Kidney Stones : ఈ నీళ్ల‌ను రోజూ తాగితే.. కిడ్నీ స్టోన్లు అవే క‌రిగిపోతాయి..!

Kidney Stones : ప్ర‌స్తుత కాలంలో మ‌న‌లో చాలా మంది మూత్ర‌పిండాల్లో రాళ్ల స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. వ‌య‌సుతో సంబంధం లేకుండా నేటి త‌రుణంలో ఈ స‌మ‌స్య బారిన ప‌డే వారు ఎక్కువ‌వుతున్నారు. శారీర‌క శ్ర‌మ ఎక్కువ‌గా ఉండ‌డం, రోజుకు త‌గిన్ని నీళ్లు తాగ‌క‌పోవ‌డం, స్థూల‌కాయం, గైట్ ర‌క‌పు కీళ్ల‌ వ్యాధి, వంశ‌పార‌ప‌ర్యం, మ‌ద్య‌పానం, ధూమ‌పానం వంటి వాటిని ఈ స‌మ‌స్య త‌లెత్త‌డానికి ప్ర‌ధాన కార‌ణాలుగా చెప్ప‌వ‌చ్చు. కొంద‌రికి మూత్ర‌పిండాల్లో రాళ్లు ఉన్న‌ట్టే తెలియ‌దు. అవి పెద్ద‌గా అయ్యి ల‌క్ష‌ణాల‌ను బ‌హిర్గ‌తం చేసిన‌ప్పుడే మూత్ర‌పిండాల్లో రాళ్లు ఉన్న‌ట్టు చాలా మందికి తెలుస్తుంది. మూత్ర‌పిండాల్లో రాళ్లు ఉన్న‌ప్పుడు వెన్న‌ముక‌కు ఇరువైపులా అలాగే పొత్తి క‌డుపులో కూడా నొప్పి వ‌స్తుంది. మూత్ర‌విస‌ర్జ‌న త‌ర‌చూ చేయ‌డం, మూత్రం కొద్ది ప‌రిమాణంలో రావ‌డం, మూత్రంలో మంట‌, ఆక‌లి లేక‌పోవ‌డం, క‌డుపులో నొప్పి, వాంతులు వంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి. మూత్ర‌పిండాల్లో ఏర్ప‌డే రాళ్ల‌కు స‌రైన చికిత్స తీసుకోక‌పోతే మూత్ర‌పిండాల వ్యాధులు తలెత్తి వాటి ప‌నితీరు రోజురోజుకూ త‌గ్గిపోతూ ఉంటుంది.

ఆరోగ్యం మ‌రింత దిగ‌జారిపోతుంది. ఈ స‌మ‌స్య‌ను నిర్ల‌క్ష్యం చేయ‌కుండా త‌గిన చికిత్స తీసుకోవ‌డం చాలా అవ‌స‌రం. మూత్ర‌పిండాల్లో రాళ్ల స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారు ఆకుకూర‌ల‌ను, ట‌మాటాల‌ను, స‌ముద్ర‌పు ఆహారాన్ని ఎక్కువ‌గా తీసుకోకూడ‌దు. అలాగే టీ, కాఫీల‌కు దూరంగా ఉండాలి. ఉప్పును ఎక్కువ‌గా తీసుకోకూడ‌దు. అలాగే ప్యాకేజ్డ్ ఫుడ్ ను, చాకొలెట్స్ ను కూడా తిన‌కూడ‌దు. అలాగే ఆక్స్ లేట్స్ ఎక్కువ‌గా ఉండే ఆహారాల‌ను తీసుకోకూడ‌దు. మూత్ర‌పిండాల్లో పెద్ద ప‌రిమాణంలో ఉండే రాళ్ల‌ను శ‌స్త్ర‌చికిత్స‌ల ద్వారా తొల‌గించాల్సి వ‌స్తుంది. ఈ స‌మ్య‌తో బాధ‌ప‌డే వారు ఎక్కువ‌గా నీటిని తీసుకోవాలి. ఆల్కాహాల్, ధూమపానం వంటివి చేయ‌కూడ‌దు. నీటి ప‌రిమాణం ఎక్కువ‌గా ఉండే పండ్ల‌ను తీసుకోవాలి. అలాగే విట‌మిన్ ఎ ఎక్కువ‌గా ఉండే ఆహారాల‌ను తీసుకోవాలి. అలాగే రోజుకు 300 మిల్లీ గ్రాముల కంటే ఎక్కువ‌గా విట‌మిన్ సి ని తీసుకోకూడ‌దు. వీటితో పాటు మూత్ర‌పిండాల్లో రాళ్ల స‌మ‌స్య నుండి బ‌య‌ట‌ప‌డేసే ఇంటి చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

take olive oil and lemon in this way for Kidney Stones
Kidney Stones

దీనిని త‌యారు చేసుకోవడానికి మ‌నం నిమ్మ‌రసాన్ని, ఆలివ్ నూనెను ఉప‌యోగించాల్సి ఉంటుంది. ఒక గిన్నెలో ఒక టీ స్పూన్ ఆలివ్ నూనెను, ఒక టీ స్పూన్ నిమ్మ‌ర‌సాన్ని వేసి బాగా క‌ల‌పాలి. ఈ మిశ్ర‌మాన్ని రోజూ తీసుకోవాలి. అలాగే దీనిని తీసుకున్న త‌రువాత ఒక గ్లాస్ నీటిని తాగాలి. ఈ చిట్కాను పాటించ‌డం వ‌ల్ల మూత్ర‌పిండాల్లో రాళ్ల వ‌ల్ల క‌లిగే నొప్పి త‌గ్గ‌డంతో పాటు స‌మ‌స్య కూడా త‌గ్గు ముఖం ప‌డుతుంది. అలాగే ముల్లంగి ఆకుల ర‌సాన్ని రోజుకు రెండు పూట‌లా అర గ్లాస్ మోతాదులో తీసుకోవ‌డం వ‌ల్ల కూడా మంచి ఫ‌లితం ఉంటుంది. ఈచిట్కాల‌ను పాటిస్తూ ఆహారం విష‌యంలో త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డం వ‌ల్ల మూత్ర‌పిండాల్లో రాళ్ల స‌మ‌స్య నుండి చాలా సుల‌భంగా బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు.

D

Recent Posts