వ్యాయామం

వ్యాయామం చేస్తున్నారా.. అయితే ఈ విష‌యాల‌ను మ‌రిచిపోవ‌ద్దు..

ఫిట్ నెస్ పై దృష్టి పెడితే అది చర్మానికి కూడా మేలు చేస్తుంది. మీరు ఫిట్ గా ఉంటే మీ చర్మం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఐతే ఫిట్ నెస్ మీద దృష్టి పెట్టి వర్కౌట్లు చేస్తున్నప్పుడు కొన్ని చర్మ సంరక్షణ చర్యలు తెలుసుకోవాలి. లేదంటే చర్మానికి వచ్చే ఇబ్బందులు ఎక్కువగానే ఉంటాయి. పొద్దున్న లేచి డైరెక్టుగా వర్కౌట్ చేయవద్దు. ముందుగా ముఖాన్ని సబ్బుతో శుభ్రపర్చుకోండి. జిడ్డు చర్మతో వర్కౌట్లు చేస్తే చర్మం పగులుతుంది. మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్లోషన్, లిప్ బామ్ లేకుండా వర్కౌట్లు మొదలుపెట్టవద్దు. ఒకవేళ ఇవేమీ పెట్టుకోకుండా చేస్తే చర్మం పగుళ్ళకి గురవుతుంది. పెదాలు ఎండిపోయి పేలవంగా తయారవుతాయి.

వ‌ర్క‌వుట్లు చేస్తున్న‌ప్పుడు మీ ముఖాన్ని ముట్టుకోవద్దు. వర్కౌట్ చేసే వస్తువులని ముట్టుకున్న తర్వాత మీ ముఖాన్ని ముట్టుకోకపోవడమే మంచిది. వర్కౌట్ సాధనాల మీద బాక్టీరియా ఉంటుంది. అది మీ చేతులకి అంటుకుని అవి ముఖాన్ని చేరి అనేక చర్మ సమస్యలని తీసుకువస్తాయి. చెమటని తుడిచేయాలి. చెమటని మీరు వేసుకున్న బట్టలకి తుడవడం అస్సలు మంచి పద్దతి కాదు. ఇలా చేస్తే దురద వంటి సమస్యలు వస్తాయి. అందుకే ఒక మృదువైన టవల్ ని మీతో పాటు ఉంచుకోవాలి.

if you are doing exercise do not forget to follow these

వర్కౌట్లు చేస్తున్నప్పుడు నీళ్ళు తాగడం చాలా మంచిది. శరీరంలోని నీరంతా ఆవిరవుతుంది కాబట్టి నీళ్ళు తాగుతూ ఉండాలి. వర్కౌట్లు చేసిన తర్వాత.. వర్కౌట్ చేసాక ముఖం కడుక్కోవడం మర్చిపోకండి. చెమట అంతా మీ బట్టలకి ఉండిపోతుంది కాబట్టి తొందరగా స్నానం చేయాలి. ఆ తర్వాత మాయిశ్చరైజర్ అప్లై చేసుకుటే బెటర్.

Admin

Recent Posts