Mucus : ప్రస్తుత కాలంలో చాలా మంది దగ్గు, జలుబు వంటి సమస్యలతో పాటు ఊపిరితిత్తుల్లో కఫం పేరుకుపోయి కూడా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా పిల్లలు ఈ సమస్యల బారిన ఎక్కువగా పడుతున్నారు. ఈ సమస్యల బారిన పడగానే చాలా మంది వైద్యులను సంప్రదించి మందులను వాడుతుంటారు. వీటిని వాడడం వల్ల సమస్యల నుండి ఉపశమనం కలిగినప్పటికి ఊపిరితిత్తుల్లో, శ్వాస నాళాల్లో పేరుకుపోయిన కఫం మాత్రం పూర్తిగా తొలగిపోదు. ఒక చిన్న చిట్కాను ఉపయోగించి దగ్గు, జలుబు వంటి శ్వాస సంబంధిత సమస్యల నుండి బయటపడడంతో పాటు ఊపిరితిత్తుల్లో పేరుకుపోయిన కఫమంతా తొలగిపోతుంది. ఊపిరితిత్తుల్లో పేరుకుపోయిన కఫాన్ని తొలగించే ఈ చిట్కాను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ చిట్కాను తయారు చేసుకోవడానికి గానూ ముఖ్యంగా మనం రెండు చిన్న ఎర్ర ఉల్లిపాయలను అలాగే ఒక ఇంచు అల్లం ముక్కను ఉపయోగించాల్సి ఉంటుంది.
తరువాత వీటిని విడివిడిగా పేస్ట్ లాగా చేసి నీరు కలపకుండా వాటి నుండి రసాన్ని తీసుకోవాలి. తరువాత వీటిని కలిపి ఒకే గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఈ మిశ్రమంలో ఒక టీ స్పూన్ తులసి ఆకుల రసాన్ని వేసి కలపాలి. తరువాత ఇందులో ఒక చిటికెడు పసుపును వేసి కలపాలి. తరువాత ఇందులో పావు టీ స్పూన్ మిరియాల పొడిని, ఒక టీ స్పూన్ తేనెను వేసి కలపాలి. ఉల్లిపాయలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఊపిరితిత్తుల్లో పేరుకుపోయిన కఫాన్ని తొలగించడంలో, గొంతులో మంటను తగ్గించడంలో ఉల్లిపాయ మనకు దోహదపడుతుంది. అలాగే ఈ ఉల్లిపాయల్లో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ ప్లామేటరీ లక్షణాలు కూడా అధికంగా ఉంటాయి. ఇవి దగ్గు, జలుబు వంటి వాటితో పాటు ఇతర వైరల్ ఇన్ఫెక్షన్ లు కూడా మన దరి చేరకుండా చేస్తాయి. ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అదే విధంగా అల్లం కూడా శ్వాస నాళాల్లో మరియు ఊపిరితిత్తుల్లో పేరుకుపోయిన కఫాన్నితొలగించి శ్వాసక్రియ సాఫీగా సాగేలా చేయడంలో మనకు ఎంతో సహాయపడుతుంది.
అలాగే దీనిలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు మనల్ని ఇన్ ఫెక్షన్ ల బారిన పడకుండా చేయడంలో దోహదపడతాయి. తులసి ఆకుల రసం దగ్గు, జలుబు, ఆస్థమా వంటి వాటితో పాటు ఇతర శ్వాస సంబంధిత సమస్యలన్నింటిని తగ్గించే దివ్యౌషధంగా పని చేస్తుంది. శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడంలో కూడా తులసి ఆకుల రసం మనకు దోహదపడుతుంది. అలాగే పసుపు సహజసిద్ద యాంటీ బయాటిక్ గా పని చేస్తుంది. దగ్గు, జలుబు, కఫం వంటి వాటిని తొలగించడంలో పసుపు మనకు ఎంతో ఉపయోగపడుతుంది. అదేవిధంగా మిరియాల్లో ఉండే ఔషధ గుణాలు గొంతులో పేరుకుపోయిన కఫాన్ని తొలగించడంలో అలాగే శరీరంలో రోగ నిరోధక శక్తిని పెండచంలో తోడ్పడతాయి. దగ్గును తగ్గించడంలో, శ్వాస మార్గంలో పేరుకుపోయిన కఫాన్ని కరిగించడంలో తేనె మనకు చక్కటి ఔషధంలా పని చేస్తుంది.
తేనెలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ ప్లామేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి వైరస్, బ్యాక్టీరియాల వల్ల కలిగే ఇన్పెక్షన్ లను తగ్గించడంలో ఉపయోగపడుతుంది. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని పిల్లల నుండి పెద్దల వరకు ఎవరైనా ఉపయోగించవచ్చు. ఈ మిశ్రమాన్ని రోజుకు రెండు పూటలా పూటకు అర టీ స్పూన్ మోతాదులో పిల్లలకు ఇవ్వాలి. ఇది ఘాటుగా ఉంటుంది కనుక పిల్లలకు గోరు వెచ్చని పాలల్లో కలిపి దీనిని ఇవ్వవచ్చు. ఇక పెద్దలు పూటకు ఒక టీ స్పూన్ మోతాదులో మూడు పూటలా తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల దగ్గు, జలుబు వంటి సమస్యలు తగ్గడంతో పాటు శ్వాస నాళాలు, గొంతు, ఊపిరితిత్తుల్లో పేరుకుపోయిన కఫం అంతా తొలగిపోతుంది.