Rock Salt : ప్రస్తుతకాలంలో ప్రతి ఒక్కరు వయస్సుతో తేడా లేకుండా 30 దాటిందంటే చాలు.. అనేక అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. చెడు ఆహారపు అలవాట్లు, అస్థవ్యస్థమైన జీవనశైలి కారణంగా ఆడ, మగ తేడాలేకుండా రోజు రోజుకీ అనేక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. జనాలు ఉన్న శారీరక సమస్యలు చాలవన్నట్లు కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు వంటి సమస్యలతో సతమతమవుతున్నారు. మరి ఇలాంటి సమస్య నుంచి బయట పడాలంటే ప్రకృతి మనకు ఎన్నో అద్భుతమైన ఔషధాలను అందించింది. ఇలా ప్రకృతి అందించిన ఔషధాలలో సైంధవ లవణం కూడా ఒకటి.
మన దేశంలో ప్రజలు ఎక్కువగా ఉపయోగించే పదార్థాలలో సైంధవ లవణం ఒకటి. దీనినే మనం రాక్ సాల్ట్ లేదా హిమాలయన్ సాల్ట్ అని కూడా పిలుస్తారు. ఈ రాక్ సాల్ట్ హిమాలయాల నుండి లభిస్తుంది. సాధారణ ఉప్పు కంటే సైంధవ లవణం ఎంతో శ్రేష్టమైనదని నిపుణులు వెల్లడిస్తున్నారు. ఇది ఎన్నో రకాల వ్యాధులను నయం చేయడానికి ఉపయోగపడుతుంది. కీళ్ల నొప్పులు, కీళ్ల వాపులు, నడుము నొప్పి వంటి సమస్యలతో చాలా మంది నిత్యం బాధపడుతూ ఉంటారు. ఇలా కీళ్లనొప్పుల సమస్యతో బాధపడేవారికి సైంధవ లవణం చాలా బాగా ఉపయోగపడుతుంది. సాధారణ ఉప్పుకు బదులు సైంధవ లవణం ఉపయోగించుకుంటే చాలా మేలు చేస్తుంది.
సైంధవ లవణాన్ని నిత్యం ఆహారంలో తీసుకోవడం ద్వారా శరీరంలో వాత, పిత్త, కఫ దోషాలు మూడు సమానంగా ఉంటాయి. దీనిలో కాల్షియం, పొటాషియం పుష్కలంగా ఉండటం వలన గుండె సంబంధిత వ్యాధులు మరియు కంటి సమస్యల నుంచి రక్షిస్తుంది. అంతేకాక ఈ రాతి ఉప్పు శరీరానికి అధిక ఉష్ణోగ్రతను అదుపుచేయడంలో సహాయపడుతుంది. సైంధవ లవణాన్ని రోజూ తీసుకోవటం వలన రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అంతే కాకుండా నిద్రలేమి సమస్యతో బాధపడే వారికి మంచి నిద్ర పట్టే విధంగా తోడ్పడుతుంది.
కీళ్లనొప్పుల సమస్యతో బాధపడేవారికి సైంధవ లవణం మంచి ఉపశమనం కలిగిస్తుంది. కీళ్ల నొప్పులతో బాధపడేవారు నువ్వుల నూనెను శరీరానికి రాసుకొని సైంధవ లవణంతో కాపడం పెట్టుకోవడం ద్వారా కీళ్లనొప్పుల సమస్యలు తగ్గుముఖం పడతాయి. అదేవిధంగా అజీర్తి సమస్యతో బాధపడేవారు తులసి ఆకుల రసంలో శొంఠి, పసుపు, సైంధవలవణం కలిపి తీసుకుంటే ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. నెలసరి సమస్యలతో బాధపడే మహిళలు వాము మరియు సైంధవ లవణం కలిపి తీసుకుంటే పీరియడ్స్ రెగ్యులర్ గా వస్తాయి. అంతే కాకుండా ఎండు ద్రాక్షను నేతిలో ముంచి సైంధవ లవణంతో కలిపి తింటే జ్ఞాపకశక్తి కూడా మెరుగవుతుంది. ఇలా దీంతో అనేక లాభాలను పొందవచ్చు.