Mucus In Throat : ప్రస్తుత కాలంలో మనం దంతాలను శుభ్రం చేసుకోవడానికి గానూ బ్రష్ లను, టూత్ పేస్ట్ లను ఉపయోగిస్తున్నాము. ఎన్ని రకాల టూత్ పేస్ట్ లను వాడినప్పటికి మనలో చాలా మంది దంతాల సమస్యతో బాధపడుతున్నారు. కానీ పూర్వకాలంలో దంతాలను శుభ్రం చేసుకోవడానికి గానూ మనం వేప పుల్లలను ఉపయోగించే వాళ్లం. చిన్న పెద్దా అనే తేడా లేకుండా పూర్వకాలంలో వేప పుల్లలనే ఉపయోగించేవారు. అందుకే వారు ఎలాంటి దంత సమస్యలు లేకుండా ఉండే వారని నిపుణులు చెబుతున్నారు. వేప పుల్లలను వాడడం వల్ల నోటి ఆరోగ్యం మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు. టూత్ పేస్ట్ లు, బ్రష్ ల కంటే వేప పుల్లలే ఎంతో మేలైనవని నిపుణులు చెబుతున్నారు. వేప పుల్లలను వాడడం వల్ల నోట్లో ఉండే బ్యాక్టీరియా, దంతా మధ్యలో ఉండే బ్యాక్టీరియా పూర్తిగా నశిస్తుంది.
వేప పుల్లతో దంతాలను శుభ్రం చేసుకోవడం వల్ల నోట్లో లాలాజలం ఎక్కువగా తయారవుతుంది. నోరు తాజాగా తయారవుతుంది. చిగుళ్లపై ఉండే బ్యాక్టీరియాను, దంతాలపై ఉండే గారను తొలగించడంలో, ఇన్పెక్షన్ కు కారణమయ్యే బ్యాక్టీరియాను తొలగించడంలో వేప పుల్ల మనకు ఎంతో సహాయపడుతుంది. టూత్ పేస్ట్ లలో బ్యాక్టీరియాను చంపే గుణం ఎక్కువగా ఉండదు. కానీ వేప పుల్లను వాడడం వల్ల నోట్లో ఉండే బ్యాక్టీరియా పూర్తిగా నశిస్తుంది. దీంతో దంతాల సమస్యలు రాకుండా ఉంటాయి. అలాగే వేప పుల్లను వాడడం వల్ల గొంతు భాగంలో, ముక్కు భాగంలో పేరుకుపోయిన కఫం, తెమడ, శ్లేష్మాలు కూడా సులభంగా తొలగిపోతాయి. వేపలో ఉండే చేదు కారణంగా కఫం, తెమడ వంటివి త్వరగా తెగి లాలాజలం ద్వారా సులభంగా బయటకు వస్తాయి. వేప పుల్లతో శుభ్రం చేసుకోవడం వల్ల నోటితో పాటు గొంతు కూడా పూర్తిగా శుద్ది అవుతుంది.
టూత్ పేస్ట్ లను వాడినప్పటికి రాని తాజాదనం వేప పుల్లను వాడడం వల్ల వస్తుందని నిపుణులు చెబుతున్నారు. అయితే నేటి తరుణంలో టూత్ పేస్ట్ లను వాడడం అలవాటైపోయింది. అలాంటి వారు వేప పుల్లను వాడడం కష్టంగా భావిస్తారు. రోజూ వేప పుల్లతో శుభ్రం చేసుకోవడం వారికి కష్టంగా ఉంటుంది. అలాంటి వారు వారంలో రెండు నుండి మూడు రోజులు వేప పుల్లతో శుభ్రం చేసుకోవాలి. మిగిలిన రోజులు టూత్ పేస్ట్ తో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల దంతాలు, చిగుళ్లు శుభ్రంగా తయారవుతాయి. నోటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలాగే గొంతులో ఇన్పెక్షన్, గొంతు నొప్పి, కఫం, తెమడ వంటి సమస్యలు కూడా తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు.