Urine Infection : ఒంట్లో వేడి, మూత్రంలో మంట, యూరిన్ ఇన్ఫెక్షన్.. తగ్గాలంటే ఇలా చేయాలి..!

Urine Infection : మ‌న‌లో చాలా మంది మూత్రంలో మంట స‌మ‌స్య‌తో ఇబ్బంది ప‌డుతుంటారు. మూత్రంలో మంట రావ‌డానికి అనేక కార‌ణాలు ఉన్నాయి. మూత్ర‌పిండాల్లో రాళ్లు, మూత్రాశ‌యంలో ఇన్ఫెక్ష‌న్ లు, నీటిని త‌క్కువ‌గా తాగ‌డం వంటి అనేక కార‌ణాల వ‌ల్ల మూత్రంలో మంట స‌మ‌స్య త‌లెత్తుతుంది. అలాగే పొత్తి క‌డుపులో నొప్పి, మూత్రం ఎరుపు రంగులో రావ‌డం, మూత్ర విస‌ర్జ‌న‌కు ఎక్కువ‌గా వెళ్లాల్సి రావ‌డం వంటి స‌మ‌స్య‌లు కూడా వ‌స్తూ ఉంటాయి. వీటి కార‌ణంగా నీర‌సం, జ్వ‌రం వంటి ల‌క్ష‌ణాలు కూడా కొంద‌రిలో క‌నిపిస్తాయి. మూత్రంలో మంట స‌మ‌స్య‌తో పాటు ఇత‌ర మూత్ర సంబంధిత స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించే ఇంటి చిట్కా గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ చిట్కాను త‌యారు చేసుకోవ‌డానికి గానూ మ‌నం కేవ‌లం మూడు ప‌దార్థాల‌నే ఉప‌యోగించాల్సి ఉంటుంది. మూత్రంలో మంట స‌మ‌స్య‌ను త‌గ్గించే ఇంటి చిట్కా ఏమిటి.. దీనిని త‌యారు చేయ‌డానికి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి… దీనిని ఎలా త‌యారు చేసుకోవాలి… అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ చిట్కాను త‌యారు చేసుకోవ‌డానికి గానూ మ‌నం ధ‌నియాల పొడిని, ప‌టిక బెల్లాన్ని, ఉప్పును ఉప‌యోగించాల్సి ఉంటుంది. ఈ చిట్కాను త‌యారు చేయ‌డానికి గానూ ఒక గిన్నెలో ఒక టీ స్పూన్ ధ‌నియాల పొడిని తీసుకోవాలి. త‌రువాత ఇందులో ఒక టీ స్పూన్ ప‌టిక బెల్లాన్ని తీసుకోవాలి. త‌రువాత ఒక చిటికెడు ఉప్పును వేయాలి. త‌రువాత ఇందులో ఒక గ్లాస్ నీటిని పోసి స్ట‌వ్ మీద ఉంచి వేడి చేయాలి. ఈ నీటిని 10 నుండి 15 నిమిషాల పాటు బాగా మ‌రిగించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా త‌యారు చేసుకున్న నీటిని రోజుకు మూడు సార్లు తాగాలి. ఉద‌యం ప‌ర‌గ‌డుపున‌, మ‌ధ్యాహ్నం భోజ‌నానికి అర‌గంట ముందు అలాగే రాత్రి ప‌డుకునే ముందు ఇలా మూడు సార్లు ఈ క‌షాయాన్ని తాగాలి.

Urine Infection home remedy in telugu works effectively
Urine Infection

ఈ విధంగా ఈ క‌షాయాన్ని తీసుకోవ‌డం వ‌ల్ల మూత్రంలో మంట స‌మ‌స్య త‌గ్గుతుంది. దీనితో పాటు మూత్రాశ‌య ఇన్ఫెక్ష‌న్ లు, శ‌రీరంలో వేడి వంటి స‌మ‌స్య‌లు కూడా త‌గ్గుతాయి. ధ‌నియాలు, ప‌టిక బెల్లంలో ఉండే ఔష‌ధ గుణాలు మూత్రంలో వేడిని, మంట‌ను త‌గ్గించి మూత్రం సాఫీగా జారీ అయ్యేలా చేయ‌డంలో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. మూత్రంలో మంట స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారు ఇలా ధ‌నియాల‌తో క‌షాయాన్ని చేసుకుని తాగ‌డం వ‌ల్ల స‌త్వ‌ర ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంది. అలాగే ఈ చిట్కాను పాటిస్తూనే రోజూ శ‌రీరానికి త‌గిన‌న్ని నీటిని తాగాలి. ఈ చిట్కాను క్ర‌మం త‌ప్ప‌కుండా వారం రోజుల పాటు వాడ‌డం వ‌ల్ల చ‌క్క‌టి ఫ‌లితాను పొంద‌వ‌చ్చు.

D

Recent Posts