పులిపిర్లు శాశ్వ‌తంగా తొల‌గిపోవాలంటే.. ఈ చిట్కాల‌ను పాటించాలి..

మ‌న‌లో చాలా మంది చ‌ర్మంపై పులిపిర్ల‌ను క‌లిగి ఉంటారు. వంద మందిలో 10 నుండి 15 మంది పులిపిర్ల‌ను క‌లిగి ఉంటారు. చ‌ర్మంపై పులిపిర్లు ఉండ‌డ‌మ‌నేది చాలా సాధార‌ణ‌మైన స‌మ‌స్య‌. వీటిని ఆంగ్లంలో వార్ట్స్‌ అని అంటారు. హ్యూమ‌న్ పాపిలోమా వైర‌స్ అనే వైర‌స్ కార‌ణంగా మ‌న చ‌ర్మంపై పులిపిర్లు వ‌స్తాయి. పులిపిర్ల స‌మ‌స్యను పురుషుల్లో కంటే స్త్రీలలో మ‌నం ఎక్కువ‌గా చూడ‌వ‌చ్చు. పులిపిర్లు చ‌ర్మ రంగులో లేదా గోధుమ రంగులో బొడిపెల మాదిరిగా ఉంటాయి. పులిపిర్లు వ‌ల్ల మ‌న‌కు ఎటువంటి నొప్పి క‌ల‌గ‌దు. ఇవి ఎక్కువ‌గా ముఖం, చేతులు, కాళ్లు, మెడ భాగాల్లో ఎక్కువ‌గా వ‌స్తూ ఉంటాయి.

పులిపిర్ల వ‌ల్ల ఎటువంటి హాని క‌ల‌గ‌న‌ప్ప‌టికి చూడ‌డానికి ఇవి అంద‌వికారంగా ఉంటాయి. వీటిని తొల‌గించుకోవ‌డానికి గాను చాలా మంది గిల్ల‌డం, బ్లేడుతో కోయ‌డం వంటివి చేస్తూ ఉంటారు. అలాగే కొంద‌రు పులిపిర్ల‌ను తొల‌గించే క్రీముల‌ను వాడుతూ ఉంటారు. అయితే ఇంటి చిట్కాల ద్వారా కూడా మ‌నం ఈ పులిపిర్ల‌ను తొల‌గించుకోవ‌చ్చు. స‌హ‌జసిద్ధంగా పులిపిర్ల‌ను తొల‌గించే చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

natural home remedies for pulipirlu

ఇందుకోసం ముందుగా ఒక గిన్నెలో ఒక అర టీ స్పూన్ తెల్ల‌గా ఉండే టూత్ పేస్ట్ ను తీసుకోవాలి. త‌రువాత ఇందులోనే ఒక టీ స్పూన్ ఆముదం నూనెను, అర టీ స్పూన్ వంట‌సోడాను వేసి బాగా క‌ల‌పాలి. ఈ మిశ్ర‌మాన్ని రాత్రి ప‌డుకునే ముందు పులిపిర్ల మీద రాసుకోవాలి. ఇలా రోజూ చేస్తూ ఉండ‌డం వ‌ల్ల చిన్న ప‌రిమాణంలో ఉండే పులిపిర్లు 3 నుండి 7 రోజుల వ్య‌వ‌ధిలోనే రాలిపోతాయి. పెద్ద ప‌రిమాణంలో ఉండే పులిపిర్లు 3 వారాల వ్య‌వ‌ధిలో రాలిపోతాయి.

ఈ చిట్కాను క్ర‌మం త‌ప్ప‌కుండా ప్ర‌తిరోజూ వాడ‌డం వ‌ల్ల ఎటువంటి దుష్ప్ర‌భావాలు లేకుండానే పులిపిర్లు వాటంత‌ట అవే రాలిపోతాయి. సున్నితమైన చ‌ర్మం ఉన్న వారు మాత్రం ఈ చిట్కాను పాటించ‌డం వ‌ల్ల చ‌ర్మంపై సూది గుచ్చిన‌ట్టుగా భావ‌న క‌లుగుతుంది. క‌నుక వారు ఈ చిట్కాను పాటించ‌క‌పోడ‌మే మంచిది.
అదే విధంగా పులిపిర్ల‌ను తొల‌గించే మ‌రో చిట్కా గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఇందుకోసం మ‌నం త‌మ‌ల‌పాకును, త‌డి సున్నాన్ని ఉప‌యోగించాల్సి ఉంటుంది. తాజా త‌మ‌ల‌పాకును కాడ‌తో స‌హా తీసుకోవాలి. త‌రువాత కాడ‌ను ఆకు నుండి వేరు చేయాలి. ఇలా వేరు చేసిన కాడ‌తో త‌డి సున్నాన్ని తీసుకుని పులిపిర్ల మీద రాసి అదే కాడ‌తో వాటిపై 3 నిమిషాల పాటు మ‌ర్ద‌నా చేయాలి. ఇలా క్ర‌మం త‌ప్ప‌కుండా చేయ‌డం వ‌ల్ల మూడు నుండి నాలుగు రోజుల్లోనే పులిపిర్లు రాలిపోతాయి. ఈ చిట్కాల‌ను పాటించ‌డం వ‌ల్ల నొప్పి లేకుండా చాలా సులువుగా మ‌నం పులిపిర్ల‌ను తొల‌గించుకోవ‌చ్చు.

Share
D

Recent Posts