Kovvu Gaddalu : శరీరంలో ఎక్క‌డ కొవ్వు గ‌డ్డ‌లు ఉన్నా స‌రే.. ఇది రాస్తే చాలు.. క‌రిగిపోతాయి..!

Kovvu Gaddalu : మ‌నల్ని వేధించే వివిధ ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల్లో కొవ్వు గ‌డ్డ‌లు కూడా ఒక‌టి. శ‌రీరంలో అధికంగా చేరిన కొవ్వు తిత్తిలా ఏర్ప‌డి కొవ్వు గడ్డ‌లు ఏర్ప‌డుతూ ఉంటాయి. ఇవి శ‌రీరంలో ఎక్క‌డైనా ఏర్ప‌డ‌వ‌చ్చు. చిన్న చిన్న గ‌డ్డ‌లుగా లేదా పెద్ద గ‌డ్డ‌లుగా కూడా ఏర్ప‌డ‌వ‌చ్చు. ఈ గ‌డ్డ‌ల‌ను ఎడిమా అని కూడా అంటారు. అయితే ఇవి న‌రాల‌పై ఏర్ప‌డ‌డం వల్ల కొన్ని సార్లు నొప్పి క‌లిగే అవ‌కాశం ఉంది. అయితే ఈ కొవ్వు గ‌డ్డ‌ల వ‌ల్ల ఎటువంటి న‌ష్టం లేనప్ప‌టికి కొన్ని సార్లు ఇవి క్యాన్స‌ర్ గడ్డ‌లుగా ఏర్ప‌డే అవ‌కాశం ఉంది. అయితే వీటిని తొల‌గించుకోవ‌డానికి శ‌స్త్ర‌చికిత్స ఒక్క‌టే మార్గ‌మ‌ని నిపుణులు సూచిస్తూ ఉంటారు. కానీ ఒక్క చ‌క్క‌టి ఆయుర్వేద చిట్కా వ‌ల్ల మ‌నం చాలా సుల‌భంగా ఈ కొవ్వు గ‌డ్డ‌ల‌ను త‌గ్గించుకోవ‌చ్చు. ఈ చిట్కాను పాటిస్తే చాలా సుల‌భంగా కొవ్వు గ‌డ్డ‌లు తొల‌గిపోతాయి.

కొవ్వు గ‌డ్డ‌ల‌ను తొల‌గించే చిట్కా ఏమిటి.. దీనిని ఎఉలా త‌యారు చేసుకోవాలి.. ఎలా వాడాలి అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ చిట్కాను పాటించ‌డాననికి గానూ మ‌నం ప‌చ్చి ప‌సుపును ఉప‌యోగించాల్సి ఉంటుంది. ఈ ప‌సుపు మ‌న‌కు మార్కెట్ లో చాలా సుల‌భంగా లభిస్తుంది. అయితే ఇది అందుబాటులో లేని వారు ఆయుర్వేద షాపుల్లో ల‌భించే ప‌సుపును ఉప‌యోగించుకోవ‌చ్చు. కానీ వంట‌ల్లో వాడే ప‌సుపును మాత్రం ఉప‌యోగించ‌కూడ‌దు. ప‌చ్చి ప‌సుపును ఒక టీ స్పూన్ మోతాదులో ఒక గిన్నెలోకి తీసుకోవాలి. త‌రువాత ఇందులో 4 ల‌వంగాల‌ను మెత్తని పొడిగా చేసుకుని వేసుకోవాలి. అలాగే ఒక టీ స్పూన్ ఆవ నూనెను కూడా వేసి బాగా క‌ల‌పాలి. ఇలా తయారు చేసుకున్న మిశ్ర‌మాన్ని కొవ్వు గ‌డ్డ‌ల‌పై రాసి కాట‌న్ క్లాత్ తో క‌ట్టు క‌ట్టాలి.

Kovvu Gaddalu treatment in telugu how to do it
Kovvu Gaddalu

దీనిని రాత్రంతా అలాగే ఉంచి ఉద‌యాన్నే తొల‌గించి శుభ్రం చేసుకోవాలి. ఇలా క్ర‌మం త‌ప్పకుండా ప్ర‌తిరోజూ చేయ‌డం వల్ల చాలా సుల‌భంగా కొవ్వు గ‌డ్డ‌లు క‌రిగిపోతాయి. దీనిలో ఉప‌యోగించిన ప్ర‌తి ప‌దార్థంలో కూడా ఎన్నో ఔష‌ధ గుణాలు ఉన్నాయి. ఇవి గ‌డ్డ‌ల‌ను అలాగే గ‌డ్డ‌ల వ‌ల్ల క‌లిగే నొప్పుల‌ను, వాపుల‌ను త‌గ్గించ‌డంలో ఎంత‌గానో స‌హాయ‌ప‌డ‌తాయి. దీనితో పాటు గోరు వెచ్చ‌ని ఆవ నూనెను కొవ్వు గ‌డ్డ‌ల‌పై రాసి మ‌ర్ద‌నా చేయ‌డం వ‌ల్ల కూడా కొవ్వు గ‌డ్డ‌లు క‌రిగిపోతాయి. ఇలా ఈ చిట్కాల‌ను వాడ‌డం వ‌ల్ల చాలా సుల‌భంగా మ‌నం కొవ్వు గ‌డ్డ‌ల‌ను క‌రిగించుకోవ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు.

D

Recent Posts