Kidneys Cleaning : కిడ్నీల్లో చేరిన వ్యర్థాలను తొలగించి కిడ్నీలను ఇలా క్లీన్‌ చేసుకోండి..!

Kidneys Cleaning : మన శరీరంలోని అవయాల్లో కిడ్నీలు ఒకటి. ఇవి సరిగ్గా పనిచేస్తేనే మన శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. కిడ్నీలు మన శరీరంలో ఎప్పటికప్పుడు పేరుకుపోయే వ్యర్థాలను, విష పదార్థాలను బయటకు పంపుతాయి. దీంతో కిడ్నీలు ఆరోగ్యంగా ఉండడమే కాదు, శరీరం కూడా ఆరోగ్యంగానే ఉంటుంది.

Kidneys Cleaning follow these tips to remove toxins

అయితే ప్రస్తుతం చాలా మంది కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. అందుకు అనేక కారణాలు ఉంటున్నాయి. శరీరంలోని వ్యర్థాలు బయటకు వెళ్లకపోతే కిడ్నీలు పాడవుతాయి. కిడ్నీల ఆరోగ్యం దెబ్బ తింటుంది. కనుక కిడ్నీ సమస్యలు వచ్చేందుకు ఇది ప్రధాన కారణంగా చెప్పవచ్చు. కాబట్టి కిడ్నీలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది. శరీరంలోని, కిడ్నీల్లోని వ్యర్థాలను బయటకు పంపుతుంటే.. తద్వారా కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. మరి కిడ్నీలను క్లీన్‌ చేయాలంటే.. అందుకు ఏ చిట్కాలను పాటించాలో ఇప్పుడు తెలుసుకుందామా..!

1. చెర్రీలు, క్రాన్‌ బెర్రీలు, స్ట్రా బెర్రీల వంటి బెర్రీ పండ్లను రోజూ తింటుండాలి. ఇవి కిడ్నీలను శుభ్రం చేస్తాయి. కిడ్నీల్లోని వ్యర్థాలను బయటకు పంపుతాయి. మూత్రాశయ ఇన్‌ఫెక్షన్లు రాకుండా చూస్తాయి. దీంతో కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి.

2. నారింజ లేదా బత్తాయి పళ్ల రసాలను రోజూ తాగుతుండాలి. ఉదయం బ్రేక్‌ ఫాస్ట్‌ చేసిన తరువాత టీ, కాఫీలకు బదులుగా ఈ పళ్ల రసాలను తాగితే కిడ్నీలు శుభ్రంగా మారిపోతాయి. ఈ పళ్లలో ఉండే సిట్రిక్‌ యాసిడ్‌, విటమిన్‌ సి, యాంటీ ఆక్సిడెంట్లు.. కిడ్నీలను క్లీన్‌ చేస్తాయి. దీంతో కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి. ఉదయం కప్పు మోతాదులో ఈ జ్యూస్‌లను తాగితే చాలు, ఫలితం ఉంటుంది.

3. రోజూ ఉదయాన్నే పరగడుపునే ఒక గ్లాస్‌ గోరు వెచ్చని నీటిలో కొద్దిగా నిమ్మరసం కలిపి తాగాలి. దీని వల్ల కిడ్నీలు మాత్రమే కాదు, లివర్‌, శరీరం కూడా అంతర్గతంగా క్లీన్‌ అవుతాయి. ఆయా అవయవాలు ఆరోగ్యంగా ఉంటాయి.

4. కొత్తిమీర ఆకుల రసాన్ని ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌ లో ఒక కప్పు మోతాదులో తాగుతుండాలి. దీని వల్ల కిడ్నీల్లోని వ్యర్థాలు బయటకు పోయి కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి.

5. మూత్రాశయ ఇన్‌ఫెక్షన్లను తగ్గించి కిడ్నీలను శుభ్రం చేయడంలో యాపిల్‌ జ్యూస్‌ కూడా బాగానే పనిచేస్తుంది. దీన్ని అయినా సరే రోజూ ఉదయాన్నే ఒక కప్పు మోతాదులో తాగితే చాలు, ఫలితం ఉంటుంది.

Admin

Recent Posts