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. అదే విధంగా ప‌సుపును రోజూ ఉప‌యోగించ‌డం వ‌ల్ల కూడా కీళ్ల వాతం త‌గ్గుతుంది. మ‌న‌కు మార్కెట్ లో 500 ఎమ్ జి, 1000 ఎమ్ జి పసుపు క్యాప్సుల్స్ ల‌భిస్తాయి. వీటినైనా మ‌నం వాడ‌వ‌చ్చు లేదా రాత్రి ప‌డుకోవ‌డానికి అర‌గంట ముందు వేడి పాల‌ల్లో ప‌సుపు క‌లిపి తీసుకున్నా కూడా మంచి ఫ‌లితం ఉంటుంది.

అలాగే కీళ్లు ప‌ట్టుకుపోవ‌డం వంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారు ఆవ నూనెతో మ‌ర్ద‌నా చేసుకోవాలి. ఆవ‌నూనెతో మ‌ర్ద‌నా చేసుకోవ‌డం వ‌ల్ల కీళ్ల నొప్పులు త‌గ్గుతాయి. ఇలా మ‌ర్ద‌నా చేసుకుని ఆ ప్ర‌దేశంలో ప‌ట్టి క‌ట్టుకుని రాత్రంతా అలాగే ఉంచాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది. అలాగే శ‌రీరంలో ఆమ్ల‌త్వం ఎక్కువ‌గా ఉండ‌డం వ‌ల్ల కూడా కీళ్ల నొప్పులు వ‌స్తాయి. శ‌రీరంలో అమ్ల‌త్వాన్ని త‌గ్గించ‌డంలో సైంధ‌వ ల‌వ‌ణం ఎంత‌గానో స‌హాయ‌ప‌డుతుంది. అర టీ గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో చిటికెడు సైంధ‌వ ల‌వ‌ణం, అర చెక్క నిమ్మ‌ర‌సం క‌లపాలి. ఇలా త‌యారు చేసుకున్న మిశ్ర‌మాన్ని అర టీ స్పూన్ మోతాదులో ఉద‌యం తీసుకోవాలి. అలాగే మ‌రో అర టీ స్పూన్ మోతాదులో రాత్రి తీసుకోవాలి. అలాగే ఫిష్ ఆయిల్ వాడ‌డం వ‌ల్ల కూడా మంచి ఫ‌లితం ఉంటుంది. రోజూ ఉద‌యం ఒక క్యాప్సుల్ ను, సాయంత్రం మ‌రో క్యాప్సుల్ ను వాడ‌డం వ‌ల్ల కీళ్ల నొప్పుల‌తో బాధ‌ప‌డే వారు చ‌క్క‌టి ఫ‌లితాల‌ను పొంద‌వ‌చ్చు.

అలాగే మెంతికూర‌ను, మెంతుల‌ను వాడ‌డం వ‌ల్ల కూడా కీళ్ల వాతం స‌మ‌స్య నుండి ఉప‌శ‌మ‌నాన్ని పొంద‌వ‌చ్చు. ఒక గ్లాస్ నీటిలో ఒక టీ స్పూన్ మెంతుల‌ను వేసి రాత్రంతా నాన‌బెట్టాలి. ఉద‌యాన్నే ఈ నీటిని వేడి చేసి ఆ నీటిని తాగి మెంతుల‌ను తినాలి. ఇలా క్ర‌మం త‌ప్ప‌కుండా చేయ‌డం వ‌ల్ల కీళ్ల వాతం కొద్ది రోజుల్లోనే త‌గ్గుతుంది. ఈ విధంగా ఈ చిట్కాల‌ను వాడ‌డం వ‌ల్ల మ‌నం ఎటువంటి దుష్ప్ర‌భావాలు లేకుండా కీళ్ల వాతం స‌మ‌స్య నుండి బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు. ఈ చిట్కాల‌ను పాటిస్తూనే చ‌క్క‌టి ఆహారాన్ని తీసుకోవాలి. విట‌మిన్ సితో పాటు ప‌చ్చి కూర‌గాయ‌ల‌ను ఎక్కువ‌గా తీసుకోవాలి. నీటిని ఎక్కువ‌గా తాగాలి. ఈ విధంగా ఈ చిట్కాల‌ను వాడ‌డం వ‌ల్ల కీళ్ల వాతంతో బాధ‌ప‌డే వారు మంచి ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు.

D

Recent Posts