Lemon For Cracked Heels : నిమ్మ‌తొక్క‌ల‌తో ఇలా చేస్తే చాలు.. పాదాల ప‌గుళ్లు పోయి అందంగా మారుతాయి..!

Lemon For Cracked Heels : మ‌న‌లో చాలా మంది పాదాల ప‌గుళ్ల‌తో బాధ‌ప‌డుతూ ఉంటారు. పాదాల‌ప‌గుళ్ల వ‌ల్ల తీవ్ర‌మైన నొప్పి క‌లుగుతుంది. న‌డ‌వ‌డానికి కూడా బాధ‌ప‌డుతూ ఉంటారు. ముఖం అందంగా క‌న‌బ‌డ‌డానికి తీసుకున్న శ్ర‌ద్ద‌ను పాదాలపై చూపించ‌క‌పోవ‌డం వ‌ల్ల ఇలా జ‌రుగుతుంది. పాదాల‌ను శుభ్రం చేసుకోక‌పోవ‌డం వ‌ల్ల పాదాల‌పై మురికి, మృత‌క‌ణాలు పేరుకుపోయి క్ర‌మంగా అవి ప‌గుళ్ల‌కు దారి తీస్తాయి. అలాగే శ‌రీరంలో వేడి ఎక్కువ‌గా ఉండ‌డం, అధిక బ‌రువు, నీటిని త‌క్కువ‌గా తాగ‌డం వంటి వివిధ కార‌ణాల చేత పాదాల పగుళ్లు ఏర్ప‌డ‌తాయి. వీటిని నిర్ల‌క్ష్యం చేయ‌డం వ‌ల్ల ప‌గుళ్ల నుండి ర‌క్తం కారే అవ‌కాశం కూడా ఉంది. పాదాల ప‌గుళ్ల‌తో బాధ‌ప‌డే వారు మ‌న ఇంట్లో ఉండే ప‌దార్థాల‌తో చ‌క్క‌టి చిట్కాను త‌యారు చేసుకుని వాడ‌డం వ‌ల్ల పాదాల ప‌గుళ్ల‌ను చాలా సుల‌భంగా త‌గ్గించుకోవ‌చ్చు.

పాదాల ప‌గుళ్ల‌ను త‌గ్గించే ఈ చిట్కా ఏమిటి.. దీనిని త‌యారు చేసుకోవ‌డానికి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి..అలాగే ఈ చిట్కాను ఎలా వాడాలి…అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ చిట్కాను త‌యారు చేసుకోవ‌డానికి గానూ ముందుగా ఒక బంగాళాదుంపను తీసుకోవాలి. త‌రువాత దీనిపై ఉండే తొక్క‌ను తీసేసి ముక్క‌లుగా చేసి జార్ లో వేసుకోవాలి. త‌రువాత దీనిని మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకుని దాని నుండి ర‌సాన్ని తీసుకోవాలి. ఈ ర‌సంలో అర చెక్క నిమ్మ‌ర‌సాన్ని పిండి నిమ్మ‌తొక్క‌ను ప‌డేయ‌కుండా ప‌క్క‌కు ఉంచాలి. త‌రువాత ఇందులో మ‌నం వాడే టూత్ పేస్ట్ ను వేసి క‌ల‌పాలి. ఇలా త‌యారు చేసుకున్న మిశ్ర‌మాన్ని వాడే ముందు వేడి నీటిలో పాదాల‌ను ప‌ది నిమిషాల పాటు ఉంచాలి. త‌రువాత పాదాల‌ను నిమ్మ‌తొక్క‌తో బాగా రుద్దాలి.

Lemon For Cracked Heels know how to use it
Lemon For Cracked Heels

ఇలా చేయ‌డం వల్ల పాదాల‌పై ఉండే మురికి, మృత‌క‌ణాలు తొల‌గిపోతాయి. త‌రువాత ముందుగా త‌యారు చేసుకున్న మిశ్ర‌మాన్ని పాదాల‌కు రాసుకోవాలి. దీనిని పూర్తిగా ఆరే వ‌ర‌కు అలాగే ఉంచి ఆ త‌రువాత నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల పాదాల ప‌గుళ్లు త‌గ్గుతాయి. పాదాల‌కు ర‌క్త‌ప్ర‌స‌ర‌ణ మెరుగుప‌డుతుంది. పాదాల‌కు త‌గినంత తేమ ల‌భించి పాదాలు పొడిబార‌కుండా ఉంటాయి. ఈచిట్కాను వారానికి మూడు నుండి నాలుగు సార్లు పాటించ‌డం వ‌ల్ల పాదాల ప‌గుళ్లు క్ర‌మంగా త‌గ్గుతాయి. ఈ చిట్కాను పాటిస్తూనే నీటిని ఎక్కువ‌గా తాగాలి. శ‌రీరం డీహైడ్రేష‌న్ కు గురికాకుండా చూసుకోవాలి. ఈ విధంగా ఈ చిట్కాల‌ను పాటించ‌డం వ‌ల్ల మ‌నం చాలా సుల‌భంగా పాదాల ప‌గుళ్ల‌ను త‌గ్గించుకోవ‌చ్చు.

Share
D

Recent Posts