Joint Pains : ఈ లేపనాన్ని 3 రోజుల పాటు వాడితే చాలు ఎటువంటి కీళ్ల నొప్పులైనా, మోకాళ్ల నొప్పులైనా తగ్గిపోతాయి. అరికాళ్లల్లో, కాళ్ల కండరాలల్లో నొప్పులు, ఆర్థరైటిస్ నొప్పులు, గౌట్ నొప్పులు ఇలా ఎలాంటి నొప్పులనైనా ఈ చిట్కాను ఉపయోగించి నయం చేసుకోవచ్చు. ఈ లేపనాన్ని కీల్ల నొప్పులు ఉన్న చోట రాసి మర్దనా చేయడం వల్ల చాలా సులభంగా నొప్పులను తగ్గించుకోవచ్చు దీనిని వాడిన మొదటి రోజే నొప్పి నుడి కలిగే ఉపశమనాన్ని మనం గమనించవచ్చు. మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులను తగ్గించే ఈ లేపనాన్ని ఎలా తయారు చేసుకోవాలి..తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి..అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ లేపనాన్ని తయారు చేసుకోవడానికి గానూ మనం పసుపును, నల్ల రంగులో ఉండే పాత బెల్లాన్ని, పటికను, మెంతి పొడిని ఉపయోగించాల్సి ఉంటుంది.
ముందుగా ఒక కళాయిలో ఒక టీ స్పూన్ పసుపు, ఒక టీ స్పూన్ బెల్లం తరుము, ఒక టీ స్పూన్ మెంతి పొడి, ఒక టీ స్పూన్ పటిక పొడి వేసి కలుపుతూ వేడి చేయాలి. ఇలా ఒక నిమిషం పాటు వేడి చేసిన తరువాత ఇందులో తగినన్ని నీళ్లు పోసి పేస్ట్ లాగా చేసుకోవాలి. తరువాత ఈ పేస్ట్ ను దగ్గర పడే వరకు మరో 5 నిమిషాల పాటు కలుపుతూ వేడి చేయాలి. తరువాత స్టవ్ ఆఫ్ చేసి ఈ మిశ్రమాన్ని గోరు వెచ్చగా అయ్యే వరకు ఉంచాలి. తరువాత ఈ మివ్రమాన్ని కొద్ది కొద్దిగా తీసుకుంటూ నొప్పి ఉన్న ప్రదేశంలో నెమ్మదిగా రాసుకోవాలి. ఇలా రోజూ రాత్రి పడుకునే ముందు రాసుకుని వాటిపై నుండి పట్టీలను చుట్టుకోవాలి లేదా కాటన్ వస్త్రంతో గట్టిగా చుట్టుకోవాలి. దీనిని రాత్రంతా అలాగే ఉంచి ఉదయాన్నే సైంధవ లవణం వేసిన గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మోకాళ్ల నొప్పులు, ఆర్థరైటిస్ నొప్పులు, కీళ్ల నొప్పులు ఇలా అన్ని రకాల నొప్పులు తగ్గుతాయి.
అలాగే ఈ చిట్కాను పాటిస్తూనే చక్కటి ఆహారాన్ని తీసుకోవాలి. జంక్ ఫుడ్ కు, తీపి పదార్థాలకు వీలైనంత దూరంగా ఉండాలి. అధిక బరువును తగ్గించుకోవాలి. ప్రతిరోజూ వ్యాయామం చేయాలి. చక్కటి జీవన విధానాన్ని పాటించాలి. ప్రస్తుత కాలంలో వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు అనేక రకాల కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారు. ఈ సమస్య నుండి బయటపడడానికి పెయిన్ కిల్లర్స్ ను వాడుతున్నారు. పెయిన్ కిల్లర్స్ ను వాడడం వల్ల అనేక దుష్ప్రభావాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. పెయిన్ కిల్లర్స్ ను వాడే అవసరం లేకుండా ఈ చిట్కాను పైన చెప్పిన విధంగా వాడడం వల్ల చాలా సులభంగా అన్ని రకాల కీళ్ల నొప్పులను తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.