Sleep : అధిక ఒత్తిడి, పనిభారం, ఆందోళన, మానసిక సమస్యలు.. వంటి అనేక కారణాల వల్ల చాలా మంది ప్రస్తుతం నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. బెడ్ మీద పడుకున్నాక చాలా సేపటికి నిద్ర పోతున్నారు. ఆలస్యంగా నిద్రించడం వల్ల ఇతర అనారోగ్య సమస్యలు కూడా వస్తున్నాయి. కనుక నిద్రలేమి సమస్య నుంచి బయట పడాల్సిన ఆవశ్యకత ఏర్పడింది.
అయితే నిద్రలేమి సమస్య ఉన్నవారు ఒక చిన్న సులభమైన చిట్కాను పాటిస్తే చాలు.. వెంటనే నిద్ర పడుతుంది. పడుకున్న వెంటనే గాఢ నిద్రలోకి జారుకుంటారు. అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
తేనె, సముద్రపు ఉప్పు (గళ్ల ఉప్పు), కొబ్బరినూనెలను సమాన భాగాల్లో తీసుకోవాలి. వీటిని బాగా కలపాలి. అనంతరం ఆ మిశ్రమాన్ని ఒక టీస్పూన్ మోతాదులో నేరుగా తీసుకోవాలి. దీంతో బెడ్ మీద పడుకున్న వెంటనే గాఢ నిద్ర వస్తుంది. వెంటనే నిద్రలోకి జారుకుంటారు.
అయితే ఈ మిశ్రమాన్ని ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో కలిపి కూడా తాగవచ్చు. ఈ మిశ్రమం మనస్సును ప్రశాంతంగా మారుస్తుంది. హాయిని అందజేస్తుంది. ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. దీంతో నిద్ర బాగా పడుతుంది.