Maredu Leaves For Sugar : చిన్నా పెద్దా అనే తేడా లేకుండా మనందరిని వేధిస్తున్న దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల్లో షుగర్ వ్యాధి ఒకటి. ఈ వ్యాధితో బాధపడే వారి సంఖ్య రోజురోజుకూ ఎక్కువవుతుందనే చెప్పవచ్చు. మారిన మన జీవన విధానం, మన ఆహారపు అలవాట్లే ఈ సమస్య తలెత్తడానికి ప్రధాన కారణమని చెప్పవచ్చు. షుగర్ వ్యాధి బారిన పడిన వారు జీవితాంతం మందులు మింగాల్సిన పరిస్థితి నెలకొంది. మన జీవన విధానాన్ని, ఆహారపు అలవాట్లను మార్చుకోవడం వల్ల ఈ మందుల మోతాదును మనం తగ్గించుకోవచ్చు. ఎంత ప్రయత్నించినప్పటికి కొందరిలో షుగర్ వ్యాధి నియంత్రణలోకి రాదు. కొన్ని రకాల చిట్కాలను పాటించడం వల్ల మనం ఎటువంటి దుష్ప్రభావాల బారిన పడకుండా షుగర్ వ్యాధిని నియంత్రించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. షుగర్ వ్యాధితో బాధపడే వారు ప్రతిరోజూ వ్యాయామం చేయాలి.
అలాగే తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఎక్కువగా కొర్రలు, సామలు, అండు కొర్రలు, అరికెలు, ఊదలు వంటి చిరు ధాన్యాలను ఆహారంగా తీసుకోవాలి. వీటిని కనీసం 10 నుండి 12 గంటల పాటు నానబెట్టి తరువాత వండుకుని తినాలి. షుగర్ వ్యాధి గ్రస్తులకు, ఊబకాయంతో బాధపడే వారికి, రక్తపోటు సమస్యలతో బాధపడే వారికి ఈ చిరు ధాన్యాలు అమృతతుల్యంగా పని చేస్తాయి. అలాగే బియ్యం, గోధుమలు, బెల్లం, చక్కెరతో తయారు చేసిన పదార్థాలకు దూరంగా ఉండాలి. అలాగే 7 లేదా 8 మారేడు ఆకులను నీటిలో వేసి 10 నుండి 15 నిమిషాల పాటు మరిగించాలి. తరువాత ఈ నీటిని వడకట్టి గోరు వెచ్చగా అయిన తరువా 50 ఎమ్ ఎల్ మోతాదులో తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల షుగర్ వ్యాధి నియంత్రణలోకి వస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఇలా మారేడు ఆకులతో చేసిన కషాయాన్ని తీసుకోవడం వల్ల వాత, కఫ, పిత దోషాలన్నీ తొలగిపోతాయి. ఇతర అనారోగ్య సమస్యలు కూడా రాకుండా ఉంటాయి.
మారేడు ఆకులు అందుబాటులో లేని వారు ఒకేసారి ఎక్కువ మొత్తంలో మారేడు ఆకులు, బెరడు, కాండం వంటి వాటిని నీడలో ఎండబెట్టి పొడిగా చేసుకుని నిల్వ చేసుకోవాలి. ఈ పొడిని రోజుకు రెండు పూటలా పూటకు 5 గ్రాముల మోతాదులో గోరు వెచ్చని నీటిలో కలిపి తాగడం వల్ల కూడా మనం మంచి ఫలితాలను పొందవచ్చు. అదే విధంగా రామ తులసి ఆకులను ఉపయోగించడం వల్ల కూడా షుగర్ వ్యాధిని నియంత్రణలో ఉంచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. రెండు లేదా మూడు రామ తులసి ఆకుల మిశ్రమానికి ఒక టీ స్పూన్ తేనెను కలిపి తీసుకోవడం వల్ల కూడా షుగర్ వ్యాధి నియంత్రణలో ఉంటుంది. ఇన్సులిన్ ఇంజెక్షన్ లు తీసుకునే వారు కూడా ఈ రామ తులసి ఆకులను తీసుకోవడం వల్ల షుగర్ వ్యాధి నియంత్రణలోకి వస్తుందని వస్తుందని నిపుణులు చెబుతున్నారు.
అలాగే 10 గ్రాముల దాల్చిన చెక్కను ఒక గ్లాస్ నీటిలో వేసి బాగా మరిగించాలి. తరువాత ఈ కషాయాన్ని వడకట్టి రోజుకు రెండు పూటలా టీ లాగా తాగడం వల్ల షుగర్ వ్యాధి గ్రస్తులు మంచి ఫలితాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఒక టీ స్పూన్ మెంతులను అర గ్లాస్ నీటిలో పోసి 12 గంటల పాటు నానబెట్టాలి. తరువాత ఈ నీటిని తాగి మెంతులను తినాలి. ఇలా చేయడం వల్ల కూడా షుగర్ వ్యాధి అదుపులోకి వస్తుంది. ఈ చిట్కాలను పాటించడం వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా చాలా సులభంగా షుగర్ ను నియంత్రించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అలాగే వీటిని పాటించడం వల్ల షుగర్ వ్యాధి తగ్గడంతో పాటు భవిష్యత్తులో కూడా రాకుండా ఉంటుందని అలాగే ఇతర అనేక ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.