Over Weight : అధిక బరువు తగ్గడం కష్టంగా ఉన్నవారు ఇలా చేస్తే చాలు.. బరువు ఇట్టే తగ్గిపోతారు..!

Over Weight : అధిక బరువు సమస్య ప్రస్తుతం చాలా మందిని ఇబ్బందులకు గురి చేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఏటా అధిక శాతం మంది ఊబకాయం బారిన పడుతున్నారు. అందుకు అనేక కారణాలు ఉంటున్నాయి. అయితే అధిక బరువు సమస్య ఉన్నవారు రోజూ వ్యాయామం చేయడంతోపాటు పలు ఆహారాలను తీసుకోవాలి. దీంతో బరువు తగ్గడం తేలికవుతుంది. ఈ క్రమంలోనే కింద తెలిపిన పదార్థాలను రోజువారీ ఆహారాల్లో చేర్చుకోవడం వల్ల అధిక బరువును వేగంగా తగ్గించుకోవచ్చు. మరి ఆ పదార్థాలు ఏమిటంటే..

take these foods daily to reduce Over Weight

1. అవిసె గింజలను రోజూ గుప్పెడు మోతాదులో తింటుండాలి. దీంతో వాటిలో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు అధిక బరువును తగ్గించేందుకు సహాయ పడతాయి. ఈ గింజలను నేరుగా తినలేకపోతే పొడి చేసుకుని తినే ఆహారాల్లో కలిపి తినవచ్చు. దీంతో బరువు తగ్గడం తేలికవుతుంది.

2. మన శరీరానికి గ్రీన్‌ టీ ఎంతగానో మేలు చేస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. దీంతో శరీర మెటబాలిజం పెరుగుతుంది. క్యాలరీలు వేగంగా ఖర్చవుతాయి. అధిక బరువు త్వరగా తగ్గుతారు. రోజూ రెండు కప్పుల గ్రీన్‌ టీని తాగడం ఉత్తమం.

3. దాల్చిన చెక్కను మసాలా దినుసుగా పరిగణిస్తారు. కానీ దీన్ని నిజానికి రోజూ తీసుకోవాలి. బ్లడ్‌ షుగర్‌ లెవల్స్‌ను ఇది తగ్గిస్తుంది. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ కరిగిపోతుంది. దాల్చిన చెక్కను పొడి చేసి రోజూ ఉదయం, సాయంత్రం అర టీస్పూన్‌ మోతాదులో తీసుకుంటుంటే అధిక బరువును త్వరగా తగ్గించుకోవచ్చు.

4. నిత్యం మనం వంట ఇంటి దినుసుగా ఉపయోగించే మిరియాలు బరువును తగ్గించేందుకు ఎంతగానో ఉపయోగపడతాయి. మిరియాలను రోజూ ఒక టీస్పూన్‌ పొడి రూపంలో ఒక టీస్పూన్‌ తేనెతో కలిపి రోజూ ఉదయం, సాయంత్రం తీసుకుంటే బరువును తగ్గించుకోవచ్చు. లేదా పాలలో కలిపి రాత్రి పూట తాగవచ్చు. దీంతో కొవ్వు కరిగి బరువు తగ్గుతారు.

5. పసుపులో యాంటీ బయోటిక్‌ లక్షణాలు ఉంటాయి. దీంతో శరీర మెటబాలిజం పెరుగుతుంది. రోగ నిరోధక శక్తి రెట్టింపవుతుంది. అధిక బరువు త్వరగా తగ్గుతారు. పసుపును రాత్రి పూట పాలలో కలుపుకుని తాగితే మంచిది.

Admin

Recent Posts