Lemon And Ginger For Teeth : ఒక చిన్న చిట్కాను వాడడం వల్ల మనం మన దంతాలను తెల్లగా, మెరిసేలా మార్చుకోవచ్చని మీకు తెలుసా… మన ముఖం అందంగా కనిపించడంలో దంతాలు కూడా ముఖ్య పాత్ర పోషిస్తాయి. దంతాలు తెల్లగా ఉంటే మన ముఖం మరింత అందంగా కనిపిస్తుంది. కానీ మనలో చాలా మందికి దంతాలు గార పట్టి, పసుపు రంగులోకి మారిపోయి ఉంటాయి. దీని వల్ల వారు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు. పచ్చగా ఉండే దంతాల కారణంగా వారు అందరిలో సరిగ్గా నవ్వలేకపోతూ ఉంటారు. సరిగ్గా మాట్లాడలేకపోతూ ఉంటారు. దంతాలపై ఉండే గారను, పసుపుదనాన్ని తొలగించుకోవడానికి మార్కెట్ లో లభించే అన్ని రకాల టూత్ పేస్ట్ లను వాడుతూ ఉంటారు. కానీ ఎటువంటి ఫలితం లేక నిరుత్సాహానికి గురి అవుతూ ఉంటారు.
అలాంటి వారు ఈ చిన్న చిట్కాను వాడడం వల్ల 2 నిమిషాల్లోనే గార పట్టిన దంతాలను తెల్లగా మార్చుకోవచ్చు. ఈ చిట్కాను తయారు చేయడం చాలా సులభం. అలాగే దీనిని వాడడం కూడా చాలా సులభం. గార పట్టిన దంతాలను తెల్లగా మార్చే చిట్కా ఏమిటి… దీని కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ చిట్కాను తయారు చేసుకోవడానికి గానూ మనం అర చెక్క నిమ్మరసాన్ని, ఒక ఇంచు అల్లం తురుమును, కొద్దిగా ఉప్పును, అర టీ స్పూన్ నిమ్మతొక్క తురుమును ఉపయోగించాల్సి ఉంటుంది. ముందుగా అల్లంపై ఉండే పొట్టును తీసేసి తురుముకుని గిన్నెలో వేసుకోవాలి.
తరువాత నిమ్మరసాన్ని పిండి తొక్కను పారేయకుండా దానినే తురిమి వేసుకోవాలి. తరువాత ఉప్పు వేసి అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని బ్రష్ తో తీసుకుని దంతాలను శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల దంతాలపై ఉండే గార, పసుపుదనం తొలగిపోయి దంతాలు తెల్లగా మారతాయి. అలాగే దంతాల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. దంతాలు గార పట్టడం, దంతాలు పసుపు రంగులోకి మారడం వంటి సమస్యలతో బాధపడే వారు ఈ చిట్కాను వాడడం వల్ల మంచి ఫలితాన్ని పొందవచ్చు.