Mango Powder For Anemia : ఒక్క‌సారి ఇది తింటే చాలు.. 3 లీట‌ర్ల బ్ల‌డ్ అమాంతం పెరుగుతుంది..!

Mango Powder For Anemia : మ‌న‌ల్ని వేధించే అనారోగ్య స‌మ‌స్య‌ల్లో ర‌క్త‌హీన‌త స‌మ‌స్య కూడా ఒక‌టి. ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారు మ‌న‌లో చాలా మంది ఉంటారు. ఈ స‌మ‌స్య పురుషుల కంటే స్త్రీల‌ల్లో ఎక్కువ‌గా తలెత్తుతుంది. ర‌క్త‌హీన‌త స‌మ‌స్య‌ను ఏ మాత్రం నిర్ల‌క్ష్యం చేయ‌కూడదు. ర‌క్తహీన‌త స‌మ‌స్య ఉన్న వారిలో శ‌రీరం ఉబ్బినట్టుగా ఉంటుంది. అలాగే దీని కారణంగా నీర‌సం, నిస్స‌త్తువ‌, చ‌ర్మం పాలిపోవ‌డం, శ‌రీరం బ‌ల‌హీనప‌డ‌డం, జుట్టు రాల‌డం వంటి ఇత‌ర స‌మ‌స్య‌లు కూడా త‌లెత్తుతాయి. పోష‌కాలు క‌లిగిన ఆహారాన్ని తీసుకోక‌పోవ‌డ‌మే ఈ స‌మ‌స్య తలెత్త‌డానికి ప్ర‌ధాన కార‌ణం. అలాగే గాయాలు త‌గిలి ర‌క్త‌స్రావం ఎక్కువ‌గా జ‌రిగిన‌ప్పుడు కూడా ఈ స‌మ‌స్య త‌లెత్తుతుంది.

అదే విధంగా స్త్రీల‌ల్లో నెల‌స‌రి స‌మ‌యంలో త‌లెత్తే అధిక స్రావం కార‌ణంగా కూడా ర‌క్త‌హీన‌త వ‌స్తుంది. చాలా మంది ఈ స‌మ‌స్య నుండి బ‌య‌ట‌ప‌డ‌డానికి ఐర‌న్ టాబ్లెట్ల్ ల‌ను, సిర‌ప్ ల‌ను వాడుతూ ఉంటారు. వీటినే వాడే అవ‌స‌రం లేకుండా మ‌నం తీసుకునే ఆహారాల ద్వారా కూడా మ‌నం ర‌క్త‌హీన‌త స‌మ‌స్య నుండి బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు. మ‌న శ‌రీరంలో ర‌క్తం త‌యార‌వ్వాలంటే మ‌న‌కు ఐర‌న్ ఎక్కువ‌గా అవ‌స‌ర‌మ‌వుతుంది. పురుషుల‌కు రోజుకు 28 మిల్లీ గ్రాములు, స్త్రీలకు రోజుకు 30 మిల్లీ గ్రాముల ఐర‌న్ అవ‌స‌ర‌మ‌వుతుంది. ఐర‌న్ ఎక్కువ‌గా ఉండే ఆహారాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం చాలా సుల‌భంగా ఈ స‌మ‌స్య నుండి బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు. ఐర‌న్ ఎక్కువ‌గా ఉండే ప‌దార్థాల్లో మామిడి కాయ పొడి కూడా ఒక‌టి.

Mango Powder For Anemia take daily for good result
Mango Powder For Anemia

ఆకుకూర‌ల్లో కంటే మామిడికాయ పొడిలో ఐర‌న్ ఎక్కువ‌గా ఉంటుంది. దీనిని వంటల్లో చింత‌పండుకు బ‌దులుగా వాడుకోవ‌డం వ‌ల్ల మ‌నం రుచితో పాటు ర‌క్త‌హీన‌త స‌మ‌స్య నుండి కూడా చాలా సుల‌భంగా బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు. ఈ పొడిని ప‌చ్చ‌ళ్ల‌ల్లో, కూర‌లల్లో వాడుకోవ‌చ్చు. అలాగే ఈ పొడిలో నీటిని క‌లిపి చింత‌పండు పులుసుగా కూడా వాడుకోవ‌చ్చు. మామిడికాయ పొడితో పాటు ఆకుకూర‌లు, ప‌ప్పు దినుసులు, ఖ‌ర్జూరాలు, డ్రై ఆఫ్రికాట్, ఎండు ద్రాక్ష‌, ఎండు కొబ్బ‌రి, గుమ్మ‌డి గింజ‌లు, అంజీరాలు వంటి వాటిని ఎక్కువ‌గా తీసుకోవాలి. ఈ ఆహారాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం చాలా సుల‌భంగా ర‌క్త‌హీన‌త స‌మ‌స్య నుండి బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు.

D

Recent Posts